palukubadiఒక ‘జల్లు’ పడిపోతుందనుకోండి, తెలంగాణలో ‘డల్లు’ పడింది అంటారు. ‘బట్ట తడుపు వాన’, ‘గొంగిడి తడ్పు వాన’ మొదలైనవి కూడా తెలంగాణ వర్షాభివ్యక్తులు.

కథలు, నవలలు మొదలైన తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆకాశం అంత మేఘావృతమైంది” అనే వాక్యాన్ని తరచూ చదువుతూ వింటూ వుంటాం. ఈ వాక్యానికి సమానార్థకంగా తెలంగాణ భాషలో ‘మొగులు మొత్తం మూసుకొచ్చింది’ అంటున్నారు. ఆకాశాన్ని తెలంగాణలో సాధారణంగా మొగులు అంటారు. ఇట్లా అనడంలో ప్రాంతీయ ముద్ర ఉన్నది. మలయాళంలో ముగిల్‌ అంటే పైన అని అర్థం. భూమికి పైన ఉండేదే ఈ ముగిల్‌ లేదా మొగులు. మేఘావృతం కావడానికి బదులుగా మూసుకొని వచ్చింది అనడం తెలంగాణ మాటలోని ప్రత్యేకత. విశాలంగా పరుచుకొని ఉన్న ఆకాశం వర్షానికి ముందు మబ్బులతో కలిసి దగ్గరికి రావడమని అర్థం. కాల్పనిక సాహిత్యంలోనే ‘కారుమబ్బులు అంతటా కమ్ముకుంటున్నాయి’ అనే వర్ణనలో భాగంగా చదువుతూ ఉంటాం. తెలంగాణలో మొగులు అంతా ఒక్కతీరుగ కల్పుకున్నది అంటాం. అంతేకాదు ‘మొగులు కొండోలె అయింది’ అని వ్యవహరిస్తాం. కారు మబ్బులు అంటే నల్లని మేఘాలు. మొగులు కొండోలె అవడం అంటే కొండలాగా నల్లగా కావడమే! సారంలో రెండూ ఒక్కటే, అభివ్యక్తి

తీరువేరు. ”మైసమ్మ మూలకు మబ్బు అయితే వాన పడుతది” అని తెలంగాణలో ఒక నమ్మకం. మైసమ్మ మూల అంటే వాయువ్య దిశ, దీనికి సమానార్థకంగా తెలుగులో ఒక వాక్యమో, విశ్వాసమో కనబడుటలేదు. తెలుగులోనే ఆకాశానికి చిల్లు పడినట్లుగా వాన అనే ఓ మాట ఉంది. ‘మొగులుకు తూటు పడ్డట్టు వాన’ అనేది తెలంగాణ వాక్యం. అదనంగా తెలంగాణలో ‘ఏనుగు తొండమంత దొడ్డుగా వాన నీళ్ళు పడుతున్నయ్‌’ అని కూడా అంటారు. తెలుగులో మంటికి మింటికి ఏకధారగా వర్షం అనే వాక్యం ఉంది. దీనికి సమానార్థకం తెలంగాణలో కనబడడంలేదు. వర్షానికి సంబంధించిన తెలుగులో భారీ వర్షం, కుంభవృష్టి, కుండపోత వాన మొదలైన పద బంధాలు ఉన్నాయి. తెలంగాణలో వీటిని వరుసగా పెద్దవాన, ముంతపోత వాన అని వ్యవహరిస్తున్నారు. భారీ వర్షం అనేది తత్సమం. అంటే సంస్కృత పదాలతో ఏర్పడింది. పెద్ద వాన అచ్చ తెలుగు మాట. కుంభవృష్టికి తెలుగు మాటే కుండపోత వాన. అయితే చిత్రంగా తెలంగాణలో ముంతపోత వాన అయ్యింది. కుండకు బదులు ముంత, ముంత లోహానిదైతే లోహయుగంనాటి మాట. అంటే ఆధునికం తెలుగుతో పోల్చినపుడు ఒకవేళ ముంత మట్టిదైతే రెండూ అంటే తెలుగు భాషలోని తెలంగాణ తెలుగులోని కుండ, ముంతలు రెండూ ఒకే కాలానికి చెందినవని అర్థమవుతుంది. వాన దన్క దంచుతుంది వంటి వాక్యాలు తెలంగాణవి.

”చంద్ర పరివేషం అర్షయాగం” అని తెలుగులో ఒక సామెత ఉంది. చంద్రుని చుట్టూ గుండ్రంగా ఒక వలయమే పరివేషం. అలా కనిపిస్తే వర్షం కురుస్తుందని నమ్మకం, తెలంగాణలో ‘చంద్రుని చుట్టు వరద గూడు కడితే వాన పడుతుంది’ అనే ఒక విశ్వాసం ప్రబలంగా వుంది, తెలంగాణలోని ‘వరద గూడు’ అచ్చ తెలుగు మాట. ‘కన్ను ఎర్రబడ్డా, మిన్ను ఎర్రబడ్డా కారక మానవు’ అనే సామెతకు తెలంగాణలో ‘మొగులు ఎర్రదాలు పడ్డది. వాన తప్పక వస్తది’ అని చెబుతారు. ఆకాశంలో ఎరుపురంగు మేఘాలు కనిపిస్తే వర్షాగమనం తప్పదు అన్నమాట. ‘ఎర్రడాలు’ అంటే అదే అర్థం. తెలుగులోని ‘మేఘాలు’ తెలంగాణలో ‘తెప్పలు’ అవుతాయి. ‘తెప్ప’ ఎంత మంచి మాట! సాధారణార్థంలో తెప్ప అంటే సముద్రంవంటి జలాశయాల్లో ఉపయోగించే సాధనం. దాని సాయంతో, జలాశయాల్లో ఉపయోగించే సాధనం. దాని సాయంతో జలాశయాల్లో పయనిస్తాం, గట్టుకి చేరుతాం, ఆకాశంలోని మబ్బుల్ని ‘తెప్పలు’ అనడం తెలంగాణీయుల ఊహాశక్తికి గొప్ప ఉదాహరణ. వాళ్ళ ఆకాశం సముద్రం వంటిది. ఎందుకని? సముద్రంలాగే ఆకాశమూ నీలం రంగులో ఉంటుంది. పైగా విశాలంగా పరచుకుంటుంది. ఆ నీలాకాశంలో తెల్లగా కనిపించేవి తెలంగాణా వాసులకు మేఘాలు కాదు తెప్పలు, అందుకే వర్షం కొద్దిగా పడిపోతే ‘అవి తెప్ప చినుకులు’ అంటుంటారు.

ఇక తెలుగులో ఒక ‘జల్లు’ పడిపోతుందనుకోండి, తెలంగాణలో ‘డల్లు’ పడింది అంటారు. ‘బట్ట తడుపు వాన’, ‘గొంగిడి తడ్పు వాన’ మొదలైనవి కూడా తెలంగాణ వర్షాభివ్యక్తులు. ‘సానుపు చల్లినట్లు’ అనేది సైతం వర్ష సంబంధితం. ఇక వర్షాలు జోరుగా కురిసినప్పుడు ‘వాగులు, వంకలు గట్లొరసి ప్రవహిస్తున్నాయి’ అంటారు తెలుగులో. మరి తెలంగాణలో? ‘వాగులు, ఒర్రెలు ఈ గడ్డ ఆ గడ్డ పట్టుకుని పారుతన్నై’ అంటారు. తెలుగులోని ‘వంక’ అంటే ఏమిటి? వంకరగా పారుతున్న చిన్నపాటి వాగు. తెలంగాణలోని ‘ఒర్రె’ అంటే అర్థం? నీరు నిండుగా వుండి ఆ నీటి ధ్వనితో అది ఒర్రడం, అరవడం అన్నమాట. తెలుగులో ‘గట్లు ఒరసి ప్రవహించడం’, తెలంగాణలో ‘ఆ గడ్డ ఈ గడ్డ పట్టుకుని పారడం’ – రెండూ ఒక్కటే! అయితే దేని అభివ్యక్తి దానిదే! ఆకాశం మేఘావృతం అయినప్పుడు, కారు మబ్బులు కమ్ముకుంటున్నప్పుడు తెలంగాణలో ‘మొగులు మెత్తవడుతది’. ఎంత అద్భుతమైన అభివ్యక్తి ఇది! మొగులు మెత్తపడడం అంటే వాన కురిపించడానికి సిద్ధంగా వరుణుడు కరుణ చూపించడం. మొగులు మెత్తవడటానికి సమానార్థకం తెలుగులో అంటే రెండు తెలుగు రాష్ట్రాల మూడు తెలుగు ప్రాంతాల ఆధునిక ప్రమాణ భాషలో లేదు.

Other Updates