tsmagazineతెలంగాణలో మౌళిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కు ఱఅటతీaర్‌తీబష్‌బతీవ వనబఱజూఎవఅ్‌ ఎaఅబటaష్‌బతీఱఅస్త్ర జూaతీస) ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. భవన నిర్మాణాలు, ప్రాజెక్టులు, మైనింగ్‌ వంటి మౌళిక వసతుల పనుల్లో ఉపయోగించే పరికరాల తయారీకి ప్రత్యేకంగా ఒక పార్కు అనేది దేశంలో మెదటిసారి తెలంగాణలో ఏర్పడనున్నట్లు అయన తెలిపారు. ఈ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ (ఒట్టివో ఏకాణమిక్‌ జోన్స్‌)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బెంగుళూరులో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం జహీరాబాద్‌లోని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మరియు మాన్యూఫాక్చరింగ్‌ జోన్‌ లో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ యంత్ర పరికరాల తయారీ యూనిట్ల కోసం పార్కు ఏర్పాటు చేస్తారు. ఈ రంగంలో పేరున్న ూతీఱస్త్రఱఅaశ్రీ వనబఱజూఎవఅ్‌ ఎaసవతీర ఈ పార్కులో తయారు యూనిట్లను ఏర్పాటు చేస్తారని మంత్రి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం, శ్రేయి ఇన్ప్రాస్టక్చర్స్‌ కంపెనీ ఉమ్మడి భాగసామ్యంలో ఏర్పాటు అయ్యే ఈ పార్కులో పెట్టుబడిదారులు, కార్మికులు, కస్టమర్లకు అవసరం అయిన (వర్క్‌ ్‌శీ జూశ్రీaవ పద్ధతిన ఏర్పాటయ్యే ఈ పార్కులో) అన్ని సౌకర్యాలు ఉంటాయని మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఈ పార్కు ఏర్పాటు ద్వారా రానున్న పది సంత్సరాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సూమారు 10 వేల ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ పార్కులో పెట్టుబడులతో వచ్చే తొలి 5 యాంకర్‌ పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇచ్చే సాధారణ రాయితీలకు అదనంగా మరిన్ని రాయితీలను అందిస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఈ పార్కులో పెట్టుబడులను పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపిన మంత్రి మరిన్ని కంపెనీలు తెలంగాణకు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ పార్కుకు సంబంధించిన భూసేకరణ పూర్తయిందని, త్వరలోనే ఈ పార్కు లాంఛనంగా శంకుస్థాపన చేస్తామన్నారు. శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ ఉపాధ్యక్షులు సునీల్‌ కనోరియా మాట్లాడుతూ గత రెండున్నర దశాబ్దాలుగా తమ కంపెనీ మౌలిక వసతుల రంగంలో అనేక పెట్టుబడులు పెడుతున్నదని, ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న ఈ పార్కు ద్వారా తెలంగాణ పారిశ్రామికాభివద్ధి మరింత వేగవంతమై, వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. విప్లవాత్మకమైన పాలసీలతో ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఈ పార్క్‌ ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలు, పారిశ్రామిక విధానం ద్వారా అనేక పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షిస్తుందని మంత్రి తెలిపారు. ఈరోజు ఉదయం మంత్రి మౌళిక వసతుల యంత్ర పరికరాల తయారీదారులతో సమావేశమయ్యారు. మొత్తం భారతదేశానికి రవాణా పరంగా తెలంగాణ మధ్యలో ఉంటుందని, దేశ నలుమూలలకు ఇక్కడి నుంచి సరుకుల రవాణా సులభంగా ఉంటుందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల నేపథ్యంలో ఇక్కడే అయా యంత్ర పరికరాల తయారీ చేపట్టడం కలిసి వస్తుందని ఆయన వారికి వివరించారు. ఇప్పటికే మౌళిక వసతుల యంత్ర పరికరాల కొనుగోలులో తెలంగాణ ప్రముఖ స్ధానంలో ఉన్నదని, అలాంటి చోటనే ఈ యంత్రాల తయారీని చేపట్టాలని కోరారు.
మౌళిక వసతుల కల్పన ద్వారానే అభివద్ధి: కెటిఆర్‌
ఎక్స్‌ కాన్‌- 2017 సదస్సులో భాగంగా నిర్వహిచిన అవఞ్‌స్త్రవఅ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే అంశంపై ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్‌ కర్నాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆర్వీ దేశ్‌ పాండేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మౌలిక వసతుల కల్పన ద్వారా మాత్రమే దేశం అభివద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన తమ ముఖ్యమంత్రి సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, మిషన్‌ భగీరథ వంటి ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు అభివద్ధి ఫలాలు అందించేందుకు ముందుకు పోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మౌళిక వసతుల ప్రాజెక్టుల నేపథ్యంలో రాష్ట్రంలోనే మౌళిక వసతుల యంత్ర పరికరాల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ద్వారానే సమ్మిళిత అభివద్ధి సాధ్యమవుతుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. రానున్న ఎక్స్‌కాన్‌ ఎక్సోఫోను హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి నిర్వాహకులను కోరారు.

Other Updates