kcr

‘యాదాద్రి’గా-లక్ష్మీనరసింహక్షేత్రం-నవగిరులుగా-అభివృద్ధి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రధాన ఆలయం ఉన్న యాదగిరిగుట్టతో పాటు దాని చుట్టూ ఉన్న మరో ఎనిమిది గుట్టలను కలుపుకొని ‘నవగిరులు’గా, గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు.

ముఖ్యమంత్రి కోరిక మేరకు యాదగిరిగుట్టకు ‘యాదాద్రి’గా త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామి నామకరణం చేశారు. మిగిలిన 8 గుట్టలకు కూడా త్వరలో నామకరణం చేస్తామని స్వామి చెప్పారు.
యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలన్నీ ఆగమశాస్త్రం ప్రకారమే ఉన్నాయని, ఆలయ పవిత్రత, సంప్రదాయం, ప్రత్యేకతలు చెక్కు చెదరకుండా సమగ్ర అభివృద్ధి కోసం చేసిన ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో కలిసి చిన జీయర్‌స్వామి మార్చి 5న యాదగిరిగుట్టపై ఏరియల్‌ సర్వే నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాఫ్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకున్న వీరిద్దరు గుట్ట చుట్టూ హెలికాఫ్టర్‌లో తిరిగారు.

లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న ప్రధాన యాదగిరిగుట్టతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకున్న చుట్టుప్రక్కల గుట్టలను కూడా ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. చిన జీయర్‌స్వామికి చూపించారు. యాదగిరిగుట్టకు దారితీసే రాయగిరి, వంగపల్లి, తుర్కపల్లి, రాజుపేట మార్గాలను, ఆయా ప్రాంతాలలో చేపట్టే పనులను ముఖ్యమంత్రి వివరించారు. రాయగిరి, యాదగిరిగుట్ట చెరువులను కూడా చూపించి వాటిని పర్యాటక కేంద్రాలుగా మిషన్‌ కాకతీయ కార్యక్రమం ద్వారా తీర్చిదిద్దుతామని చెప్పారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో రిజర్వు ఫారెస్టుగా ఉన్న ప్రాంతాన్ని కూడా చూపించి నరసింహాస్వామి అభయారణ్యపు ప్రతిపాదనలను చెప్పారు. నేషనల్‌ హైవే, రైల్వే లైను ప్రక్కనే ఉండడాన్ని కూడా చూపించి సుదూర ప్రాంతాలనుంచి కూడా భక్తులు సులువుగా ఈ పుణ్యక్షేత్రానికి రావచ్చని చెప్పారు.

అనంతరం యాదగిరిగుట్టలో నరసింహస్వామికి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల తరువాత చిన జీయర్‌స్వామికి ఆలయ ప్రాంగణంలోని అణువ ణువును ముఖ్యమంత్రి చూపించారు. పద్నాలుగున్నర ఎకరాల స్థలం గుట్ట పైభాగంలో వేరు వేరు ఎత్తుల్లో అందుబాటులో
ఉందని చెప్పారు. ఆరు ఎకరాల స్థలంలో ప్రధాన ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, దాని చుట్టూ మాడ వీధులు నిర్మిస్తామని, మ్యాపుల సహాయంతో ముఖ్యమంత్రి వివరించారు. ఆంజనేయస్వామి విగ్రహం, యాగశాల, ప్రవచనశాల, వంటశాల, కల్యాణమంటపం తదితర నిర్మాణాల ప్రతిపాదిత స్థలాలను, దిక్కులను ముఖ్యమంత్రి చూపించారు.

గుట్టపైనే 32 నరసింహుని రూపాలను ప్రతిష్ఠించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఆలయ నిర్మాణ రూపశిల్పులు, స్థపతి, వేదపండితులు, దైవక్షేత్రాల నిర్మాణ, నిర్వహణలో అనుభవజ్ఞులైన వారి సలహాలు, సూచనలు తీసుకుని డిజైన్‌ చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఆంజనేయస్వామి విగ్రహానికి అనుబంధంగా భక్తుల మండల దీక్షలకోసం ఒక హాలు నిర్మించనున్నట్లు కూడా ముఖ్యమంత్రి వెల్లడిరచారు.

ప్రధాన గుడికి ముందుభాగంలో మరో పెద్ద నిర్మాణం రాకుండా విశాలమైన ప్రాంగణాన్ని హరితనందనంగా తీర్చిదిద్దు తామని వెల్లడించారు. స్వామి వారికి మహా నైవేద్యం సమర్పించే ఆహార పదార్థాల తయారీకోసం ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే వంటశాల ఏర్పాటు చేస్తామన్నారు. గుట్టపై భాగంలో వంద వాహనాలు పట్టేలా పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తామని, గుట్ట క్రింది భాగంలో 5వేల వాహనాల వరకు పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు, పర్యాటకుల కోసం ఈ ప్రాంతంలో తిరిగేందుకు మోనో రైలు ఏర్పాటు చేయడం, దేవస్థానం ఆధ్వర్యంలోనే వాహన సౌకర్యం కల్పించడంలాంటి ఆలోచనలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.

కె.సి.ఆర్‌. ఆధ్యాత్మిక ఉద్యమం

kcrsdయాదగిరిగుట్ట అభివృద్ధికోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేస్తున్న ప్రయత్నాలను చిన జీయర్‌స్వామి అభినందించారు. ఆగమశాస్త్రం, వైదిక సంప్రదాయాలు, ఆచార విధానాల ప్రకారమే ఈ ప్రతిపాదనలన్నీ ఉన్నాయని చెప్పారు. ప్రజల కోసం అభివృద్ధి పనులు నిర్వహించడం ఒక ఎత్తైతే, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం మరొక ఎత్తని చిన జీయర్‌స్వామి అన్నారు. అభివృద్ధి శరీరం వంటిది, అయితే ఆత్మ ఆధ్యాత్మికమైనదని చెప్పారు. ఈ సత్యాన్ని గ్రహించిన కె.సి.ఆర్‌. తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించారని ప్రశంసించారు.

తాను ఇంతవరకు దేవాలయాల అభివృద్ధికి కట్టుబడిన ముఖ్యమంత్రిని, దృఢ సంకల్పం కలిగిన నాయకుడిని చూడలేదన్నారు. ఒక దివ్య క్షేత్రానికి ఏటా వంద కోట్ల రూపాయలు బడ్జెట్‌ కేటాయింపులు జరపడం కూడా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి అని చిన జీయర్‌స్వామి అభినందించారు. యాదగిరిగుట్ట అభివృద్ధికోసం కె.సి.ఆర్‌. చేస్తున్న ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చిన జీయర్‌స్వామి వెల్లడిరచారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ విద్యాసాగర్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యేలు శేఖర్‌రెడ్డి, వీరేశం, ఆలయ ఇఓ గీత, జేసీ సత్యనారాయణ, డిఎఫ్‌ఓ సత్యనారాయణ, యాదగిరి డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ కిషన్‌రావు, ఆర్కిటెక్టులు రాజ్‌, జగన్‌, టెంపుల్‌ ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి, స్థపతి సౌందర్‌రాజన్‌, తదితరులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేస్తున్న ప్రయత్నాలను చిన జీయర్‌స్వామి అభినందించారు. ఆగమశాస్త్రం, వైదిక సంప్రదాయాలు, ఆచార విధానాల ప్రకారమే ఈ ప్రతిపాదనలన్నీ ఉన్నాయని చెప్పారు. ప్రజల కోసం అభివృద్ధి పనులు నిర్వహించడం ఒక ఎత్తైతే, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం మరొక ఎత్తని చిన జీయర్‌స్వామి అన్నారు. అభివృద్ధి శరీరం వంటిది, అయితే ఆత్మ ఆధ్యాత్మికమైనదని చెప్పారు. ఈ సత్యాన్ని గ్రహించిన కె.సి.ఆర్‌. తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించారని ప్రశంసించారు.

తాను ఇంతవరకు దేవాలయాల అభివృద్ధికి కట్టుబడిన ముఖ్యమంత్రిని, దృఢ సంకల్పం కలిగిన నాయకుడిని చూడలేదన్నారు. ఒక దివ్య క్షేత్రానికి ఏటా వంద కోట్ల రూపాయలు బడ్జెట్‌ కేటాయింపులు జరపడం కూడా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి అని చిన జీయర్‌స్వామి అభినందించారు. యాదగిరిగుట్ట అభివృద్ధికోసం కె.సి.ఆర్‌. చేస్తున్న ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చిన జీయర్‌స్వామి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ విద్యాసాగర్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యేలు శేఖర్‌రెడ్డి, వీరేశం, ఆలయ ఇఓ గీత, జేసీ సత్యనారాయణ, డిఎఫ్‌ఓ సత్యనారాయణ, యాదగిరి డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ కిషన్‌రావు, ఆర్కిటెక్టులు రాజ్‌, జగన్‌, టెంపుల్‌ ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి, స్థపతి సౌందర్‌రాజన్‌, తదితరులు పాల్గొన్నారు.

Other Updates