యాదాద్రి బ్రహ్మోత్సవ సంబురాలు ఫిబ్రవరి 27న అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను స్వస్తివాచనంతో వేదపండితులు, అర్చకులు, వేదఘోషతో శ్రీకారం చుట్టారు. ఈ పదకొండు రోజులు స్వామి వారికి వివిధ అలంకార సేవలు నిర్వహిస్తారు.
మార్చి
1న ఉదయం మత్స్యావతారం, రాత్రి శేషవాహన సేవ.
2న ఉదయం శ్రీకృష్ణాలంకారము, రాత్రి హంసవాహన సేవ.
3న ఉదయం వటపత్రశాయి అలంకారసేవ, రాత్రి పొన్నవాహనసేవ.
4న ఉదయం గోవర్ధనగిరిధారిసేవ, రాత్రి సింహవాహన సేవ.
5న ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి అశ్వవాహన సేవ(ఎదుర్కోలు).
6న ఉదయం హనుమంత వాహనంసేవ, రాత్రి తిరుకల్యాణ మహోత్సవం.
7న ఉదయం శ్రీమహావిష్ణువు అలంకారం,
రాత్రి స్వామివారి దివ్యవిమాన రథోత్సవం.
8న ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థము,
రాత్రి 10గంటలకు శ్రీవారి పుష్పయాగము, దోపోత్సవం.
9న ఉదయం శ్రీస్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం,
రాత్రి 10గంటలకు శృంగారడోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.