సెక్రటరీ ఫర్ బిజినెస్, ఇన్నోవేషన్, స్కిల్స్
మంత్రి సాజిద్ జావిద్ సమావేశం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి హబ్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని పంచాయితీరాజ్ ఐటిశాఖ మంత్రి కె.తారకరామ రావు అన్నారు. యూనైటెడ్ కింగడమ్ సెక్రటరీ పర్ బిజినెస్ , ఇన్నోవేషన్, స్కిల్స్ సాజిద్ జావిద్ తో డిసెంబర్ 10న టిహబ్ లో సమావేశమయ్యారు. టిహబ్ తో యూకే ప్రభుత్వం భాగసామ్యం నెలకోల్పేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. టి హబ్‌తోపాటు ఐటి, లైఫ్ సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, యానిమేషన్,గేమింగ్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు యూకే సంసిద్ధత వ్యక్తం చేసినట్టు మంత్రి తెలిపారు. సాజిద్ జావేద్‌తో సమావేశమైన మంత్రి ఆయనకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను తెలియజేశారు. పెట్టుబడులకి ఉతమిచ్చే పారిశ్రామిక పాలసీ విధానంలో ఉన్న సెల్ప్ సర్టిఫికేషన్, అనుమతులను అలస్యం చేసే అధికారులకి జరిమానాల వంటి అంశాలను మంత్రి జావేద్‌కి తెలిపారు. ఇలాంటి విధానాన్ని ప్రపంచంలో తాను ఎక్కడా చూడలేదని, చిన్న రాష్ట్రం అయినా ఇలాంటి గొప్ప పాలసీని ప్రవేశపెట్టినందుకు అభినందించారు. ఇక టిహబ్‌లోని సౌకర్యాలను పరిశీలించిన యూకే సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ అప్స్‌కి ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఆభినందించారు. టి హబ్‌లోని స్టార్ట్ అప్‌లతో కలిసి పనిచేసేందుకు సిధ్దంగా ఉన్నామన్నారు. ఇజ్రాయెల్ దేశంలోని స్టార్ట్ అప్స్‌కి చేయూతనిచ్చి 30 కంపెనీలను లండన్ స్టాక్ ఏక్సేంజీలో లిస్ట్ అయ్యేలా చూశామని, ఇలాంటి భాగసామ్యాన్ని తెలంగాణకు అందిస్తామని జావెద్ తెలిపారు. ఇక తెలంగాణలోని ఇతర పారిశ్రామిక రంగాల్లో ఉన్న అవకాశాలను తెలుసుకున్న యూకే సెక్రటరీ త్వరలోనే తమ లైప్ సైన్సేస్ కార్యదర్శిని ఇక్కడ పర్యటనకి పంపుతామని తెలిపారు.
యూకేలో పర్యటించేందుకు రావాల్సిందిగా మంత్రి కె.తారక రామారావుని అహ్వానించారు. యూకేలోని స్టార్ట్‌అప్, గేమింగ్ రంగాల్లోని పరిశ్రమలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయిచేందుకు సిద్ధంగా ఉన్నామని యూకే సెక్రటరీ మంత్రికి హమీ ఇచ్చారు.
యూకే సెక్రటరీ సాజిద్ జావిద్‌తోపాటు మంత్రి కె.తారకరామారావుల సమక్షంలో టి హబ్‌తో యూకేకు చెందిన లెడ్ మ్యాక్ లిమిటెడ్‌తో యంవోయూని కుదుర్చుకున్నారు. టి హబ్ సియివో జయ్ క్రిష్టన్‌తో లెడ్ మ్యాక్ ూaతీటతీaఓ నaఝఅ, సియివోలు యంవోయూని ఏక్సెంజీ చేసుకున్నారు. ఈ యంవోయో ద్వారా టి హబ్ ప్రపంచంలోని ప్రముఖ స్టార్ట్ అప్స్‌లతో సహకారం అందించేందుకు సహయ పడుతుందని మంత్రి కె.తారక రామారావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాజిద్ జావిద్‌తోపాటు ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా పాల్గొన్నారు.