youthతెలంగాణ యువత నైపుణ్యాలకు ‘టాస్క్‌’

అన్ని పనులను ప్రభుత్వమే చక్కదిద్దాలంటే కుదరదని పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానం ద్వారా ప్రైవేట్‌ సంస్థలు కూడా శిక్షణా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని అన్నారు మంత్రి కేటీఆర్‌.

తెలంగాణ అకాడమీ అప్‌ నాలెడ్జ్‌ అండ్‌ స్కిల్స్‌ ముఖ్యమంత్రి అలోచనల మేరకు భారీ ఎత్తున విద్యార్థుల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నదని పంచాయితీరాజ్‌ ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. టాస్క్‌ ఆదిలాబాద్‌ లాంటి మారు మూల జిల్లాల్లోని విద్యార్దులకి శిక్షణ ఇవ్వడం, వారికి ఉద్యోగాలు వచ్చేలా చేయడం పట్ల అత్యంత సంతోషాన్ని ఇస్తుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ బేగంపేటలోని టాస్క్‌ కార్యలయంలో టాస్క్‌ ఫినిషింగ్‌ స్కూళ్ల ద్వారా డిసెంబర్‌ 16న ఉద్యోగాలు పొందిన 43 మంది విద్యార్థులకి అఫర్‌ లెటర్లు అందజేశారు మంత్రి. ఇంకా విద్యార్థులకి ఇంటర్య్వూలు జరుగుతున్నాయని మరింత మంది విద్యార్థులకి ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు.

వచ్చే ఏడాది నాటికి టాస్క్‌ ద్వారా వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా విస్తరిస్తామన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మన టీవితో పాటు ఐటిశాఖ తరపున పనిచేస్తున్న డిజిటల్‌ మీడియా సెల్‌ ద్వారా నిరుద్యోగ యువకులకి అవసరమున్న కంటెంట్‌ ని అందించే ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. టాస్క్‌ ద్వారా ఉద్యోగాలు పొందిన విద్యార్థుల్లో అసక్తి ఉన్న వారు తమకు వీలు కుదిరినపుడు తమంతతాముగా వచ్చి తమ అనుభవాలను కొత్తగా శిక్షణ పొందుతున్న వారితో పంచుకోవాలని అది వారిలో స్ఫూర్తిని కలుగజేస్తుందన్నారు. విద్యాసంస్థల్లో విద్యాపాఠ్యప్రణాళికకి పరిశ్రమ వర్గాల అవసరాలకి సమన్వయం లేకుంటే విద్యకి అర్ధం లేదన్న మంత్రి… ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రయివేటు రంగంలోకి వెళ్లలనుకునే ఉద్యోగార్థులకి అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం పాటు పడుతుందని మంత్రి తారక రామారావు తెలిపారు.

ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు మార్గదర్శనంలో టాస్క్‌ కార్యక్రమాలు చేపట్టినట్టు టాస్క్‌ సియివో సుజీవ్‌ నాయర్‌ తెలిపారు. ఫినిషింగ్‌ స్కూల్‌ని మెదటి పైలట్‌ ప్రాజెక్టుగా వరంగల్‌లో చేపట్టి ఆ తర్వత ఆదిలాబాద్‌, రంగారెడ్డిలోనూ శిక్షణ ఇచ్చినట్టు సియివో తెలిపారు. త్వరలోనే మరింత మంది విద్యార్థులకి పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ సంతోషాన్ని మంత్రితో పంచుకున్నారు. ఆర్మూర్‌ నుంచి వచ్చిన మెన్నజం సుజాఫ్‌ తన జీవితంలో మార్పు తెచ్చిన టాస్క్‌కి ధన్యవాదాలు తెలిపారు. కాలేజీలో థియరీ నేర్చుకుంటే కార్పోరేట్‌ ఆఫీీసుల్లో ఉండే వాతావరణంలో ఇచ్చిన శిక్షణ ద్వారా ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు సాధించినట్టు తెలిపారు. ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వత ఒక సంవత్సరంపాటు ఉద్యోగం కోసం ఇబ్బంది పడ్డానని, శిక్షణ తర్వత హిటాచీ కంపెనీలో ఉద్యోగం లభించినట్టు తెలిపారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నుంచి వచ్చిన ప్రవీణ్‌ కూమార్‌, చాల చోట్ల శిక్షణ తీసుకున్నప్పటికీ ఎన్నోసార్లు విఫలమయినట్టు, టాస్క్‌లో ఇచ్చిన శిక్షణ వల్ల సాఫ్ట్ట్‌్‌ వేర్‌ ఉద్యోగం లభించిందని తెలిపారు. వరంరగల్‌ నుంచి వచ్చిన సాయిచరణ్‌ టాస్క్‌ ఫినిషింగ్‌ స్కూల్‌ ద్వారా నేర్పించిన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వల్ల ఈ రోజు తన థియరిటికల్‌ నాలెడ్జ్‌ని వ్యక్త పరచగలిగానని తెలిపారు. వరంగల్‌ నుంచి వచ్చిన మౌనిక ఇన్‌ సిగ్నీటీ కంపెనీలో ఉద్యోగంలో చేరినందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక కాలేజీ నుంచి వచ్చిన తమకి ఈ శిక్షణ నమ్మకాన్ని కల్పించిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐటిశాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తోపాటు పలువురు టాస్క్‌ ప్రతినిధులు, కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.

Other Updates