vijayrajescindiaగ్వాలియర్‌ రాజమాత విజయరాజే సింథియా ఒకప్పటి జనసంఘ్‌లోను, ఆ తరువాత బీజేపీలోని ప్రముఖ నేతగా వెలుగొందారు. 1980లో బీజేపీ ఆవిర్భవించినప్పుడు ఆమె ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు. రెండేళ్ల తరువాత ఆరోగ్య సమస్యలు తలెత్తే వరకు ఆ పదవిలో ఉన్న బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అగ్రనేతల్లో ఒకరుగా భాసిల్లారు. నిర్ణయాత్మక ప్రక్రియలలో కీలకపాత్ర వహించారు. నెహ్రూ ఉండగానే ఆమె రెండుసార్లు కాంగ్రెస్‌ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికయ్యారు. తన 45వ జన్మదినోత్సవం జరుపుకున్న మరుసటిరోజు ఆమె భర్త జియాజీరావు సింధియా మరణించారు.

ఇందిరాగాంధీకి ముఖ్యమంత్రి డి.పి. మిశ్రా నమ్మినబంటు. ఆమెను ప్రధానిగా చేయడంలో ఆయన అత్యంత కీలకపాత్ర వహించారు. దీన్ని అదనుగా తీసుకొని ఆయన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తన అధికారాలను విచ్చలవిడిగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. తనమీద తిరుగుబాటు చేసిన బస్తరు మహారాజా ప్రవీణ్‌చంద్ర భంజ్‌దేవ్‌తోసహా అతని 200మంది అనుచరులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపిం చాడు. దీనితో గ్వాలియర్‌ విద్యార్థులు రెండు నెలలు సమ్మె చేశారు. తమకు న్యాయం జరిపించవలసిందని రాజ మాతను వారు వేడుకున్నారు. చివరకు రాజమాత విద్యార్థి ప్రతినిధివర్గాన్ని తీసుకొని ఇందిరాగాంధీని కలుసు కొనడానికి ఢిల్లీకి వెళ్ళింది. అతి కష్టంతో ప్రధానమంత్రి దర్శనమైతే అయ్యింది, కానీ మిశ్రాకు ఇలా చేయకు అని చెప్పలేకపోయింది. దీనితో విసుగెత్తిపోయిన రాజమాత కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిపోయారు.

ఎమర్జెన్సీలో రాజమాతను అరెస్టుచేసి ఢిల్లీలోని తీహారు జైల్లో రెండు నెలలు ఉంచి ఖైదీ నెం. 2265గా మార్చారు. ఆరోగ్య కారణాలవలన రెండు నెలల తరువాత విడుదల చేశారు. ఆ కుటుంబానికి ఇందిరాగాంధీ చర్యలవల్ల చాలా నష్టం వాటిల్లింది. ఆమె కుమారుడు మాధవరావు సింధియా కాంగ్రెస్‌లో చేరి ఆ తరువాత కేంద్రమంత్రి అయ్యారు.

ప్రాంతీయ పార్టీలు చీలినా బలపడని కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ పార్టీ బలపడడానికి ప్రాంతీయ పార్టీలలో వచ్చిన చీలికలు పనిచేయడంలేదు. తమిళనాడులో డీఎంకే చిత్త చాపల్య మార్గాలలో ప్రజలు విసిగిపో యినప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రావలసింది. కానీ, దానికి బదులుగా దాని చీలికవర్గమైన అన్నాడీఎంకే అధి కారానికి వారసురాలైంది. బీహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అహంకారం పెరిగిపోయింది. ఆయన పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పాట్నాలో విజయపతాకం ఎగురవేసింది కాంగ్రెస్‌ కాదు. నితీష్‌కుమార్‌ లాలుకన్నా ఎక్కువ కాలం కాంగ్రెస్‌ను బీహార్‌కు దూరంగా ఉంచుతానని చెబుతున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 25 ఏండ్ల క్రితమే కుప్పకూలింది. ములాయంసింగ్‌ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ ఒకటి తరువాత ఒకటిగా అధికారానికి రావడం ప్రారంభించాయి. ఓటర్లు ఈ రెండు పార్టీలతో విసిగిపోయినప్పుడు కాంగ్రెస్‌ పంచన చేరలేదు. నాల్గవశక్తి అయిన మాయావతిని అక్కున చేర్చుకున్నారు.

బెంగాల్‌లో వామపక్షాలు చీలిపోలేదు. కాంగ్రెస్‌ చీలిపోయింది. వామపక్షాలు కుప్పకూలినప్పుడు మరోసారి ఓటరు ప్రత్యామ్నాయంగా మమతా బెనర్జీని విశ్వ సించారు. కానీ కాంగ్రెస్‌ని కాదు. కాంగ్రెస్‌ని గెలిపించలేదు.

Other Updates