usmaniyaజి.వెంకటరామారావు

విద్యా, పరిపాలనా రంగాలలోనే గాక, దేశ భక్తికి వాసిక్కిెన కుటుంబం ఆలీయావర్‌ జంగ్‌ది. ఆయన తాత ఇమాదుల్‌ ముల్క్‌ ఉత్తర ప్రదేశ్‌లో ప్రసిద్ధిక్కిెన ‘బిల్‌గ్రామీ’ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆ రోజుల్లో ‘సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’గా పని చేస్తున్న లార్డ్డ్‌్‌ మోర్లీ వద్ద పని చేసిన ఇద్దరు భారతీయులలో ఇమాదుల్‌ ముల్క్‌ ఒకరు. హైదరాబాద్‌ సంస్థానపు ప్రధాని మొదట సాలార్‌జంగ్‌ ఆహ్వానం పై ఇక్కడి కొచ్చి విద్యాశాఖ డైరెక్టరుగా పనిచేశాడు. అలీయావర్‌ జంగ్‌ తండ్రి ఖదీవ్‌ జంగ్‌. తనకొక అనుభవజ్ఞుడైన అధికారి కావాలని కశ్మీర్‌ మహారాజు హరిసింగ్‌ కోరడంతో నిజాం అతన్ని ఆ రాష్ట్రానికి పంపించాడు. అలీయావర్‌ జంగ్‌ సోదరి మసూమాబేగం, సంజీవయ్య మంత్రి వర్గంలో మంత్రి పదవి పొంది దేశంలో మొదటి ముస్లిం మహిళా మంత్రిగా పేరు తెచ్చుకుంది.

అలీయావర్‌ జంగ్‌ 1905 ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. నిజాం కళాశాలలో చదువు పూర్తి చేసుకొని ఆక్సుఫర్డ్‌లోని క్వీన్స్‌ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. హైదరాబాద్‌కు తిరిగిరాగానే ఉస్మానియాలో చరిత్ర శాఖలో రీడర్‌గా చేరి, అనంతరం ప్రొఫెసర్‌ అయ్యారు. ఆ తరువాత ప్రభుత్వం ఆయన సేవలను పరిపాలనా రంగానికి వినియోగించుకుంది. సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గాను, ¬ంశాఖ కార్యదర్శిగాను పనిచేసారు. అలీయావర్‌ జంగ్‌ సెక్యులర్‌ విధానాలు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీర్‌లాయక్‌ అలీకి ఇష్టంగా ఉండలేదు. దాంతో ఆయనను ¬ంశాఖ నుంచి రాజ్యాంగ వ్యవహారాల శాఖకు మార్చారు.

హైదరాబాద్‌ సమస్యను ప్రపంచ సంస్థలో వాదించమని ఆయనను కోరినప్పుడు అలీయావర్‌ జంగ్‌ అందుకు అంగీకరించలేదు. రాచరిక వ్యవస్థకు ప్రపంచ సంస్థలో మద్దతు లభించదని ఆయన ఖరాఖండిగా చెప్పి తప్పుకున్నారు. ఆనాటి ప్రభుత్వ విధానాలకు ఇష్టపడక సుదీర్ఘ సెలవుపై వెళ్లిన అధికారులలో అలీయావర్‌ జంగ్‌ ఒకరు. పోలీసు చర్య తర్వాత ఆయన ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌చాన్సులర్‌ అయ్యారు. పోలీసు చర్య జరిగిన తొలి రోజులలో ఇద్దరు యువకులు రాత్రి వేళలలో తలలకు రుమాళ్ళు చుట్టుకొని హైదరాబాద్‌ నగరంలో తిరుగుతూ కనిపించేవారు. నమ్మండీ! నమ్మకపోండి! అందులో ఒకరు మిలిటరీ గవర్నరు మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌదరీ, రెండో వ్యక్తి ఉస్మానియా కు వి.సి.గా నియమితులైన అలీయావర్‌ జంగ్‌. శాంతి భద్రతల పర్యవేక్షణ నిమిత్తం మఫ్టీలో వారు అలా తిరిగేవారు.

అలీయావర్‌ జంగ్‌ వైస్‌ చాన్సులర్‌గా ఉన్న రోజుల్లో ఉస్మానియాలో అనేక మార్పులు జరిగాయి. ఉర్దూ స్థానంలో ఇంగ్లీషు బోధనా భాష అయింది. మిలటరీ గవర్నరుతో తనకున్న చనువుతో కోఠీలోని రెసిడెన్సీ భవనాన్ని ఉస్మానియా మహిళా కళాశాలకు ఇప్పించారు. ఉద్యోగులకు ఉన్నత విద్య నేర్చుకునే అవకాశం కల్పిస్తూ సాయం కళాశాల పద్దతిని హైదరాబాద్‌లో ప్రవేశ పెట్టారు. ఆయన 1945, 1946, 1948-1952 వరకు వైస్‌ చాన్సులర్‌గా పని చేశారు.

సెక్యులర్‌ భావాలు కలిగిన అల్పసంఖ్యాక వర్గాల యువకులకు నెహ్రూ నుంచి మంచి ప్రోత్సాహం లభించేది. ఆ అదృష్టం పొందిన వారిలో అలీయావర్‌ జంగ్‌ ఒకరు. ఆనాటి నుంచి ఆయన విజయ పరంపర ప్రారంభమైంది. 1950 నుంచి 1955 వరకు ఆయన ఐక్య రాజ్యసమితిలో భారత ప్రభుత్వం ప్రతినిధి గాను, ఆ తరువాత దాని ఉప నాయకుడు గాను పని చేశారు. 1956లో ఆగ్నేసియా ఆర్థికాభి సంఘానికి ఆయన అధ్యక్షులయ్యారు. ఐక్య రాజ్యసమితి వ్యవహారాల పరిశీలనా నిపుణుడుగా ఆయనకు మంచి పేరు వచ్చింది. ప్రముఖ విద్యావేత్తగా భారత ప్రభుత్వం అలీయావర్‌ జంగ్‌ సేవలను ఉపయోగించుకుంది. యూ నివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌, ఇంటర్‌ యూనివర్సిటీ బోర్డు, స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్‌ నేషనల్‌ స్టడీస్‌ సంస్థలలో ఆయనకు సభ్యత్వం లభించింది. అమీర్‌ ఖుస్రూ జీవిత చరిత్రను ఆయన ఆంగ్లంలో రచించారు.

దౌత్యరంగంలో అలీయావర్‌ జంగ్‌ది ఒక ప్రత్యేక శకమని చెప్పవ చ్చు. బ్యూనస్‌ ఏయిర్‌ (ఆర్జెంటినా రాజధాని), కైరో, బెల్‌గ్రౌడ్‌, ప్యారిస్‌, వాషింగ్టన్‌లలో ఆయన భారత రాయ బారిగా పనిచశారు. అర్జెంటినాలో ఆయన రాయబారిగా ఉన్న రోజుల్లో ఆ దేశాధ్యక్షుడు పెరాన్‌ నిరంకు శత్వానికి మారుపేరుగా చెలామణిలో ఉండేవాడు. దౌత్యవేత్త ఇచ్చే విందులకు హాజరుకావడానికి ఆయన విముఖత చూపేవారు. అలాంటి వ్యక్తి అలీయావర్‌ జంగ్‌ ఇచ్చిన విందులో పాల్గొన్నారంటే అది భారత్‌ ఎడల ఆయనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచింది.

అలీయావర్‌ జంగ్‌ కైరోలో భారత రాయబారిగా నియమితుడైనప్పుడు జనరల్‌ నజీబ్‌ నుంచి నసర్‌ పరిపాలన హస్తగతం చేసుకునే రోజులు. మనకు మిత్రులెవరో, శత్రువులెవరో పరిక్షించిన తరువాతనే నసర్‌ విదేశీ ప్రతినిధులకు ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అలీయావర్‌ జంగ్‌కు కైరో కొచ్చిన నెల రోజుల వరకు నాసర్‌కు తన నియామక పత్రాలు సమర్పించుకునే అవకాశం లభించలేదు. దీనితో విసుగెత్తిపోయిన జంగ్‌ ‘మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వక పోతే నా దేశానికి తిరిగి పోయేటందుకైన అనుమతి ఇవ్వండి’ అని గట్టిగా ఒక లేఖ రాశారు. వెంటనే అలీయావర్‌ జంగ్‌కు నాసర్‌ ఇంటర్వ్యూ లభించింది. వారి మధ్య మొదటి సమావేశమే రెండు గంటలు సాగింది. సూయెజ్‌ కాలవ సంక్షోభం సమయంలో నాసర్‌ అడుగడుగున అలీయావర్‌ జంగ్‌ సలహాలు తీసుకునేవారు. ఆయన తన పదవీ కాలం ముగింపుకొచ్చిన రోజున ఇచ్చిన అధికార విందులో బేగవ్‌ు నాసర్‌ ూడా పాల్గొన్నారు. ఇది ఆ రోజుల్లో ఎంతో ముఖ్యవార్త అయినది. ఎందుకంటే అరబ్‌ దేశాధినేతల సతీమణులు అధికార విందుల్లో పాల్గొనటం అపురూపం. ఆ తరువాత అలీయావర్‌ జంగ్‌ను బెల్‌గ్రేడ్‌లో భారత రాయబారిగా నియమించారు. బెల్‌గ్రేడ్‌లో ఉన్నప్పుడు ఆయన టిటో – నెహ్రూల మధ్య సంబంధాలు దృఢతరం చేసే చేసే పనిలో విజయం పొంది అలీన విధాన పటిష్టతకు తోడ్పడ్డారు. ప్రాన్స్‌లో రాయబారిగా ఉన్నప్పుడు అలీయావర్‌ జంగ్‌ ఫ్రెంచ్‌ అధ్యక్షుడు డిగాల్‌తో ఫ్రెంచ్‌ భాషలో మాట్లాడి ఆయనకు సన్నిహితులైనారు.

1965లో అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో సెక్యులర్‌ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అమలు పరిచే సమర్థుడుగా అలీయావర్‌ జంగ్‌ను భావించి రాష్ట్రపతి ఆయనను వైస్‌ చాన్సులర్‌గా నియమించారు. ఈ పనిలో జంగ్‌కు అనేక ఇబ్బందులెదురైనాయి. ఒక సందర్భంలో ఆయనకు ప్రాణహాని ూడా జరిగింది. కానీ అలీయావర్‌ జంగ్‌ వాటిని లెక్క పెట్టకుండా తనపని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం తిరిగి ఆయన సేవలను దౌత్య రంగానికి తీసుకొని వాషింగ్టన్‌లో భారత రాయబారిగా నియమించింది. కానీ అక్కడ వాతావరణం ఆయన ఆరోగ్యానికి సరిపడలేదు. రెండేళ్ళు కాగానే ఆయనను మహారాష్ట్రకు గవర్నరుగా నియమించారు. ఆ పదవిలో ఆయన ఆరేళ్ళున్నారు.

నవాబుల కుటుంబంలో పుట్టినా సాధారణ జీవితం గడిపిన వ్యక్తి అలీయావర్‌ జంగ్‌. వ్యవహారంలో నిక్కచ్చి మనిషి. సిఫారసులంటే మండిపడేవారు. అలాంటివారు ఎదురైతే ‘మీరు పని చేయరు. ఇతరులను పని చేయనీయరని’ దులిపి పారేసేవారు. హైదరాబాద్‌ ఉన్నత సంస్కృతిలో పుట్టి పెరిగిన వ్యక్తి. ప్రాథఃకాలం నాల్గు గంటల లేచి చాయ్‌ తాగే అలవాటు ఉండేది కానీ ఆ సమయంలో నౌకర్లను లేపడం ఇష్టం లేక రాజ్‌భవన్‌లో స్వయంగా చాయ్‌ పెట్టుకునేవారు. రాజ్‌భవన్‌కు వచ్చే అతిధులకు వీడ్కోలు పలిటేప్పుడు కారుదాకా వచ్చి సాదరంగా వారిని సాగనంపేవారు. అలీయావర్‌ జంగ్‌ సేవలకు భారత ప్రభుత్వం గౌరవించి ఆయనకు పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ బిరుదులిచ్చి సత్కరించింది. ఢిల్లీలో జరుగనున్న గవర్నర్ల సమావేశంలో పాల్గొనడానికి ఆయన శాంతాక్రజ్‌ విమానాశ్రయానికి రాగానే గుండెపోటు వచ్చింది. ఢిల్లీకి వెళ్లే బదులు ఆస్పత్రిలో చేర్పించారు. దేశానికి ఎన్నో విధాల సేవ చేసిన అలీయావర్‌ జంగ్‌1976 డిసెంబర్‌ 11వ తేదీన బొంబాయిలో కన్నుమూశారు.

Other Updates