వ్యక్తి ఆధ్యాత్మిక జీవన సాధనాక్రమంలో దేవాలయాలు ప్రముఖపాత్ర వహిస్తాయి. ప్రాచీన కాలం నుంచి ఆలయాలు వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా ప్రజలకు వినియోగపడుతున్నాయి. మన సంతోషాలు, బాధలు భగవంతుడితో పంచుకుంటాం. తమ కష్టాలు తొలగించే దైవానికి కతజ్ఞతలు తెలుపుకునే క్రమంలో ఆలయ దర్శనం చేసుకుంటాం. ప్రశాంతతను, మనోధైర్యాన్ని, సంపదను, శక్తిని ఇచ్చే దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, మనందరిదీ.
మొదటగా తెలంగాణాలో అత్యంత ప్రసిద్ధి చెందిన యాదగిరి గుట్ట దేవస్థానాన్ని అభివద్ధి చేయాలనే ఉద్దేశంతో ”యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీని” ఏర్పాటు చేసింది. ఈ అథార్టీకి ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి, వైస్ ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి జి. కిషన్‌రావు, భువనగిరి ఎం.పి, ఎమ్మెల్యే, ఆలేరు ఎమ్మెల్యే ఇంకా 13మంది సభ్యులు ఉన్నారు. వీరు దేవాలయ అభివద్ధికి అద్భుత ప్రణాళికను సిద్ధం చేశారు. యాదగిరిగుట్టను టెంపుల్ సిటీగా తీర్చిదిద్దాలనే తలంపుతో అనేక భవన సముదాయాలు, ఉద్యానవనాలు, ఆయా దేవతామూర్తుల విగ్రహాలు, చిన్న చిన్న ఆలయాలు మూల విరాట్టు దేవాలయం ఆధునీకరణ వంటివి ఎన్నో ఈ ప్రాజెక్టు ప్రణాళికలో భాగం.
ఇందులో ముఖ్యంగా గుట్టపైన చుట్టూ ప్రహరీ గోడ, మొదటి ప్రాకారం, రెండవ ప్రాకారం నిర్మించాలని నిర్ణయించారు.
మొదటి ప్రాకార మండపంలో 1. స్ట్రాంగ్‌రూం 2. వాహన మండపం
3. దేవతామూర్తుల వస్త్రములు ఉంచే గది 4. అష్టోత్తర మండపం
5. పూజా సామగ్రి ఉంచే గది 6. పేష్కార్ ఆఫీస్ & స్టాఫ్‌రూం
7. ఆంజనేయస్వామి, ఆకుపూజ మండపం 8. పూలు, పూలదండల స్టోర్ రూం నిర్మించడం జరుగుతుంది.
రెండవ ప్రాకార మండపంలో 1. అద్దాల మండపం
2. కళ్యాణ మండపం 3. అర్చకుల భోజనశాల 4. వంటశాల 5. రామానుజకూటం 6. పోటు 7. పోటు స్టోర్‌రూం 8. నిత్య అష్టోత్తరం 9. ప్రవచన మండపం 10. హోమగుండం 11. యజ్ఞశాల 12. దీపాలంకరణ మండపం 13. ఉత్సవ మండపం నిర్మిస్తారు.ముఖమండపంలో చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి.
1. ఆళ్వారు ఆలయం 2. ఆండాళ్ దేవాలయం 3. లక్ష్మీ అమ్మవారు 4. గరుడ ఆలయం 5. ఆంజనేయస్వామి దేవాలయం. ఈ ప్రాజెక్టులో భాగంగా తూర్పు, పడమర,
ఉత్తర, దక్షిణాల్లో నాలుగంతస్తుల గోపురాలతో పాటు, ఏడు అంతస్థుల మహారాజ గోపురం పడమర దిక్కులో, మూడంతస్తుల గోపురం తూర్పు వైపు, ఐదంతస్తుల విమాన గోపురం నిర్మాణం ప్రణాళికలో ఉన్నాయి. ఇవే కాకుండా మాడవీధి, బ్రహ్మూెత్సవం నిర్వహించే స్థలం, 108 అడుగుల ఆంజనేయస్వామి కాంస్య విగ్రహం, ఇ.వో క్యాంప్ ఆఫీస్, వి.వి.ఐ.పిల గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం జరుగుతుంది.
ఈ నిర్మాణక్రమంలో బాలాలయ నిర్మాణం చేపట్టారు. 2016లో యాదాద్రి నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యాయి. శరవేగంతో ఈ పనులు జరుగుతున్నాయి. రఘునాథ మహాపాత్ర స్థపతి, దక్షిణామూర్తి, సుందర రాజన్, శ్రీనివాసశర్మ నేతత్వంలో మొత్తం 500 మంది శిల్పులు పనిచేస్తున్నారు. దాదాపుగా అన్ని కట్టడాలు పూర్తి కావస్తున్నాయి. అదేవిధంగా టెంపుల్‌సిటీగా డెవలప్ చేసే దిశలో భాగంగా మోడ్రన్ విల్లాలు, కల్యాణ మండపం, సెంట్రల్ పార్క్, కమర్షియల్ కాంప్లెక్స్, హెలీపాడ్, సోలార్ ఎనర్జీ పవర్ సెంటర్, ఆరోగ్యకేంద్రం, ఓపెన్ ఆడిటోరియం, బస్ టర్మినల్ కళ్యాణ కట్ట, గండిచెరువు సుందరీకరణ, 700 కార్లకు సెంట్రల్ పార్కింగ్… వంటివి ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఆశ్రమ తరహా వాతా వరణంలో వేదపాఠశాల, శిల్పకళాశాల, డోనర్ స్కీం క్రింద విల్లాలు మొదలైనవి ప్రణాళికలో ఉన్నాయి. యాదగిరిగుట్ట అభివద్ధి క్రమంలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా స్వీకరించి తొందరలోనే వీటిని పూర్తిచేసే పట్టుదలతో ఉంది. దీనికై యాద్రిద్రి అభివద్ధికై ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో 100 కోట్లు మంజూరు చేసింది. అదే విధంగా వేములవాడ అభివద్ధికి ప్రభుత్వం చేేపట్టిన కార్యక్రమాలను సమీక్షించుకుందాం ప్రాచీన చరిత్ర, సంస్కతి కలిగిన వేములవాడ క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అంతేకాక ప్రాచీనమైనది కొన్ని కట్టడాలు పాక్షికంగా శిథిలమైనాయి. దేవాలయ వాస్తు, ఆగమశాస్త్ర ప్రకారం వేములవాడ క్షేత్రాన్ని, తదనుబంధ ఆలయాలను నూతనంగా తీర్చిదిద్దే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం ముమ్మరంగా చేపట్టింది. దీనికి సంబంధించి ఒక అభివద్ధి కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
కమిటీ సూచించిన, చేపట్టబోయే మార్పులు :
1. శ్రీ సీతారామచంద్రస్వామి, శివకల్యాణ మహోత్సవాలకు కల్యాణ వేదిక : ప్రతి సంవత్సరం నిర్వహించే శివకల్యాణోత్సవానికి 50 వేల మంది, శ్రీరామ నవమి రోజు జరిపే రథోత్సవ, కళ్యాణోత్సవాలకు సుమారు 2లక్షల మంది భక్తులు వస్తారు. భక్తుల రద్దీని నియంత్రించటం నిర్వాహకులకు కష్టసాధ్యం. ఆ కారణంగా సుమారు ఆరు ఎకరాల స్థలంలో కల్యాణ వేదిక స్థలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
2. దేవాలయ ఆవరణ రెండవ ప్రాకార నిర్మాణం : స్వామివారి ముఖ్య ఆవరణ ఇరుకుగా ఉన్నందువల్ల ఆలయానికి నాలుగు దిక్కులందు వెడల్పు చేసి రెండవ ప్రాకార నిర్మాణం నిర్మించ సంకల్పించారు.
3. స్వామి వారి ధర్మగుండం : గుడి చెరువుగా పిలువబడే ఒక పెద్ద చెరువు కట్టపైన స్వామి వారి ఆలయం ఉంది. ఆలయానికి ఈశాన్య దిశలో స్వామి పుష్కరిణి గుడి చెరువుకు అనుసంధానమై ఉంది. భక్తులు పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల ఆ నీరు ధర్మగుండంలోకి ప్రవహిస్తుంది. ఈ కారణంగా పుష్కరిణి, ధర్మగుండం రెండు కలుషితం అవుతున్నాయి. దీని నివారణకు ధర్మగుండాన్ని పునరుద్ధరించి కోనేరు వద్ద వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూసే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడే ఆధ్యాత్మిక ఉద్యాన వన ఏర్పాటుకు సంకల్పించారు.
4. వసతి భవన సముదాయం : టీటీడీ ధర్మశాల వెనుక గల ఖాళీ స్థలంలో, శివపురం పాత ధర్మశాలను తొలగించి 150 వసతి గదుల భవన నిర్మాణ ప్రతిపాదన జరిగింది.
5. వేద, ఆగమ, సంగీత, నాట్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కషి. ప్రస్తుతం ఉన్న సంస్క త పాఠశాల భవన విస్తరణ, ఆధునీకరణ.
6. భీమేశ్వర స్వామి ఆలయం ముందుగల ఖాళీ స్థలంలో బద్దిపోచమ్మ దేవాలయానికి క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.
7. రాజేశ్వర పురం పాతగదులు తొలగించి అక్కడ కొత్తగా దేవస్థాన పరిపాలన భవనం, ధర్మశాలల నిర్మాణం.
8. అనుబంధ దేవాలయమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నాంపల్లి గుట్టపై అనేక అభివద్ధి పనులను ప్రతిపాదించడమైనది. 1. పనోరమా వ్యూ, 2. ధ్యాన మందిరం 3. కోనేరు పునరుద్ధరణ 4. ఘాట్ రోడ్ వెంబడి ప్రొటెక్షన్ వాల్ 5. మంచినీటి సౌకర్యం 6. ఔషధ మొక్కలతో హరితహారం 7. సోలార్ పంప్ నిర్మాణం 8. ప్లానిటోరియం వీటి ఏర్పాటుకు రూపకల్పన జరిగింది.
ఈ నిర్మాణాల పునరుద్ధరణలకు ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఖమ్మం జిల్లా విడిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడింది. రాముని పేరుతో ఏర్పడిన ఈ జిల్లాలో ప్రసిద్ధమైన భద్రాచల క్షేత్రం
ఉంది. ఈ క్షేత్రం అభివద్ధికి, పరిసర ప్రాంతాల పరిరక్షణకు, అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 100 కోట్లు కేటాయిం చింది. ఆలయ పరిసరాలు, దేవాలయాల పునరుద్ధరణకు టెంపుల్ అథారిటీ నిర్ణయించింది. స్వామివారి కల్యాణ మండపం, అన్నదాన సత్రం, భద్రాచల రామాలయం పరిధిలో ఉన్న చిన్న ఆలయాల పరిరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలైన ధర్మపురి, బాసర, అలంపూర్ జోగుళాంబ, నవబ్రహ్మాలయాల పునరుద్ధరణ, శక్తిపీఠమైన జోగుళాంబ దేవాలయాన్ని అభివద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని, పరిసరాలను అభివద్ధి చేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్లు మంజూరు చేసింది. ఈ అభివద్ధిలో భాగంగా 75 లక్షలతో ఆలయ ప్రాకారం, 48 లక్షలతో బంజారా సత్రం, మూడంతస్తుల్లో రాజగోపుర నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గడిచిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణ, వాటి ఉద్ధరణ, అభివద్ధికి తగు చర్యలు తీసుకుంటూ, అత్యంత వేగంగా పనులు సాగేవిధంగా నిర్మాణ కార్యక్రమాలు త్వరగా పూర్తి అయ్యేవిధంగా ప్రణాళికలు వేసి ముందుకు సాగుతుంది.
ఇదే ఉత్సాహంతో భగవంతుని కపతో అన్నిరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ….
డా|| సాగి మనోహరి