రాష్ట్రంలో ఏప్రిల్‌ 11న జరుగనున్న లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,96,97,279 కాగా, ఇందులో 1,47,76,024 మంది మహిళలు, 1,49,19,751 మంది పురుషులు, 1504 మంది థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు ఉన్నారు. 18-19 ఏళ్ళ వయసు ఉన్న 6,52,744 మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటుహక్కు పొందారు. ఇందులో 3,65,548 మంది పురుషులు, 2,87,103 మంది మహిళలు, 93 మంది థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు ఉన్నారు. మొత్తం ఓటర్లలో దివ్యాంగులు 5,13,762 మంది ఉన్నారు.

జిల్లాల వారీగా అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 41,77,703 మంది ఓటర్లు, అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 2,47,419 మంది ఓటర్లు ఉన్నారు. శాసన సభ నియోజకవర్గాల వారీగా చూస్తే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 6,17,169 మంది, అత్యల్పంగా భద్రాచలంలో 1,45,509 మంది ఓటర్లు ఉన్నారు.

లోక్‌ సభ నియోజకవర్గాలలో అత్యధికంగా మల్కాజిగిరి నుంచి 31,49,710 మంది ఓటర్లు, అత్యల్పంగా మహబూబాబాద్‌ నుంచి 14,23,351 మంది ఓటర్లు ఉన్నారు.

పురుష ఓటర్లు అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 3,28,495 మంది , అత్యల్పంగా భద్రాచలంలో 70,168 మంది ఉన్నారు. మహిళా ఓటర్లకు సంబంధించి అత్యధికంగా శేరిలింగంపల్లి లో 2,88,538 మంది, అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 75,338 మంది ఉన్నారు.

పార్లమెంటు నియోజకవర్గాలలో….

1) ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 14,88,353 మంది

ఉన్నారు. వీరిలో పురుషులు 7,30,233 మంది, మహిళలు 7,58,064 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు 56 మంది ఉన్నారు. కొత్తగా చేరిన ఓటర్లు 38,588 మంది ఉన్నారు.

2) పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 14,78,062 మంది. వీరిలో పురుషులు 7,39,633 మంది , మహిళలు 7,38,346 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు 83 మంది ఉన్నారు. కొత్తగా చేరిన ఓటర్లు 34,440 మంది ఉన్నారు.

3) కరీంనగర్‌ – మొత్తం ఓటర్లు 16,50,893. వీరిలో పురుషులు 8,15,230 మంది, మహిళలు 8,35,629 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందిన వారు 34 మంది ఉన్నారు. కొత్తగా చేరిన ఓటర్లు 39,468 మంది ఉన్నారు.

4) నిజామాబాద్‌ – మొత్తం ఓటర్లు 15,52,838. వీరిలో పురుషులు 7,37,543, మహిళలు 8,15,266 మంది , థర్డ్‌ జెండర్‌ కు చెందిన వారు 29 మంది ఉన్నారు. కొత్తగా చేరిన ఓటర్లు 38,661 మంది.

5) జహీరాబాద్‌ – మొత్తం ఓటర్లు 14,97,996 మంది. వీరిలో పురుషులు 7,37,479, మహిళలు 7,60,456 మంది , థర్డ్‌ జెండర్‌ కు చెందిన వారు 61 మంది ఉన్నారు. కొత్తగా చేరిన ఓటర్లు 37,607 మంది ఉన్నారు.

6) మెదక్‌ – మొత్తం ఓటర్లు 16,02,947. వీరిలో పురుషులు 7,98,836 మంది, మహిళలు 8,04,070 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు 41 మంది ఉన్నారు. కొత్తగా చేరిన ఓటర్లు 38,648 మంది ఉన్నారు.

7) మల్కాజిగిరి – మొత్తం ఓటర్లు 31,49,710 మంది. వీరిలో పురుషులు 16,37,505 మంది. మహిళలు 15,11,856 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు 349 మంది ఉన్నారు. కొత్తగా చేరిన ఓటర్లు 52,143 మంది ఉన్నారు.

8) సికింద్రాబాద్‌ – మొత్తం ఓటర్లు 19,68,147 మంది. వీరిలో పురుషులు 10,24,917 మంది, మహిళలు 9,43,171 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు 59 మంది ఉన్నారు. కొత్తగా చేరిన ఓటర్లు 28,660 మంది ఉన్నారు.

9) హైదరాబాద్‌ – మొత్తం ఓటర్లు 19,57,772 మంది. వీరిలో పురుషులు 10,12,369 మంది, మహిళలు 9,45,271 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందినారు 132 మంది ఉన్నారు. కొత్తగా చేరినవారు 25,287 మంది ఉన్నారు.

10) చేవెళ్ళ – మొత్తం ఓటర్లు 24,42,600 మంది. వీరిలో పురుషులు 12,64,111 మంది, మహిళలు 11,78,259 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందిన వారు 230 మంది ఉన్నారు. కొత్తగా చేరినవారు 47,046 మంది ఉన్నారు.

11) మహబూబ్‌ నగర్‌ – మొత్తం ఓటర్లు 15,05,190 మంది. వీరిలో పురుషులు 7,51,216 మంది, మహిళలు 7,53,935 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు 39 మంది ఉన్నారు. కొత్తగా చేరినవారు 39,289 మంది ఉన్నారు.

12) నాగర్‌ కర్నూల్‌ – మొత్తం ఓటర్లు 15,87,281 మంది. వీరిలో పురుషులు 7,97,668 మంది, మహిళలు 7,89,574 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు 39 మంది ఉన్నారు. కొత్తగా చేరినవారు 41,209 మంది ఉన్నారు.

13) నల్గొండ – మొత్తం ఓటర్లు 15,85,433 మంది. వీరిలో పురుషులు 7,84,111 మంది, మహిళలు 8,01,295 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు 27 మంది ఉన్నారు. కొత్తగా చేరినవారు 39,997 మంది ఉన్నారు.

14) భువనగిరి – మొత్తం ఓటర్లు 16,27,527 మంది. వీరిలో పురుషులు 8,18,572 మంది, మహిళలు 8,08,925 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు 30 మంది ఉన్నారు. కొత్తగా చేరినవారు 40,378 మంది ఉన్నారు.

15) వరంగల్‌ – మొత్తం ఓటర్లు 16,66,085 మంది. వీరిలో పురుషులు 8,28,882 మంది, మహిళలు 8,37,021 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు 182 మంది ఉన్నారు. కొత్తగా చేరినవారు 39,975 మంది ఉన్నారు.

16) మహబూబాబాద్‌ – మొత్తం ఓటర్లు 14,23,351 మంది. వీరిలో పురుషులు 7,01,921 మంది, మహిళలు 7,21,383 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు 47 మంది ఉన్నారు. కొత్తగా చేరినవారు 36,401 మంది ఉన్నారు.

17) ఖమ్మం – మొత్తం ఓటర్లు 15,13,094 మంది. వీరిలో పురుషులు 7,39,525 మంది, మహిళలు 7,73,503 మంది, థర్డ్‌ జెండర్‌ కు చెందినవారు 66 మంది ఉన్నారు. కొత్తగా చేరినవారు 34,947 మంది ఉన్నారు.

Other Updates