shakthimanభారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ యంత్రాల ఉత్పత్తి సంస్థగా పేరొందిన తీర్థ్‌ అగ్రో టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (శక్తిమాన్‌)తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. రాష్ట్ర పరిశ్రమల మంత్రి . తారకరామారావు సమక్షంలో ప్రభుత్వాధికారులు, శక్తిమాన్‌ యాజమాన్యంతో మార్చి 16న ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో శక్తిమాన్‌ కంపెనీ తయారీ యూనిట్‌, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను 200 ఎకరాలలో ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి టీేఆర్‌ మాట్లాడుతూ, శక్తిమాన్‌ కంపెనీ ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 3500 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగిందని, స్వీయ ధృవీకరణ ద్వారా అనుమతులు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటులో స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని తెలిపారు.

శక్తిమాన్‌ కంపెనీ ఛైర్మన్‌ అశ్విన్‌ గోహిల్‌ మాట్లాడుతూ, తమ రెండో తయారీ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దీనిద్వారా ప్రత్యక్షంగా 500మందికి, పరోక్షంగా 1500మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. యావత్‌ దక్షిణ భారతదేశానికి అవసరమైన వ్యవసాయ పరికరాలను సరఫరా చేయడానికి, ఇక్కడి తయారీ ంద్రాన్ని వారధిగా ఉపయోగిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, శక్తిమాన్‌ కంపెనీ ఆర్థిక సలహాదారు బ్రిజెన్‌ సంపేట్‌, శక్తిమాన్‌ కంపెనీ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ దినేశ్‌ వశిష్ట పాల్గొన్నారు.

Other Updates