tsmagazineజపాన్‌ కు చెందిన ప్రముఖ ఆహారపదార్థాల కంపెనీ ఇసే ఫుడ్స్‌ (Iూజు ఖీశీశీసర Iఅష) తెలంగాణలో తన యూనిట్‌ ప్రారంభించనున్నది. ఈ మేరకు ప్రభుత్వ అనుమతులు, రాయితీలను ప్రభుత్వం తరపున మంత్రులు కెటి రామారావు, ఈటల రాజేందర్‌, మహేందర్‌ రెడ్డిలు కంపెనీ సీనియర్‌ ప్రతినిధి బృందానికి హైదరాబాద్‌లో అందజేశారు. కంపెనీ ప్రతినిధి బృందంతోపాటు జపాన్‌ ప్రధాన మంత్రి ప్రత్యేక సలహాదారు. మిట్సు హీరోమియాకోషీ ఇసే ఫుడ్స్‌ ఛైర్మన్‌, జపాన్‌ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రులు సమావేశం అయ్యారు. ఇసే ఫుడ్స్‌ సూమారు 47 బిలియన్ల యెన్ల అమ్మకాలను గత ఏడాది నమోదు చేసింది. కంపెనీకి దేశ విదేశాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఉన్నాయి. ఇసే ఫుడ్స్‌ సిద్ధిపేటలోని నంగనూర్‌ మండంలోని నర్మెట్ట గ్రామంలో సూమారు 140 ఎకరాల్లో తన పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది. ఇక్కడ నుండి కోడి గుడ్ల ప్రాసెసింగ్‌ పరిశ్రమలతోపాటు, కోళ్ల ఫాంలో లభించే వ్యర్ధాలతో సేంద్రీయ ఎరువులను సైతం తయారు చేయనున్నది. దీంతోపాటు పౌల్ట్రీ టెక్నాలజీలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడి విద్యార్ధులను శిక్షణకోసం జపాన్‌ తీసుకెళ్లేందుకు అవకాశం కల్పిస్తుంది. దీంతోపాటు సుజుకి కంపెనీ భాగస్వామ్యంతో లిథియం అయాన్‌ బ్యాటరీల అర్‌ అండ్‌ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇదే కేంద్రం నుండి రెండు మూడు సంవత్సరాల్లో బ్యాటరీలను సైతం ఉత్పత్తి చేయనున్నది. ఇసే ఫుడ్స్‌ హైదరాబాద్‌లోని నేషనల్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ ద్వారా టోక్యో ఒలంపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ఒక యంవోయును ఈ సందర్భంగా కుదుర్చుకున్నారు.

జపాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కె.టి. రామారావు హర్షం వ్యక్తం చేశారు. జపాన్‌లో పెట్టుబడుల కోసం పర్యటన చేసిన సందర్భంగా ఈ కంపెనీతో యంవోయు కుదుర్చుకున్నామని మంత్రి గుర్తు చేశారు. జపాన్‌ ప్రధాని సలహాదారు, కంపెనీ ఛైర్మన్‌, ప్రతినిధులతో మంత్రులు సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, పాలసీలు, ఇక్కడి పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని మంత్రి వివరించారు. జపనీస్‌లో ముద్రించిన తెలంగాణ పారిశ్రామిక పాలసీని మంత్రి వారికి అందించారు. తెలంగాణకు జపాన్‌కు మధ్య మంచి సంబంధాలున్నాయని, ఇప్పటికే జైకా వంటి అర్థిక సంస్ధలు తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు సహకారం అందిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా పెట్టుకున్నదని, ముఖ్యంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో తెలంగాణ ప్రణాళికలను మంత్రి వివరించారు. తెలంగాణ ‘సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, ప్రతి నియోజక వర్గానికి ఒక్క ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు.

తెలంగాణ ఇప్పటికే ఎగ్‌ బాస్కెట్‌ అప్‌ ఇండియాగా

ఉన్నదని, పౌల్ట్రీ రంగంలో దేశంలో ప్రథమ స్థానంలో

ఉన్నదని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇలాంటి చోట ఇసే ఫుడ్స్‌ వంటి కంపెనీ ఏర్పాటు చేయడం ఇక్కడ పరిశ్రమ అభివద్ధికి మరింత దోహదం చేస్తుందని తెలిపారు.

తెలంగాణకు జపాన్‌ పరిశ్రమలను రప్పించాలన్న ప్రభుత్వ చొరవను జపాన్‌ ప్రధాని ప్రత్యేక సలహాదారు మిట్సు హిరోమియా కోషి అభినందించారు. ముఖ్యంగా గత పర్యటనలో మంత్రి కె.టి. రామారావు తెలంగాణ గురించి జపాన్‌ పెట్టుబడిదారుల సమావేశంలో తెలిపిన తీరుని అయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇసే ఫుడ్స్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం వైపునుంచి అందించిన సహకారానికి అయన అభినందనలు తెలిపారు. ఈ పరస్పర సహకారం ఇతర రంగాల్లోని పెట్టు బడుల ఆకర్షణకు సైతం కొనసాగు తుందని హమీ ఇచ్చారు. తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నా మన్న ఆయన అవి పూర్తయితే వ్యవసాయోత్పత్తులు మరింత పెరుగుతాయని వాటి కోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో మరిన్ని పరిశ్రమలు అవసరం అవుతాయని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం తమ కంపెనీ ఏర్పా టుకు సహకరించిన తీరుపైన ఇసే ఫుడ్స్‌ ఛైర్మన్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి పాలసీలు, ప్రభుత్వ పనితీరులో వేగం కనిపిస్తోందన్నారు. తమ కంపెనీ ఏర్పాటు ద్వారా ఇక్కడి పౌల్ట్రీ పరిశ్రమకు, మొక్క జొన్న పంటలు పండించే రైతన్నలకు లాభదాయకంగా ఉంటుం దన్నారు. అధునాతన పద్ధతుల్లో మొక్కజొన్నను నిల్వ చేయడం ద్వారా కనీసం 30శాతం అదాయం పెరుగు తుందని, ఈ మేరకు ప్రభుత్వంతో ఈ రంగంలో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ సమా వేశంలో జపాన్‌ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఇసే సంస్ధ ప్రతినిధులు పాల్గొన్నారు.

Other Updates