సందేశం మన రాష్ట్రం ఆవిర్భవించి ఏడాది పూర్తి అవుతున్న తొలి పండగను పురస్కరించుకుని ‘తెలంగాణ’ ప్రత్యేక సంచిక వెలువరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. గడచిన ఏడాది కాలంలో మనం పొందిన అనుభవాలను సమీక్షించుకొని లక్ష్యసాధన దిశగా పునరంకితం కావాల్సిన ఆవశ్యకత ఉంది.
మనమంతా కలసికట్టుగా పరిశ్రమిస్తే ఎంతటి కష్టసాధ్యమైన అంశాన్ని అయినా అవలీలగా పూర్తి చేయగలుగుతామని గత అనుభవాల్లో స్పష్టమైంది. ఈ దిశలో మన కర్తవ్యదీక్ష ఎందరికో స్ఫూర్తిమంతం కావాలి. బంగారు తెలంగాణ సాధనలో మన కృషి స్వచ్ఛత, శుభ్రతతో ప్రారంభం కావాలి.
చిత్తశుద్ధి, అంకితభావంతో మనం ముందుకు సాగుదాం. లక్ష్యాలను సాధించి ‘తెలంగాణ’ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుకుందాం.
(కె.చంద్రశేఖరరావు)