రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌ గా రిటైర్డ్‌ ఐ.ఎ.ఎస్‌ అధికారి సి.పార్థసారథి ఎన్నిక సంఘం కార్యాయంలో పదవీ బాధ్యతు స్వీకరించారు. తొుత కార్యాయంలో సాంప్రదాయ బద్ధంగా పూజు నిర్వహించి, తన చాంబర్‌లో పదవీ బాధ్యతు స్వీకరించారు.
ప్రజా స్వామ్య పరిరక్షణలో ఎన్నికు అత్యంత కీకమని, రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌ హోదాలో రాజ్యాంగం ప్రకారం గడువు లోపు స్థానిక సంస్థ ఎన్నికను నిష్పక్షపాతంగా నిర్వహించే గురుతర రాజ్యాంగ బాధ్యతను నిర్వహించే అవకాశాన్ని తనకు కల్పించిన గవర్నర్‌కి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాు తెలిపారు.
అలాగే, గవర్నర్‌ , రాష్ట్ర ప్రభుత్వం, సి.ఎస్‌, డి.జి.పి ు, జిల్లా ఎన్నిక యంత్రాంగం సహకారం, సమన్వయంతో రాష్ట్ర ఎన్నిక కమిషన్‌కు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ ఎస్‌.ఈ.సి. విధును నిష్పక్షపాతంగా నిర్వహించడానికి, రాష్ట్ర ఎన్నిక కమిషన్‌ గౌరవాన్ని మరింత పెంచడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ రాజ్‌ లోకల్‌ బాడీ ఎన్నికు అన్నీ పూర్తి అయ్యాయని, ప్రస్తుతం స్టేట్‌ ఎలెక్షన్‌ కమిషన్‌ ముందున్న పని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గడువు లోపు నిర్వహించాల్సి ఉన్న కొన్ని అర్బన్‌ లోకల్‌ బాడీ ఎలెక్షన్స్‌ను పకడ్బందీగా, రాజ్యాంగ నిబంధనను అనుసరించి నిష్పక్షపాతంగా నిర్వహించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
2021, ఫిబ్రవరి 10 తేదీతో పదవీ కాం ముగియనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కు ఎన్నికు నిర్వహించటం తన ప్రథమ ప్రాధాన్యత అని, త్వరలోనే జి.హెచ్‌.ఎం.సి అధికారుతో సమావేశం ఏర్పాటుచేసి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
జి.హెచ్‌.ఎం.సి ఎన్నిక అనంతరం మార్చి, 2021 తో పదవీ కాం ముగియనున్న గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌ కు, అలాగే ఏప్రిల్‌లో పదవీ కాం ముగియనున్న సిద్ధిపేట మున్సిపాలిటీకి ఎన్నికు నిర్వహిస్తామని తెలిపారు.
కోవిడ్‌ -19 దృష్ట్యా భారత ఎన్నిక సంఘం జారీ చేసిన భద్రతా చర్యను రాష్ట్రంలో ఎన్నిక నిర్వహణకు గాను అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. తదనంతరం, రాష్ట్రంలో ఎన్నికు జరగ కుండా మిగిలి వున్న పంచాయతీ రాజ్‌, పట్టణ స్ధానిక సంస్థకు ఎన్నికు నిర్వహించేందుకు చర్యు తీసుకుంటామని అన్నారు.
అంతకు ముందు రాష్ట్ర ఎన్నిక సంఘం కార్యాయానికి విచ్చేసిన సి.పార్థసారథి కి ఎన్నిక సంఘం కార్యదర్శి ఎన్‌. జయసింహా రెడ్డి, అధికాయి, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఎన్నిక సంఘం అధికారుతో సమావేశమై ఎన్నికకు సంబంధించిన అంశాపై చర్చించారు.
రాష్ట్ర ఎన్నిక సంఘం కమిషనర్‌గా సి. పార్థసారథిని నియమిస్తూ గవర్నర్‌ తమిళసై ఆమోదంతో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశాు జారీచేసింది. పార్థసారథి మూడేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
ఉమ్మడి రాష్ట్రంలో, తెంగాణలోనూ పార్థసారథి అనేక పదవు నిర్వహించి, పు అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.1988 జులైలో విజయనగరం ఆర్డీవో గా బాధ్యతుచేపట్టిన పార్థసారథి అనంతరం అదే జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ కార్యనిర్వాహక సంచాకునిగా పనిచేశారు. అనంతరం అదే హోదాలో నిజామాబాద్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. అనంతరం ఆదిలాబాద్‌ డీఆర్వోగా బదలీఅయ్యారు. 1993లో ఐ.ఏ.ఎస్‌ హోదాపొందిన పార్ధసారథి తొుత 1996 నవంబర్‌ లో ఆదిలాబాద్‌ డి.ఆర్‌.డి.ఏ పీడీగా బాధ్యతు చేపట్టారు. ఆతర్వాత అనంతపురం, వరంగల్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా, మార్క్‌ ఫెడ్‌ ఎండీగా, సమాచార, ప్రజాసంబంధా శాఖ కమిషనర్‌గా, ఏ.పి. ఫిల్మ్‌, టీవీ, ధియేటర్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా పనిచేశారు.
తెంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం, రాష్ట్ర పౌరసరఫరాు, వినియోగదారు వ్యవహారా శాఖ కమిషనర్‌గా, వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శిగా, పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోథన సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ గా పనిచేసి గత ఏప్రిల్‌ 30న పదవీ విరమణ పొందారు.తెంగాణ విశ్వవిద్యాయం, కొండా క్ష్మణ్‌ ఉద్యానవర్సిటీ, అంబేద్కర్‌ విశ్వవిద్యా యాకు ఇంచార్జ్‌ వైస్‌ ఛాన్స్‌ర్‌గా, నాబార్డు పాక మండలి సభ్యునిగా కూడా పార్థసారథి సేమ అందిం చారు. రైతుబంధు పథకం అముకు సంబంధించి ప్రతిష్టాత్మక స్కోచ్‌ పురస్కారాన్నికూడా పొందారు.
రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌ గా నియమితుయిన పార్థసారథి మర్యాదపూర్వకంగా గవర్నర్‌ తమిళసై ని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కుసుకున్నారు.

Other Updates