ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్ర చేపగా ఒక రకం చేపను గుర్తిస్తారు. అలా గుర్తించిన చేపను కాపాడుకోవటమే కాకుండా, దాని సంతతిని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. అంతేకాకుండా ఆ చేప జన్యువును లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్‌లో భద్రపరుస్తారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల చేపలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకే తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర చెట్టుగా జమ్మిచెట్టు, రాష్ట్ర పువ్వుగా తంగేడును ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా లభించడంతోపాటు ప్రజలు ఇష్టంగా తినే కొరమీనును రాష్ట్ర చేపగా గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జూలై 20నాడు ఓ ప్రకటన చేసింది.
హోం
»