ktrరాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పలు పథకాలు, కార్యక్రమాలలో భాగస్వామిగా ఉండేందుకు ప్రపంచబ్యాంకు అంగీ కరించింది. ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం ఏప్రిల్‌ 15న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వివిధ శాఖల అధికారులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆయా శాఖలలో చేపట్టిన కార్యక్రమాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచబ్యాంకు బృందం రాష్ట్రంలో పర్యటించడం ఇదే ప్రథమం. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యాలు, చేపట్టిన, పథకాలు, కార్యక్రమాల వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ బృందానికి వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్‌, మిషన్‌ కాకతీయ పథకాలు, పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ఆర్థిక స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్థిక, ప్రణాళికా శాఖల అధికారులు ప్రపంచబ్యాంకు బృందానికి వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘హరితహారం’ తదితర కార్యక్రమాలను ఈ బృందం ఆసక్తిగా తెలుసుకొంది. అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కావడానికి సుముఖత వ్యక్తం చేసింది.

Other Updates