తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత 2015`16 సంవత్సరానికి తొలి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ఆర్థికశాఖామంత్రి ఈటల రాజేందర్ మార్చి 11న శాసనసభకు సమర్పించారు. ఆర్థికమంత్రి హోదాలో ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది రెండవసారి. అయితే 2014`15 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్ కేవలం 10 మాసాలకు సంబంధించినది కాగా, రెండవసారి సమర్పించిన ఈ బడ్జెట్ తొలిపూర్తిస్థాయి వార్షిక బడ్జెట్. ప్రాధాన్యతారంగాలకు సముచిత కేటాయింపులుచేస్తూ, రాష్ట్ర ఉజ్జ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశనం చేస్తూ సమర్పించిన 2015`16 వార్షిక బడ్జెట్‌ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృఢవిశ్వాసం వ్యక్తం చేసింది.
సంక్షేమం, వ్యవసాయం, అనుబంధ రంగాల వికాసం, పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. గతేడాది సమర్పించిన బడ్జెట్‌లాగానే, ఈ ఏడాది కూడా భారీగా 1,15,689 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సమర్పించి, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కేటాయింపులు జరిపారు. తెలంగాణ ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తుకోసం, అట్టడుగువర్గాల నిజమైన అభివృద్ధికోసం రూపొందిన పథకాల సమాహారమే ఈ బడ్జెట్ అని ఆర్థికశాఖామంత్రి ఈటల రాజేందర్ తమ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడిరచారు.
అన్ని రంగాలకు న్యాయం: సిఎం
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయడానికి వీలు కల్పించేవిధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. ఆర్థికమంత్రి రాజేందర్ అన్నిరంగాలకూ న్యాయంచేస్తూ, సంతృప్తికరంగా నిధులు కేటాయించారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. బడ్జెట్ రూపకల్పనకు కృషి చేసిన అధికారులకు కూడా సి.ఎం. అభినందనలు తెలిపారు.