‘తెలంగాణ వస్తే శ్రీవేంకటేశ్వరస్వామికి, పద్మావతి అమ్మవార్లకు బంగారు ఆభరణాలు సమర్పిస్తానని ఉద్యమ సమయంలో మొక్కుకున్న. స్వామివారి దయవల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ ఆభరణాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటినుంచి అనేకసార్లు ఇక్కడికి వద్దామని అనుకున్నా కుదరలేదు. స్వామివారు పిలిపించుకుంటే తప్ప ఇక్కడకు రావడం సాధ్యం కాదు. గతంలో నేనొకసారి మా చిన్నాన్నతో కలిసి తిరుపతి దాకా వచ్చినా, ఓ అశుభవార్త తెలియడంతో స్వామి వారిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోయాను. స్వామివారి అనుగ్రహం ఉంటే తప్ప ఇక్కడకు రావడం, దర్శనం కలగడం జరుగదు. ఇవాళ దేవుడే నన్ను పిలిపించుకున్నాడు. ఇవాళ మనస్ఫూర్తిగా పూజలు చేశాను. తెలంగాణ రాష్ట్రం బాగుండాలని దీవించమని ప్రార్థించాను. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని నిండు మనసుతో కోరుకున్న. రెండు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం బాగుండాలని కోరుకున్న. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’ అని రంగనాయకస్వామి మంటపంలో భక్తులను ఉద్దేశించి ఇచ్చిన సందేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
హోం
»