సాధారణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం
tsmagazine
గటిక విజయ్‌ కుమార్‌
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. 2014 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ 63 స్థానాలు గెలుచుకుని, అధికారంలోకి వచ్చింది. అయితే అప్పుడు ఎన్నికలు సమైక్య ఆంధ్రప్రదేశ్‌ మనుగడలో ఉండగానే జరిగాయి. ఎన్నికల తర్వాత 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదే రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 51 నెలల పాటు పరిపాలన సాగించిన అనంతరం తెలంగాణ అసెంబ్లీని మంత్రివర్గం రద్దు చేసింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లింది.
tsmagazine

రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాలకు 2018 డిసెంబర్‌ 7న ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,80,64,684 మంది ఓటర్లలో 2,05,44,075 మంది (73.20 శాతం) మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా మధిర నియోజకవర్గంలో 91.65 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా చార్మినార్‌ నియోజకవర్గంలో 40.18 శాతం ఓట్లు పోలయ్యాయి. డిసెంబర్‌ 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేని ఆధిక్యం కట్టబెట్టారు. 119 స్థానాలకు గాను 88 చోట్ల టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించారు. కాంగ్రెస్‌ 19, ఎంఐఎం 7, టిడిపి 2, బిజెపి 1, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 1, ఇండిపెండెంట్‌ 1 స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయి పార్టీలైన సిపిఎం, సిపిఐ, బిఎస్పీలు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక పోయాయి. టిఆర్‌ఎస్‌ పార్టీకి 46.9 శాతం ఓట్లు, కాంగ్రెస్‌ కు 28.4 శాతం ఓట్లు, బిజెపికి 7 శాతం ఓట్లు, టిడిపికి 3.5 శాతం ఓట్లు, ఎంఐఎం 2.7 శాతం ఓట్లు, ఇతరులకు 10.3 శాతం ఓట్లు లభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ కు 97,00,749 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ పార్టీకి 58,83,111 ఓట్లు వచ్చాయి. బిజెపికి 14,50,456 ఓట్లు, టిడిపికి 7,25,845 ఓట్లు, ఎంఐఎంకు 5,61,089 ఓట్లు పోలయ్యాయి.

ఫలితాలు వెలువడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూలంగా గవర్నర్‌ కు తన రాజీనామా పంపారు. ఈ రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాల్సిందిగా కోరారు.
tsmagazine

అత్యధిక స్థానాలు గెలుచుకున్న టిఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభా పక్షం డిసెంబర్‌ 12న సమావేశమై ప్రస్తుత ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును తమ నాయకుడిగా ఎన్నుకున్నది. ఈ విషయాన్ని గవర్నర్‌కు అధికారికంగా తెలియచేసింది. అదే రోజు ఎన్నికల సంఘం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందచేశారు. ఈ జాబితా ప్రకారం తెలంగాణ రాష్ట్ర రెండో అసెంబ్లీని ఏర్పాటు చేశారు. టిఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం నాయకుడిగా ఎన్నికైన కేసీఆర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ ఆహ్వానించారు. డిసెంబర్‌ 13న మద్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌ తో పాటు శాసనమండలిలో సభ్యుడైన మహ్మద్‌ మహమూద్‌ అలీ కేబినెట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు అదే రోజు హోం శాఖను కేటాయించారు.

2018 ఎన్నికల్లో ప్రత్యేకతలు

  •  ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌ అసెంబ్లీ స్థానం నుంచి 58,290 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎనిమిదో సారి అసెంబ్లీకి ఎన్నికయిన కేసీఆర్‌ ప్రస్తుత అసెంబ్లీలో అత్యంత సీనియర్‌ సభ్యుడి హోదా పొందారు.
  • డిఎస్‌ రెడ్యానాయక్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తన్నీరు హరీశ్‌ రావు, ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
  • సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి తన్నీరు హరీశ్‌ రావు తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ జన సమితి అభ్యర్థి భవాని రెడ్డిపై 1,18,699 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి, ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సష్టించారు. 46 ఏళ్ల వయసులో వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం ద్వారా హరీశ్‌ రావు కొత్త జాతీయ రికార్డు నెలకొల్పారు.
  • వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరూరి రమేశ్‌ తన సమీప ప్రత్యర్ధి, తెలంగాణ జన సమితి అభ్యర్థి దేవయ్యపై 99,240 ఓట్ల మెజారిటీతో గెలుపొంది ద్వితీయ స్థానంలో నిలిచారు.
  • సిరిసిల్ల టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల తారక రామారావు 89,009 ఓట్లతో గెలిచి మూడో స్థానంలో నిలిచారు.
  • మేడ్చల్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి 87,990 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో స్థానంలో నిలిచారు.
  • ఆసిఫాబాద్‌ లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు తన సమీప ప్రత్యర్థి, టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవ లక్ష్మిపై 171 ఓట్ల అత్యల్ప మెజారిటీతో విజయం సాధించారు.
  • ఆరుగురు మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. మెదక్‌ నుంచి పద్మా దేవేందర్‌ రెడ్డి, ఆలేరు నుంచి గొంగిడి సునితా మహేందర్‌ రెడ్డి, ఖానాపూర్‌ నుంచి ఆజ్మీరా రేఖా నాయక్‌, మహేశ్వరం నుంచి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, ములుగు నుంచి దనసరి అనసూయ, ఇల్లందు నుంచి హరిప్రియా నాయక్‌ ఎన్నికయ్యారు.
  • కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి, బిజెపి శాసనసభా పక్ష నాయకుడు జి.కిషన్‌ రెడ్డి పరాజయం పాలయ్యారు.
  • స్పీకర్‌ మధుసూదనా చారి, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి క ష్ణారావు, ఆజ్మీరా చందూలాల్‌, పట్నం మహేందర్‌ రెడ్డి పరాజయం పాలయ్యారు.

కసీఆర్‌ ప్రస్థానం,మహమూద్‌ అలీ ప్రస్థానం

tsmagazine
tsmagazine

tsmagazine
tsmagazine
tsmagazine
tsmagazine

Other Updates