tsmagazine
తెలంగాణ సాధనకోసం తుదిపోరులో భాగంగా మే 2న సత్యాగ్రహంలో పాల్గొన్న రెడ్డి హాస్టల్‌ విద్యార్థులపై అనాగరికంగా పోలీసులు లాఠీఛార్జీ జరిపి పలువురు విద్యార్థులను గాయపర్చినారు. ఈ చర్యకు నిరసనగా మే 5న 20మందికిపైగా విద్యార్థులు రెడ్డి హాస్టల్‌ ఆవరణలో రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. లాఠీఛార్జీపై న్యాయ విచారణ జరిపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసినారు. విద్యార్థుల నిరాహారదీక్షలలో రిటైర్డ్‌ ఉద్యోగులు, ప్రముఖులు కూడా పాల్గొన్నారు. రెండు, మూడు రోజుల తర్వాత తాను కూడా ఈ దీక్షలో పాల్గొనబోతున్నట్లు తెలంగాణ ప్రజా సమితి నేత డా|| చెన్నారెడ్డి పత్రికలవారికి తెలిపారు. రిటైర్డ్‌ ఎస్‌.ఈ. రెడ్డి హాస్టల్‌ కోశాధికారి పి. రామచంద్రారెడ్డి మే 5న నిరాహారదీక్షలో పాల్నొన్నారు.

రెడ్డి హాస్టల్‌ లాఠీఛార్జీని సమర్థించిన హోంమంత్రి
హోంమంత్రి జలగం వెంగళరావు సచివాలయంలో పత్రికలవారితో మాట్లా డుతూ.. ‘పోలీసులు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారని చేస్తున్న’గోల’ ప్రత్యేక తెలంగాణ నాయకులు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నదే’నని అన్నారు. ‘రెడ్డి హాస్టల్‌లో కూర్చొని బయట పోలీసులపై రాళ్ళు వేయడం శాంతిమార్గమేనా? మేడపైనుంచి పెద్ద బండను ఎత్తి అసిస్టెంట్‌ కమిషనర్‌ నెత్తిపైకి ఒక కుర్రవాడు గురిపెట్టి వేశాడు, గురి తప్పింది. ఆయువు ఉండబట్టి ఆ అధికారి బ్రతికారు. లేకపోతే వేస్తున్నవారిని ఏమీ అనకూడదా? ముద్దుపెట్టుకోవాలా? ఇదా న్యాయం? అమానుషంగా, దౌర్జన్యంగా వ్యవహరించే ఆకతాయిల విషయంలో న్యాయవిచారణ జరిపించడం సంభవంకాదు…’ అంటూ పోలీసులను, వారి పాశవిక చర్యలను సమర్థించారు హోంమంత్రి వెంగళరావు.

రెడ్డి హాస్టల్‌ లాఠీఛార్జీకి నిరసనగా తరగతులకు గైర్హాజర్‌
ఉస్మానియా విశ్వవిద్యాలయపు విద్యార్థులు, జంటనగరాల్లోని వివిధ కళాశాలల, హైస్కూళ్ళ విద్యార్థినీ, విద్యార్థులు రెడ్డి హాస్టల్‌లో పోలీసుల లాఠీఛార్జీకి నిరసనగా మే 5న తరగతులు బహిష్కరించారు. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసినారు.

హోంమంత్రి వ్యాఖ్యలపై రాజారాం విమర్శ
రెడ్డి హాస్టల్‌ సంఘటనపై హోంమంత్రి వ్యాఖ్యలపై ప్రజా సమితి ప్రధాన కార్యదర్శి, శాసనసభ్యులు జి. రాజారామ్‌ స్పందించారు. ఆయన మాటల్లోనే.. ”పోలీసు జులుం, తెలంగాణా ఆందోళన దృష్ట్యా వెంగళరావు చేసిన ప్రకటన నాకు ఆశ్చర్యం కలిగించడం లేదు. ప్రస్తుతం బ్రహ్మానందరెడ్డి తొత్తు అయిన హోంమంత్రి నుంచి ఇంతకన్నా ఇంకేమీ ఆశించగలం? రెడ్డి హాస్టల్‌ విద్యార్థులు ట్రూప్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌పై దాడి జరిపారన్న నిర్ణయానికి ఆయనెలా వచ్చారు? ఇది నిరాధారమేగాక అభూతకల్పన. విద్యార్థులు దాడి జరిపిన మాట నిజమే అనుకున్నా, పోలీసులు మర్నాడు రెడ్డి హాస్టల్‌లో అక్రమంగా ప్రవేశించి అక్కడే వుండే విద్యార్థులను రక్తం కారేటట్లు నిర్ధాక్షిణ్యంగా కొట్టి, మిటమిటలాడుతున్న ఎండలో గంటల తరబడి వారిని నిలబెట్టి వారి చేతి గడియారాలను,

ఉంగరాలను, ఇతర వస్తువులను దొంగిలించి పాశవికంగా ప్రవర్తించడం సమర్థనీయమని ఆయన ఎలా అనుకుంటున్నారు? ఇది అటవీ న్యాయంకన్న దారుణంగా వున్నది వెంగళరావు చెప్పేది నిజమే అయితే ప్రభుత్వం శ్రేయస్సు, న్యాయ విచారణ జరగాలన్న ప్రజల కోరిక దృష్ట్యా రెడ్డి హాస్టల్‌ విషాద సంఘటనపై ఆయన న్యాయ విచారణకు ఉత్తర్వు చేయాలి’.

రజాకార్లు కూడా ధైర్యం చేయలేదు: అచ్యుతరెడ్డి
మే 2 నాటి పోలీసుల దౌర్జన్య చర్యలపై రెడ్డి హాస్టల్‌లో మే 10న నిరసనసభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న ప్రజా సమితి నేతలు, రిటైర్డ్‌ అధికారులు ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ‘మే 2నాటి అత్యాచారాలు మరోసారి జరిగితే రెడ్డి హాస్టల్‌ విద్యార్థులు ఆయుధాలు చేతబూని ప్రతీకారం చేయడానికి

వెనుదీయర’ని హాస్టల్‌ కోశాధికారి పి. రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణా ప్రజాసమితి ఉపాధ్యక్షుడు అచ్యుతరెడ్డి మాట్లాడుతూ ఇంతటి ఘాతుకత్వం జరగడం రెడ్డి హాస్టల్‌ చరిత్రలో మొదటిసారని అన్నారు. రజాకార్లు కూడా రెడ్డి హాస్టల్‌ ఆవరణలోకి అడుగుపెట్టడానికి ధైర్యం చేయలేదని, ఆంధ్ర పరిపాలకుల హయాంలో చదువుకుంటున్న విద్యార్థులను దారుణంగా హింసించారని అన్నారు. న్యాయ విచారణ జరిపించాలని కోరడానికి బదులు విద్యార్థులు తిరుగుబాటుద్వారా ఈ దుష్ట ప్రభుత్వాన్ని అంతమొదించడానికి కంకణం కట్టుకోవాలని అచ్యుతరెడ్డి అన్నారు.

పోలీసు బలగంమీద ఆధారపడకుండా ఫతేమైదాన్‌లో ఒక్క బహిరంగసభ ఏర్పాటు చేసి చూపించమని అచ్యుతరెడ్డి ముఖ్యమంత్రిని సవాల్‌ చేశారు.

హాస్టల్‌ విద్యార్థులు ఎ. నరసింహారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, అమృతరెడ్డి, కృష్ణారెడ్డి పోలీసుల దౌర్జన్యాలను సభావేదికపైనుండి వివరించారు. హాస్టల్‌ గదులనుండి విద్యార్థులను ఏ విధంగా బయటికి ఈడ్చికొట్టి గంటకుపైగా మండుటెండలో కూర్చోబెట్టినారని వారన్నారు. ‘తలుపు లు విరగ్గొట్టి కుక్కల్ని కొట్టినట్టు కొట్టండి’ అని ఒక పోలీసు అధికారి పోలీసులకు ఉత్తర్వులిచ్చినట్లు కృష్ణారెడ్డి అనే వైద్య విద్యార్థి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఎల్‌.ఎన్‌. గుప్తా సభకు అధ్యక్షత వహించారు. మాజీ పోలీసు కమిషనర్‌ ఎస్‌.ఎన్‌.రెడ్డి, ఎస్‌.ఎస్‌.పి. నాయకుడు, బి. సత్యనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ జి. రాంరెడ్డి, సర్వోదయ నాయకులు జి.ఎస్‌. భాన్‌రెడ్డి, మాజీ ఐఏఎస్‌ అధికారి మధుసూ దనరావు, వైఎంఆర్‌ఏ ఉపాధ్యక్షుడు జనార్థన్‌రెడ్డి తదితరులు పోలీసు జులుంను ఖండించారు. రెడ్డి హాస్టల్‌లో పోలీసుల దౌర్జన్యంపై న్యాయ విచారణ జరిపించాలని సభ తీర్మానం చేసింది.

‘ఉప రాష్ట్ర ప్రతిపత్తి’ తెలంగాణ
సమస్యకు పరిష్కారం: వి.బి. రాజు

సిద్ధిపేట శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికైన మాజీమంత్రి వి.బి. రాజు తెలంగాణపై రాజ్యసభలో స్వల్ప వ్యవధి చర్చను మే 13న ప్రారంభిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు.

‘ఆంధ్ర ప్రాంతంనుంచి తెలంగాణ ప్రజలు ఏమీ కోరడం లేదు. తెలంగాణా ప్రజలకు రాజ్యాంగ సంబంధమైన ప్రయోజనాలు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుతున్నార’ని వి.బి.రాజు అన్నారు.

‘నిస్పృహ చెందిన రాజకీయవేత్తలు, ఆకతాయి పిల్లలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించార’న్న విమర్శను వి.బి. రాజు ఖండించారు. ‘తెలంగాణ ప్రజలకు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే అవకాశం ఇవ్వాల’ని ఆయన కోరారు.

‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు రాజ్యాంగంలో మూడవ అధికరణం యొక్క ప్రయోజనం పొందడానికి ఎంతమంది చనిపోవాలో, ఎన్ని బస్సులు తగులబడాలో చెప్పవలసిందని వి.బి. రాజు దేశీ యాంగమంత్రిని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌ సమైక్య రాష్ట్రంగా ఉండాలనే తాము కోరుతున్నామని అయితే ఆందోళన కారణంగా ఉత్పన్నమైన పరిస్థితిని ఎదుర్కోడానికి ఏదో ఒక రాజకీయ ఏర్పాటు జరగాలని తాము భావిస్తున్నామని వి.బి. రాజు అన్నారు. ‘మేఘాలయ పద్ధతి ఉప రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంద్వారా తెలంగాణ సమస్యను పరిష్కరించాల’ని వి.బి. రాజు ప్రభుత్వానికి సూచించారు.

ఆందోళన వెనుకగాథను వివరిస్తూ ‘పెద్ద మనుషుల ఒప్పందాన్ని రాజకీయ వాదులు ఉల్లంఘించారని తెలంగాణ ప్రాంతంలోని యువజనుల భావించారు. ఒప్పందం ప్రకారం తెలంగాణా ప్రాంతీయులకు లభించవలసిన ఉద్యోగాలు వారికి లభించలేదు. ‘తెలంగాణపై భార్గవసంఘం దర్యాప్తు ఫలితా లను గురించి ప్రస్తావిస్తూ సంఘం చెప్పిన వివరణలు పూర్తిగా తప్పు’ అని వి.బి. రాజు అన్నారు. ‘ఎనిమిదిమంది నాయకులు, 45మంది ఇతరులుచేసుకున్న ఒప్పందాన్ని భార్గవసంఘం పరిగణనలోకి తీసుకుని వుండ వలసింద’ని వి.బి. రాజు అన్నారు. ‘గత 12 ఏళ్ళలో తెలంగాణ ప్రాంత అభివృద్ధి, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. 1956-1968 మధ్య కాలంలో తెలంగాణకు ఖర్చు పెట్టవలసివున్న 28 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టలేద’ని సంఘం పేర్కొన్నదని అన్నారు.

రాజు గంటకుపైగా చేసిన ప్రసంగంలో ‘హైదరాబాద్‌ భౌగోళికంగానూ, చారిత్రికంగానూ కూడా ఉత్తర, దక్షిణాదిలకు ముఖ్య వారథిగా రూపొందినది. హైదరాబాద్‌ దేశానికి
ఉదరం’వంటిది. ఉదరానికి ఏమైనా దెబ్బ తగిలితే మొత్తం దేశానికే ప్రమాదం ఏర్పడగలద’ని అన్నారు. తెలంగాణ చరిత్రను నిజాం కాలంనుంచి వివరించారు. తెలంగాణాలో సాయుధ పోరాటం, పోలీసు చర్య మున్నగువాటిని ఆయన సోదాహరణంగా వివరించారు. ‘తెలంగాణా ఉద్యమం సంకుచిత తత్వంతో కూడినట్టిదికాదని, ఎవరికీ వ్యతిరేకంగా ఉద్దేశింపబడినట్టిదికాద’ని రాజు స్పష్టం చేస్తూ ‘తెలంగాణా ఉద్యమాన్ని సహేతుకమై దృక్పథంలో పరిరక్షించాల’ని రాజు సభకు విజ్ఞప్తి చేశారు. ‘తెలంగాణ ఉద్యమం భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకం కాదు, కనీసం సరిహద్దు వివాదం కూడా కాద’ని వి.బి. రాజు అన్నారు.

వి.బి.రాజు ప్రసంగానికి అడ్డుతగిలిన ఆంధ్ర ఎంపీలు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మంత్రిగా కొంతకాలం వి.బి. రాజు పనిచేసినందున తెలంగాణకు జరిగినట్లు చెప్పబడుతున్న అన్యాయాలకు రాజు ఎక్కువగా బాధ్యులని ఆంధ్రకు చెందిన పలువురు రాజ్యసభ సభ్యులు ఆరోపిస్తూ రాజు ప్రసంగానికి అవరోధం కలుగజేశారు.

‘నేను నిజంగా బాధ్యుడనైతే శిక్షింపబడడానికి అర్హుడనే. కానీ నేను అవాంఛనీయమైన చర్యలకు ఎంతమాత్రం బాధ్యుడను కాదు’అని వి.బి. రాజు సభలో ప్రకటించారు.

FORM IV (See Rule 8)
Statement about ownership and other particulars of the ‘Telangana’ Telugu Monthly, Hyderabad as required under rule 8 of the registration of News Paper (Central) Rule, 1956.

1. Place of Publication : Hyderabad
2. Periodicity of Publication : Monthly
3. Printer’s Name : Aravind Kumar IAS
on behalf of
Commissioner, I&PR
(on behalf of State Govt. of T.S.)
Whether citizen of India? : Yes
Address : Samachar Bhavan, A.C. Guards,
Masab Tank,
Hyderabad – 500 028.
4. Publisher’s Name : Aravind Kumar IAS
on behalf of Commissioner, I&PR
(on behalf of State Govt. of T.S.)
5. Editor’s Name : Astakala Ram Mohan
on behalf of Commissioner, I&PR
(on behalf of State Govt. of T.S.)
Whether citizen of India? : Yes
Address : Samachar Bhavan, A.C. Guards,
Masab Tank,
Hyderabad – 500 028.
6. Name & Address of : Commissioner,
individuals who own the Information & Public Relations
News paper Department, A.C. Guards,
Masabtank, Hyderabad – 500 028
I, Aravind Kumar, hereby declare that the particulars given above are true to the best of my knowledge and belief.

Date : 01-03-2018
Sd/-
Aravind Kumar IAS
(Publisher)

తెలంగాణ ఆందోళన అద్వితీయం: వి.బి. రాజు
వి.బి. రాజు రాజ్యసభలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘తెలంగాణ ఆందోళన అద్వితీయమైనది. ప్రజా జీవనంలోని అన్నిరకాలవారు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తెలంగాణా ఇప్పుడు ఏ క్షణంలోనైనా ప్రేలడానిక సిద్ధంగా వున్న అగ్ని పర్వతం మాదిరిగా వున్నది. శక్తి సామర్థ్యాలను, వనరులను సమానంగా పంపిణీ చేయాలని రాజకీయ విజ్ఞత కోరుతున్నది అని వి.బి. రాజు మహోద్రేకంతో వివరించారు.

‘ఆంధ్రప్రదేశ్‌ సమైక్యతను పరిరక్షించడానికి నేనిప్పటికీ సిద్ధమే. అయితే అనేక సంవత్సరాల అనుభవం తరువాత తమకు జరిగిన అన్యాయాల విషయమై ప్రజలు వెలిబు చ్చుతున్న న్యాయయుతమైన అభిప్రాయాలను తెలం గాణాకు జరిగిన అన్యాయాలను విస్మరించదరరాద’ని వి.బి.రాజు హెచ్చరించారు. ‘తెలంగాణకు ఒక ఉప రాష్ట్రం ఏర్పాటు చేయడం సమర్థనీయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటె తెలంగాణాకు ప్రత్యేకంగా బడ్జెటు, ప్రత్యేక అభివృద్ధి, ప్రత్యేకంగా ప్రాంతీయ సంఘం వున్నవని ఆయన తెలియజేశారు.

‘ప్రత్యేక రాజకీయాలు’ ఒక్కటి మాత్రమే తెలంగాణకు మిగిలిపోతున్నద’ని వి.బి. రాజు పేర్కొన్నారు.వెనుకబడిన తెలంగాణా ప్రాంతం ప్రజల అభిప్రాయాలను మన్నించకపోయినపక్షంలో తీవ్రమైన పరిణామాలు సంభవించగలవని, యువకులను విద్రోహచర్యలను ప్రోత్సహించడమే కాగలదని రాజు హెచ్చరించారు.

తెలంగాణ ప్రజాభిమతానికి అనుగుణంగానే పరిష్కారం: చెన్నారెడ్డి
మేఘాలయ పద్ధతిలో తెలంగాణాకు పరిష్కార మార్గం కనుగొనవచ్చునని వి.బి. రాజు తమ దృక్పథాన్ని రాజ్యసభలో వ్యక్తం చేశారని ప్రజా సమితి అధ్యక్షుడు డా. చెన్నారెడ్డి ఒక పత్రికా ప్రకటనలో అన్నారు. ‘ఏది ఏమైనా అత్యధిక తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకే సుముఖంగా ఉండ గలర’న్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఎట్టి పరిష్కార మార్గం కనుగొన్నా అది అభిప్రాయ సేకరణ రూపంలో ఉండా లన్న తెలంగాణా ప్రజల అభిమతానికి అనుగుణంగా ఉండాలి’ అని డా|| చెన్నారెడ్డి స్పష్టం చేశారు.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కావాలన్న తెలంగాణ ప్రజా సమితి వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కూడా ఆయన మరోమారు స్పష్టం చేశారు.

చెన్నారెడ్డి ప్రకటనను వక్రీకరించిన దినపత్రికలు
వి.బి.రాజు రాజ్యసభలో చెప్పిన ‘మేఘా లయ పద్ధతి’పై డా|| చెన్నారెడ్డి స్పష్టమైన ప్రకటనను విడుదల చేసినా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభవంటి ఆంధ్రప్రాంత పత్రికలు ‘మేఘాలయ పద్ధతిన తెలంగాణా సమస్యకు పరిష్కార మార్గం’ అని చెన్నారెడ్డి ప్రకటించి నట్లు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.

Other Updates