సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రటించింది. కార్మికులకు ఈ ఏడాది 28 శాతం బోనస్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రటించారు. దీని వల్ల ప్రతి కార్మికుడికి ఒక లక్షా 899 రూపాయల బోనస్‌ లభిస్తుంది. గత ఏడాది చెల్లించిన బోనస్‌ కన్నా ఇది 40,530 రూపాయలు అధికం. ముఖ్యమంత్రి ప్రకటనతో సింగరేణి కార్మిక వర్గంలో ఆనందోత్సాహాలు వెల్లివిశాయి. సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది దసరా సింగరేణి కార్మికుల ఇళ్ళలో నిజమైన పండుగ వాతావరణాన్ని నింపుతోంది.

శాసన సభలో ముఖ్యమంత్రి ప్రకటన

తెలంగాణ రాష్ట్ర అభివద్ధిలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతమైంది. యాజమాన్యం, కార్మికులు అనే తారతమ్యం లేకుండా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు ఎంతో బాధ్యతగా పనిచేయడం వల్ల సంస్థలో సుహద్భావ, సానుకూల వాతావరణం ఏర్పడింది. సంస్థ పనితీరు గణనీయంగా మెరుగుపడి, రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించడానికి ఈ పరిణామం దోహదపడింది.

2013-14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థలో 50.47 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలిగారు. గడిచిన ఐదేళ్లలో ప్రతీ ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతూ వస్తున్నది. 2018-19 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 64.41 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. 2013-14 సంవత్సరంలో సింగరేణి సంస్థ 418 కోట్ల రూపాయల లాభం గడించింది. గడిచిన ఐదేళ్లలో సింగరేణిలో లాభాలు ప్రతీ ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2018-19 సంవత్సరానికి 1,765 కోట్ల రూపాయల గరిష్ట లాభాన్ని సింగరేణి సంస్థ సాధించగలిగింది. ఉత్పత్తి, రవాణా, అమ్మకం, లాభాలు, టర్నోవర్‌లో సింగరేణిలో సాధిస్తున్న ప్రగతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనా దక్షతకు ప్రతీకగా నిలుస్తున్నది. బొగ్గు గనుల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాల్లో కోల్‌ ఇండియాతో పోలిస్తే తెలంగాణకు చెందిన సింగరేణి సంస్థ ఎంతో మెరుగ్గా ఉండడం మనందరికీ గర్వకారణం. సింగరేణి విజయ ప్రస్థానంలో ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడుతున్న కార్మికులదే అతి ముఖ్యమైన భూమిక అని ప్రభుత్వం ప్రగాఢంగా విశ్వసిస్తున్నది. అపారమైన ఖనిజ సంపదను వెలికి తీయడానికి కార్మికులు పడుతున్న శ్రమ వెలకట్టలేనిది.

జాతి సంపదను సష్టించడానికి ప్రతి నిత్యం మత్యు ఒడిలోకి వెళ్లి వచ్చే సింగరేణి కార్మికులు చిందిస్తున్న స్వేదం… దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల త్యాగనిరతికి ఏమాత్రం తీసిపోనిదని మా ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తున్నది.

అందుకే సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నది. సమైక్య పాలనలోని చివరి సంవత్సరమైన 2013-14 సంవత్సరంలో కార్మికులకు ఒక్కొక్కరికీ 13,540 రూపాయల చొప్పున మాత్రమే బోనస్‌ చెల్లించారు. గడిచిన ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చే బోనస్‌ను క్రమంగా పెంచుతూ వచ్చింది. 2017-18 సంవత్సరంలో లాభాల్లో 27 శాతం వాటాగా, ఒక్కో కార్మికుడికి 60,369 రూపాయలు చెల్లించింది. ఈ సారి లాభాల్లో వాటాను మరో శాతం అంటే, 28 శాతానికి పెంచుతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. లాభాల్లో వాటా పెంచడం వల్ల ప్రతీ కార్మికుడికి ఒక లక్షా 899 రూపాయల బోనస్‌ అందుతుంది. గత ఏడాదికన్నా 40,530 రూపాయలు అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అందిస్తున్న కానుక. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేసి సింగరేణి సంస్థకు మరిన్ని లాభాలు, విజయాలు సాధించి పెట్టాలని ఆకాంక్షిస్తున్నాను.

356 మందికి తిరిగి ఉద్యోగావకాశం

సింగరేణిలో వివిధ కారణాల రీత్యా 2000 సంవత్సరం నుండి 2018 మధ్య డిస్మిస్‌ అయిన కార్మికులను ‘ఒక్క అవకాశంగా’ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవడానికి ఒక చారిత్రక ద్వైపాక్షిక ఒప్పందం గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం, సింగరేణి యాజమాన్యానికి మధ్య కుదిరింది. దీని వలన సుమారు 356 మంది డిస్మిస్డ్‌ కార్మికులు తిరిగి ఉద్యోగాలు పొందే అవకాశం కలుగుతోంది.

హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్‌ పా, ఆపరేషన్స్‌ ఎస్‌.చంద్రశేఖర్‌, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు బి.వెంకట్రావు సమక్షంలో ఇరుపక్షాల వారు జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.

డిస్మిస్డ్‌ కార్మికులు చాలా కాలంగా తమను తిరిగి

ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ వేడుకొంటున్నారు. గుర్తింపు సంఘం కూడా ఈ విషయంపై యాజమాన్యానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు. దీంతో 2000 సంవత్సరం నుండి గత ఏడాది వరకూ దీర్ఘకాలంగా గైర్హాజరు, అనారోగ్య కారణాల వలన విధులకు హాజరు కాకుండా డిస్మిస్‌ అయిన కార్మికులకు ఈ ఒప్పందం ద్వారా తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం కల్పించారు.

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు

సింగరేణి కార్మికుల శ్రమను గుర్తించి 28 శాతం లాభాల బోనస్‌ ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు సి.ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ సంస్థ ఉద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రకటించిన బోనస్‌ వెంటనే చెల్లించడానికి తగు ఏర్పాట్లు చేయాలని ఆయన సింగరేణి ఆర్ధిక, పర్సనల్‌ విభాగాలను ఆదేశించారు. అక్టోబర్‌ మొదటి వారంలో కార్మికుల ఖాతాల్లో ఆన్‌లైన్‌ విధానంలో లాభాల బోనస్‌ మొత్తాన్ని జమచేయనున్నా మని ఆయన ప్రకటించారు.

తెలంగాణ రాకపూర్వం 5 ఏళ్లలో పంచిన లాభాలు 314 కోట్ల రూపాయలు – తెలంగాణ రాష్ట్రంలో గడచిన 5 ఏళ్లలో ఇచ్చిన లాభాలు 1,267 కోట్ల రూపాయలు తెలంగాణా రాకపూర్వం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కార్మికులకు పంచిన లాభాలు అంతంత మాత్రమే. 2009 నుండి 2014 వరకు పంచిన లాభాల బోనస్‌ మొత్తం కలిపి 314 కోట్ల రూపాయలు మాత్రమే. కాగా తెలంగాణా సాధించిన తర్వాత 2014 నుండి 2019 వరకు పంచిన లాభాల బోనస్‌ మొత్తం 1,267 కోట్ల రూపాయలు. అంటే స్వరాష్ట్రంలో దాదాపు 4 రెట్లు అధికంగా సింగరేణి కార్మికులు లాభాలను అందుకోగలిగారన్నమాట.

ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ సింగరేణి కార్మికులపై తనకు గల ప్రత్యేక అభిమానంతో గడచిన 5 ఏళ్ల కాలంలో ప్రతీ ఏడాది తనకు తానుగానే లాభాల బోనస్‌ను పెంచుతూ, ప్రకటిస్తున్నారు. తెలంగాణా రాకపూర్వం 2013-14లో లాభాల బోనస్‌ 20 శాతం మాత్రమే (రూ. 83 కోట్లు) పంచగా, తెలంగాణా వచ్చిన తర్వాత ఎటువంటి ఆందోళనలు, పోరాటాలు అవసరం లేకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు లాభాల వాటాను ప్రతీ ఏడాది తనకు తానుగా పెంచుతూ తక్షణమే పంపిణీ జరిగేలా చూస్తూ తనకు సింగరేణి కార్మికుల పట్ల గల అభిమానాన్ని చాటుకొంటున్నారు.

2014-15లో 21 శాతానికి పెంచి 103 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. 2015-16లో 23 శాతంతో 245.71 కోట్ల రూపాయలు, 2017-18లో 27 శాతంతో 326.25 కోట్ల రూపాయలు, ఇప్పుడు 2018-19లో 28 శాతంతో 493.82 కోట్ల రూపాయలను లాభాల బోనస్‌ గా ప్రకటించారు. ఇదంతా తెలంగాణా వచ్చిన తర్వాత సింగరేణి సాధించిన వద్ధి వల్లనే సాధ్యం అయింది.

బాగా పనిచేసినందు వల్లనే మంచి లాభాలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దిశా నిర్దేశంలో సంస్థ సి.ఎం.డి ఎన్‌.శ్రీధర్‌ సారథ్యంలో కార్మికుల సమష్టి కషి ఫలితంగా కంపెనీ విజయపథంలో దూసుకెళ్తోంది. సింగరేణి సంస్థ దేశంలో మరే ఇతర ప్రభుత్వ సంస్థలు సాధించని వద్ధిని గడచిన ఐదేళ్లలో సాధించగలిగింది. తెలంగాణా రాకపూర్వం 2013-14లో 504 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన కంపెనీ 2018-19 నాటికి 28 శాతం వ ద్ధితో 644 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. 2013-14లో 479 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన కంపెనీ 2018-19 నాటికి 41 శాతం వద్ధితో 676 లక్షల టన్నుల రవాణా జరిపింది. 2013-14లో 11,928 కోట్ల రూపాయలుగా ఉన్న అమ్మకాలు 117 శాతం వద్ధితో గత ఏడాదికి 25,865 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. లాభాలు కూడా గణనీయంగా, గరిష్ఠంగా 322 శాతానికి పెరిగాయి. 2013-14లో 419 కోట్ల రూపాయల నికర లాభం సాధించగా, 2018-19 నాటికి 1,767 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించగలిగింది.

సంక్షేమం పెరిగింది -ఉత్పత్తి పెరిగింది

సింగరేణి సంస్థ గత 5 ఏళ్ల కాలంలో అనూహ్యమైన ప్రగతి సాధించడానికి ముఖ్యమంత్రి ప్రకటించిన పలు సంక్షేమ పథకాలు ప్రధాన స్ఫూర్తిగా నిలుస్తాయి. ముఖ్యమంత్రి సింగరేణి కార్మికులతో రెండు సార్లు బహిరంగ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి అనేక పథకాలు ప్రకటించారు. సి.ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ ఈ పథకాలను తక్షణమే అమలు జరిపేలా చర్యలు తీసుకొన్నారు. దీంతో కార్మిక వర్గం మరింత ఉత్సాహంతో పనిచేస్తూ అధికోత్పత్తికి సహకరిస్తున్నారు.

సింగరేణి కార్మికులు రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కారుణ్య నియామకాల పథకాన్ని ముఖ్యమంత్రి ఆదేశంతో అమలు చేయడం జరిగింది. అలాగే ఆయన ఆదేశంపై కార్మికులకే కాకుండా వారి తల్లిదండ్రులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించడం, స్వంత ఇళ్ళు నిర్మించుకొన్న కార్మికులకు 10 లక్షల ఋణంపై వడ్డీ చెల్లింపు, క్వార్టర్లకు ఏ.సి. సౌకర్యం, ప్రమాదంలో మతిచెందిన కార్మికుల కుటుంబానికి ఇచ్చే మ్యాచింగ్‌ గ్రాంటు మొత్తాన్ని 10 రెట్లకు పెంచడం, కార్మికులు చెల్లించే కరెంటు చార్జీలు రద్దు చేయడం, ఉన్నత చదువులో ఉన్న కార్మికుల పిల్లలకు కంపెనీ నుండే ఫీజు చెల్లించడం, లాభాల బోనస్‌, పండుగ అడ్వాన్సు పెంపుదల, క్యాంటీన్ల ఆధునీకరణ, కంపెనీ ఏరియాల్లో ఇళ్ల్లు నిర్మించుకొన్న కార్మికుల గహాలకు ఇళ్ల పట్టాల పంపిణీ వంటి అనేక చర్యలు కార్మికులకు ఎంతో సంతోషం కలిగిస్తున్నాయి.

Other Updates