maga2017-18 విద్యా సంవత్సరంలో కొత్తగా 255 రెసిడెన్షియల్స్‌ స్కూళ్ళను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు రికార్డు స్థాయిలో 169 రెసిడెన్షియల్స్‌ స్కూళ్లు ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు.

పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ విద్య అందించడం లక్ష్యంగా బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్స్‌ ప్రారంభించా లనే ప్రభుత్వ ఉద్దేశ్యానికి అనుగుణంగా విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే స్కూళ్లు ప్రారంభించారని అధికార యంత్రాంగాన్ని సీఎం అభినందించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేరిన విద్యార్థులు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిరావు ఫూలేలను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదగాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కెజి టు పిజి విద్యా విధానానికి బడుగు, బలహీన వర్గాల రెసిడెన్షియల్‌ స్కూళ్లతో అంకురార్పణ జరగడం ఆనందంగా ఉందని సీఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు కలిపి కేవలం 259 రెసిడెన్షియల్‌ స్కూళ్లు మాత్రమే ఉండేవని, కేవలం మూడేళ్ళలో కొత్తగా 527 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రారంభించి, మొత్తం రెసిడెన్షియల్‌ స్కూళ్ల సంఖ్యను 786కి తీసుకుపోతున్నామన్నారు. బాలికల విద్యను ప్రోత్సహిం చేందుకు, వారికి అత్యంత భద్రత, సౌకర్యం కల్పిస్తూ సగం రెసిడెన్షియల్స్‌ను బాలికల కోసం కేటాయించినట్లు సీఎం వెల్లడించారు.

ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున లక్షా 25వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఇంటర్మీడియట్‌ వరకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పేద విద్యార్థులు కూడా గొప్పగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలన్నది తమ లక్ష్యమని సీఎం చెప్పారు. పేద పిల్లలు ఇంగ్లీషు మీడియంలో మంచి చదువులు చదివి, రేపటి భారతదేశాన్ని నడిపించాలనే సంకల్పంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభించిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివిన పిల్లలు ఎంసెట్‌, జెఇఇ లాంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదించి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతుండడం తనకెంతో ఆనందాన్ని, తృప్తినీ కలిగిస్తున్నాయని సీఎం ప్రకటించారు.

ఒకే రోజు 169 స్కూళ్లు ప్రారంభం

2017-18 విద్యాసంవత్సరం ప్రారంభం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 169 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రారంభమ య్యాయి. వీటిలో 119 బిసి, 50 మైనారిటీ రెసిడెన్షి యల్స్‌ ఉన్నాయి. దీంతో 2017-18 విద్యా సంవత్స రంలో ప్రభుత్వం ప్రారంభిస్తున్న రెసిడెన్షియల్స్‌ సంఖ్య 255కు చేరుకుంది. తెలంగాణ రాకముందు ఎస్సీలకు 134 రెసిడెన్సియల్స్‌ ఉండేవి. తెలంగాణ వచ్చిన

మరుసటి సంవత్సరమే ఎస్సీలకు 104 రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ఎస్సీ మహిళల కోసం 30 డిగ్రీ రెసిడెన్షియల్స్‌ ప్రారంభించారు. తెలంగాణ రాకముందు ఎస్టీలకు 94 రెసిడెన్షియల్స్‌ ఉండేవి. తెలం గాణ వచ్చిన తర్వాత కొత్తగా ఎస్టీల కోసం 51 రెసిడెన్షియల్స్‌ను గతేడాది ప్రారంభించారు. ఈ ఏడాది ఎస్టీ మహిళల కోసం కొత్తగా 15 డిగ్రీ రెసిడెన్షియల్స్‌ త్వరలో ప్రారంభిస్తున్నారు. తెలంగాణ రాకముందు బిసిలకు కేవలం 19 రెసిడెన్షియల్స్‌ ఉండేవి. తెలంగాణ వచ్చిన మరుసటి ఏడాది 5 బిసి రెసిడెన్షియల్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరం 119 రెసిడెన్షియల్స్‌ ప్రారంభమవు తున్నాయి. తెలంగాణ రాకముందు మైనారిటీలకు రెసిడెన్షియల్స్‌ లేవు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏడాదిలోనే కొత్తగా 71 మైనారిటీ రెసిడెన్షియల్స్‌ ప్రారంభించడంతో పాటు, 12 ప్రభుత్వ రెసిడెన్షియల్స్‌ను మైనారిటీ రెసిడెన్షియల్స్‌ గా మార్చారు. ఈ ఏడాది మరో 121 రెసిడెన్షియల్స్‌ మైనారిటీల కోసం ప్రారంభిస్తున్నారు. దీంతో మైనారిటీ రెసిడెన్షియల్స్‌ సంఖ్య 204కు చేరింది.

బిసి రెసిడెన్షియల్స్‌ స్కూళ్ల స్థాపనలో రికార్డు

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు 119 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలో 56 బాలురకు, 63 బాలికలకు కేటాయించారు. మొదటి ఏడాది 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించారు. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్ల చొప్పున మొదటి ఏడాది ఒక్కో రెసిడెన్షియల్‌ లో 240 మంది పిల్లలకు ప్రవేశం కల్పించారు. ఐదేళ్ల సమయంలో ఒక్కో ఏడాది ఒక్కో తరగతిని పెంచుకుంటూ 12వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తారు. అప్పుడు ఒక్కో రెసిడెన్షియల్‌ లో విద్యార్థుల సంఖ్య 640 కు చేరుతుంది. ఐదేళ్లలో మొత్తం బిసి గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య 91,520 చేరుకుంటుంది.

గత ఏడాది 71 మైనారిటీ రెసిడెన్షియల్స్‌ ను ప్రారంభిం చగా, ఈ ఏడాది 121 ప్రారంభమవుతున్నాయి. గత ఏడాది 5, 6, 7వ తరగతుల్లో ప్రవేశాలు జరిగాయి. వాటిని ఈ సారి 8వ తరగతి వరకు విస్తరిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభించే మైనారిటీ స్కూళ్ళలో 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రతీ ఏడాది ఒక్కో తరగతి పెంచు కుంటూ పోతారు. ప్రస్తుతం మైనారిటీ విద్యాసంస్థల్లో 50 వేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య లక్షా 30వేలకు చేరుకుంటుంది.

ఈ లెక్కన బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్స్‌ (డిగ్రీ రెసిడెన్షియల్స్‌ మినహాయిస్తే 741) స్కూళ్లలో రాబోయే ఐదేళ్లలో 4,74,240 మంది విద్యార్థులకు అవకాశం లభిస్తుంది.

ప్రస్తుతం కిరాయి గదులు తీసుకుని స్కూళ్లు ప్రారం భించారు. రెసిడెన్షియల్‌ స్కూళ్ళ నిర్మాణానికి స్థలం సేకరించాల్సిందిగా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ రెసిడెన్షియల్స్‌ లో దాదాపు 24 వేల మంది అధ్యాపకులు అవసరం పడుతారని అంచనా. వీరిని దశల వారీగా నియమించే ప్రక్రియ ప్రారంభ మయింది. రెసిడెన్షియల్‌ విద్యార్థులకు యూనిఫారాలు సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వం తెలంగాణ స్టేట్‌ హండ్లూమ్‌ వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీని ఆదేశించింది. విద్యార్థులకు కావల్సిన పాఠ్య, నోటు పుస్తకాలను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది.

Other Updates