లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం, దానిని సాధించాలంటే కావలసిన లక్షణాలు ఎలాంటివి ఉండాలో కూడా కుదుర్చుకున్నాము. కాని లక్ష్యసాధనలో మనకు ఉండాల్సింది లక్ష్యం పట్ల స్పష్టత. గోల్ క్లారిటీ అంటాము. ఈ లక్ష్యం పట్ల స్పష్టతను తెచ్చుకోవాలంటె మనకు లక్ష్యానికి మధ్యలో వున్న అనవసరం అనిపించే వాటిని వదిలించుకోవాలి. ఇది ఒక సామాన్య యువకుడు, రాజకుమారి కథ అన్నమాట. ఉదాహరణకు ఒక సామాన్య యువకుడు రాజకుమారిని చూసి ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు, రాజకుమారి ఇతని ధైర్య సాహసాలు చూసి మోహిస్తుంది. పెళ్ళి చేసుకుందామనుకునే సరికి రాజు, రాజ్యానికి ఒక రాక్షసుని వల్ల విపత్తు వుంది. అతనిని సంహరిస్తేనే ఈ పెళ్ళి జరుగుతుందని, నిజంగా నువ్వు ఆ పని చేస్తే నా కుమార్తెతో పాటు ఈ రాజ్యం నీకే అంటాడు. అప్పుడు యువకుడు సరే అంటాడు.
రాక్షసున్ని సంహరించే ప్రయత్నంలో తనకు తోడుగా రాక్షసుడు యువకుణ్ణి అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తాడు. ఈ యువకున్ని మభ్య పెట్టడానికి అందమైన అమ్మాయిలను పంపిస్తాడు. అన్నింటిని దాటుకొని తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, రాజకుమారి ప్రోత్సాహంతో ఆమెను ఎలాగైనా పెళ్లాడాలని తీవ్రమైన కోరికతో రాక్షసుణ్ని అంతం చేసి రాజకుమారిని వివాహం చేసుకుంటాడు. ఇలా గతంలో ఎన్నో సినిమాలు చూసి వున్నాము. మన జీవితంలో కూడా మంచి ఉద్యోగం రాజకుమారిలాంటిది/ లేదా రాజ్యం లాంటిది. దాని కోసం ప్రయత్నిస్తుంటె ఎంతో మంది మనల్ని నిరుత్సాహపరుస్తారు. అసలు నీకు ఆ ఉద్యోగం వస్తుందా? అంత పెద్ద లక్ష్యం పెట్టుకుంటావా.. మీ ఇంట్లో చదువుకున్న వాళ్లే లేరు. నీకు మంచి మార్కులు వచ్చినంత మాత్రాన, నువ్వు ఇలాంటి సాధించలేని లక్ష్యం పెట్టుకోకూడదు. క్లర్క్ పోస్ట్ చాలు అని చెపుతారు. అలాంటి వారిని మనం వదిలించుకోవాలి. మధ్యలో మన స్నేహితులు సినిమాలు, షికార్లు, ముచ్చట్లు, పార్టీలు.. నిరుత్సాహ మాటలు, ఉద్యోగాలు లంచాలు ఇస్తేనే వస్తాయి. రికమెండేషన్ వుండాలి.. ఇలాంటి వాటికి పూర్తిగా అవాయిడ్ చెయ్యాలి. ఇవ్వన్నీ దగ్గరి మిత్రుల నుండే వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చెయ్యాలి. లక్ష్య సాధనలో మనలో శత్రు గుణాలు, రాదేమో, నేను చెయ్యలేనేమో, అనవసరంగా అందరిలో నవ్వులపాలు అవుతానేమో, నేను ఏదిచేసినా నేను అనుకున్న ఫలితం రాదు.. నాకు ఏకాగ్రత ఉండటం లేదు. ఇలాంటి వాటిని సమూలంగా తీసెయ్యాలి. ఎలిమినేట్ చెయ్యాలి. ఎలా చెయ్యాలి. ‘శ్రమ’నే మనిషి జీవితానికి పునాది రాయి. అభివృద్ధికి సోపానం. కొన్ని కోట్ల మంది శ్రమించడం ద్వారా ఉన్నత స్థానాలకి వెళ్ళారు. మనం శ్రమించాలి ఉన్నతమైన స్థానానికి అర్హత సాధించాలి. అనుకోని దానిని ఆచరణలో పెట్టడమే రాక్షస సంహారం. నిరంతరం మన లక్ష్యాన్ని సాధించడంలో, సాధించిన తర్వాత మనం చెయ్యాల్సిన పనులు, వచ్చే సంతృప్తిని మనో దర్శనం వలన ఉత్పేరకంలా పనిచేస్తే మనం అనుకున్న పనిని సాధించగలుగుతాము.
నిరంతర శ్రమ
వదిలి వేయండి
అనవసర ఎంజాయ్‌మెంట్
అనవసరమైన మిత్రులు
మొబైల్ చాటింగ్
స్నేహం పేరుతో ప్రేమాట
మూడు నెలల క్రితం రమేష్ అనే అబ్బాయి ఇంజనీరింగ్ పోస్ట్‌ల పరీక్ష కోసం సన్నద్ధం కావడానికి హైదరాబాద్ వచ్చాడు. ఒక వారం బాగా చదివాడు.. కొత్త స్నేహితులు అయ్యారు. ప్రతిరోజు గంటసేపు రిలాక్స్ ఉంటుందని, బయటకు టీ కోసం వెళ్లాడు. అలా! అలా! ప్రతిరోజు గంటల తరబడి ముచ్చట్లు పెట్టడం, ఇదంతా ప్రిపరేషన్‌లో భాగంగానే అనుకోవడం.. ఇలా! ఒక నెల గడిచింది. మధ్యలో జరిగిన పరీక్షలో తనకు ఘోరంగా మార్కులు వచ్చాయి. అప్పుడు ఏడుస్తూ నా దగ్గరకు వచ్చాడు. నేనొచ్చిన పని వదిలేసి అన్నీ ముఖ్యం అయినాయి. నా తల్లిదండ్రులను మోసం చేస్తున్నాను. నేనేం చెయ్యాలి అని, అప్పుడు ఈ గోల్ క్లారిటీ వర్క్‌షీట్ అతని ముందు పెట్టి గుర్తు చేసిన తరువాత తను చెయ్యాల్సిన పనుల పట్ల స్పష్టత వచ్చి దానిని అమలుచేసే పనిలో పడ్డాడు. పోటీ పరీక్షలు వ్రాసే వాళ్లకు, పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులందరికి ఇది మార్గదర్శనం చేస్తుంది. దీనిని ఉపయోగించి లక్ష్యాన్ని సునాయసంగా సాధించండి.
పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు వచ్చే సందేహాలు, అపోహలను డా|| వీరేందర్ నివృత్తి చేస్తారు. మీ సందేహాలను సతీఙవవతీవఅసవతీఏస్త్రఎaఱశ్రీ.షశీఎకు పంపించండి.