1,12,536 పోస్టుల భర్తీకి పంచవర్ష ప్రణాళిక
27,660 నియామకాలు మూడేళ్లలోనే భర్తీ
84,876 ఉద్యోగాల కల్పన కోసం ఆదేశాలు
పెరిగిన ప్రభుత్వ పథకాల వల్ల పెరిగిన ఉద్యోగావకాశాలు
నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్ష మలిదశ ఉద్యమానికి పునాది అయింది. తెలంగాణ ఉద్యమకారులు అంకెలతో సహా చెప్పడంతో కేంద్రం కూడా ఏకీభవించింది. తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తప్ప ఈ మూడు ప్రధాన విషయాల్లో న్యాయం జరగదనే విషయంలో యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థ కూడా అంగీకారానికి వచ్చింది. ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడి ఆదాయం ఇక్కడే ఖర్చు అవుతున్నది. 1.49 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుని తన ప్రగతి ప్రణాళికను తానే అమలు చేసుకోగలుగుతున్నది తెలంగాణ రాష్ట్రం. సాగునీటి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి వున్న వాటాకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. ఇక ముఖ్యమైన మరో అంశం నియామకాలు, రాష్ట్ర విభజన జరిగితే, ఆంధ్ర ఉద్యోగులు వారి రాష్ట్రానికి వెళ్లిపోవడం ద్వారా, వివిధ శాఖల్లో రిటైర్మెంట్ల ద్వారా లక్ష ఖాళీలు ఏర్పడతాయని అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.
ఉద్యోగుల విభజనలో జాప్యం
తెలంగాణ ఏర్పడిన వెంటనే ఉద్యోగుల విభజన జరగలేదు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే వుంది. అయినా ప్రభుత్వం శాఖల వారీగా ఉన్న ఖాళీలను తెప్పించుకుంది. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీలను కూడా అంచనా వేసింది. దీనికి అనుగుణంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించు కుంది. ఈ నియామకాలు పారదర్శకంగా జరిగేందుకు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను నియమించింది. 2014 డిసెంబర్ 17న నియామకమైన ఘంటా చక్రపాణి నాయకత్వంలోని కమిషన్ తెలంగాణలోని ఉద్యోగార్థులకు అవసరమైన సిలబస్ రూపకల్పనలో నిమగ్నమైంది. వివిధ అంశాల్లో నిష్ణాతులైన అనుభవజ్ఞుల ఆధ్వర్యంలోని సిలబస్ రూపొందించింది. శాఖల వారీగా ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తూ నియామకాలు చేపడు తున్నది.
ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటి వరకు 58 నోటిఫికేషన్లు జారీ చేసింది. పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా ఇప్పటికే 5000లకు పైగా ఉద్యోగాల నియామకాలు జరిగాయి. మరో 12 వేల ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే కాకుండా విద్యుత్, ఆర్టీసీ, సింగరేణి, పోలీస్ శాఖలు వేర్వేరుగా తమ శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టాయి. పోలీస్ శాఖలో 10,499 మంది, విద్యుత్ శాఖలో 2,681 మంది, సింగరేణిలో 5,515 మంది, ఆర్టీసీలో 3,950 మంది నియామకమై ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 27,660 మంది కొత్తగా ఉద్యోగాలు పొందారు. 36,806 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. వివిధ శాఖల్లో ఇంకా 48,070 ఖాళీలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిని భర్తీ చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ వచ్చే నాటికి దాదాపు 50,000 ఖాళీలున్నాయి. ఆంధ్ర ప్రాంతం వారు వెళ్లిపోవడం వల్ల మరో 30 వేల దాకా ఖాళీలు ఏర్పడ్డాయి. సుమారు 20 వేల మంది ఈ రెండున్నర ఏళ్లల్లో రిటైరయ్యారు. దీంతో తెలంగాణలో లక్షా 7 వేల ఉద్యోగాలు నింపుకునే అవకాశం వచ్చింది. వచ్చే ఏడాది కూడా ఏర్పడే ఖాళీలను పరిగణలోకి తీసుకుని ఇప్పటినుంచే భర్తీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ఉద్యోగాల భర్తీపై నిరంతర సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలను అమలు చేయడానికి ప్రతీ వారం సమీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు, అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పనిచేస్తున్నారు. కొన్ని నియామకాలకు సంబంధించిన కోర్టుల్లో నడుస్తున్న కేసులు కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు ప్రభుత్వం తరపున కావాల్సినంత చొరవను ప్రదర్శిస్తున్నారు.
కొత్త పథకాలతో కొత్త ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు సరికొత్త అభివృద్ధి నమూనా రూపొందించి ముందుకు పోతున్నారు. దీనివల్ల సంప్రదాయంగా ఏర్పడ్డ ఉద్యోగాలే కాకుండా రాష్ట్రంలో కొన్ని వేల ఉద్యోగాలు కొత్తగా పుట్టుకొచ్చాయి. చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ, ఇంటింటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించే మిషన్ భగీరథ, రహదారుల నిర్మాణం తదితర కార్యక్రమాల అమలు కోసం పెద్ద ఎత్తున ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకాలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేం దుకు విద్యుత్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేపట్టిన కారణంగా వేల మందికి విద్యుత్ ఇంజనీర్ల ఉద్యోగాలు వచ్చినాయి. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి ఉండాలనే లక్ష్యం పెట్టుకోవడం వల్ల రాష్ట్రంలో 25 వందల మంది వ్యవసాయ అధికారులు కొత్తగా వచ్చారు. పశు సంవర్ధక, మత్స్య శాఖ, ఉద్యానవన శాఖలను బలోపేతం చేయాలనే నిర్ణయం వల్ల వందలాది పోస్టులు పుట్టుకొచ్చాయి. జిల్లాల పునర్ విభజన వల్ల కొత్తగా వేల ఉద్యోగాలు ఏర్పడ్డాయి. శాంతి భద్రతలకు పెద్ద పీట వేయడం వల్ల వేలాది పోలీసుల నియామకాలు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ పాఠశాలలు పెడుతున్నందుకు కొత్తగా వేలాది మంది ఉపాధ్యాయ
ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. గడిచిన మూడేళ్లలో నియామకాలు, రాబోయే రెండున్నరేళ్లలో చేపట్టే నియా మకాలు లెక్క తీసుకుంటే దేశంలో ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తున్నది.
నియామకాల్లో మూడేళ్ల ప్రగతి
క్ర. శాఖలు నియామకం నోటిఫికేషన్
సం. కాబడినవి స్టేజ్+ మొత్తం
ఖాళీలు
1 పోలీస్ 10,499 27,321 37,820
2 విద్యుత్ 2,681 10,399 13,080
3 విద్య – 12,005 12,005
4 సాంఘిక సంక్షేమం,
ఎస్సీ,ఎస్టీ,బిసి,
మైనారిటీ టీచర్స్ రిక్రూట్మెంట్ – 12,436 12,436
5 వైద్య-ఆరోగ్యం – 8,347 8,347
6 సింగరేణి 5,515 1,970 7,485
7 ఆర్ట్టీసి 3,950 – 3,950
8 పంచాయితీరాజ్ 123 3,528 3,651
9 రెవెన్యూ – 2,506 2,506
10 వ్యవసాయం ఉద్యానవనం 1,506 – 1,506
11 ఆర్ బి లో ఎ.ఇ.పోస్ట్స్,
ఇరిగేషన్, మిషన్ భగీరథ 1,058 – 1,058
12 ఉన్నత విద్య – 1,678 1,678
13 గ్రూప్ సర్వీసెస్ – 1,032 1,032
14 ఇరిగేషన్ 120 1,058 1,178
15 ఇరిగేషన్, మిషన్ భగీరథలో
ఎ.ఇ.ఇ.పోస్టులు 947 – 947
16 ఫైనాన్స్ – 720 720
17 వెటర్నరి అసిస్టెంట్స్ 251 489 740
18 సెక్రటేరియట్ – 677 677
19 ఆర్ & బి – 513 513
20 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 123 65 188
21 ఎక్సైజ్ 340 – 340
22 రవాణా 182 – 182
22 హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి 263 – 263
24 గ్రూప్-సర్వీసెస్ – 132 132
25 గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ 58+44 – 102
(టెక్నికల్ గ్రేడ్)
మొత్తం: 27,660 84,876 1,12,536
గటిక విజయకుమార్