ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ప్రసంగం
నా ప్రభుత్వం చేపట్టిన భారీ కార్యక్రమాలలో రైతుల పొలాలకు కృష్ణా, గోదావరి నదుల జలాలను తీసుకురావడం కోసం అనేక భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం, మిషన్ కాకతీయ క్రింద చెరువులను పునరుద్ధరించడం, మిషన్ భగీరథ క్రింద ప్రతీ కుటుంబానికి పైపులద్వారా త్రాగునీటిని సమూర్చడం, విద్యుత్ పరిస్థితిని మెరుగుపరడం, వెనుకబడిన రంగాల సర్వతోముఖాభివృద్ధికోసం నిధులను టాేయించడానికి షెడ్యూల్డు కులాల ప్రత్యేకాభివృద్ధి నిధి, షెడ్యూల్డు తెగల ప్రత్యేకాభివృద్ధి నిధి చట్టాన్ని చేయడం అనేక ఇతర కార్యక్రమాలతోపాటు వున్నాయి.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి
నా ప్రభుత్వం చేపట్టిన క్రియాశీలక విధాన చర్యలతో రాష్ట్రం ఏర్పడినప్పటినుండి ఆర్థిక పురోభివృద్ధి గోచరిస్తున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటినుండి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దశ తిరిగి అభివృద్ధిపథంలోకి ప్రవేశించింది. రాష్ట్రం ఏర్పడడానికి ముందు గత రెండు సంవత్సరాలలో మునుపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 శాతంగావున్న తెలంగాణ ప్రాంత స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి సగటు వార్షిక పెరుగుదల 5.9 శాతంగావున్న భారతదేశ పెరుగుదల రేటుకంటే చాలా తక్కువగా వుంది. ఈ పరిస్థితి రాష్ట్రం ఏర్పడిన తరువాత తారుమారయింది. 2014-15 నుండి 2016-17 వరకు మూడు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం జీఎస్‌డీపీ 8.6 శాతపు సగటు వార్షిక పెరుగుదలకు చేరుకుంది. ఇది 7.5 శాతపు జాతీయ సగటుకంటే అత్యధికం.
రూ. 1.03 లక్షల దేశ తలసరి ఆదాయానికిగానూ, 2016-17 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1.54 లక్షలుగా అంచనా వేయబడమయింది.
వ్యవసాయరంగ పునరుద్ధరణకు నా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. రాష్ట్ర జనాభాకు వ్యవసాయం ప్రధానాధారంగా వుండగా, రాష్ట్రం ఏర్పాటుకు పూర్వం ఈ రంగం తీవ్ర దుస్థితిలో వుంది. నమ్మకమైన సాగునీటి సౌకర్యాల లేమితో రాష్ట్ర వ్యవసాయం అస్థిర రుతుపవనాలపైన, క్షీణించిన భూగర్భ జలాలపైన అధికంగా ఆధారపడింది. ఫలితంగా అత్యల్ప ఉత్పాదకతలవల్ల రైతులకు తక్కువ, అనిశ్చిత ఆదాయాలు వస్తున్నాయి.
నా ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర కార్యకలాపాలు రెండింటిలో రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ ఒక సమగ్ర విధానాన్ని ఆవిష్కరించింది. తక్షణ సహాయంగా నా ప్రభుత్వం 35.3 లక్షలమంది రైతులకు ప్రయోజనం కల్పిస్తూ రైతుకు రూ. 1 లక్ష వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. క్షేత్ర యాంత్రీకరణ, నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో సరఫరా చేయడాన్ని కట్టుదిట్టం చేయడం, సూక్ష్య సేద్యం, గ్రీన్ హౌజ్‌లు, పాలిహౌజ్‌లువంటి వ్యవసాయ ఉత్పాదకతలలో పెరుగుదల నిమిత్తం చేపట్టిన కీలక చర్యలు రైతుల ఆదాయంపై గణనీయమైన ప్రభావాన్ని చేపాయి. 2016-17 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 101.29 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడమయింది.
తెలంగాణ రాష్ట్రం 2018, జనవరి 1వ తేదీనుండి దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, ఎత్తిపోతల పథకాలకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తును ఉచితంగా సరఫరాచేస్తూ ఒక నూతన రికార్డును సృష్టించింది. రైతుల దుస్థితిని రూపుమాపడానికి విద్యుత్తు రంగంలో దేశంలోనే ఈ గమ్యాన్ని చేరుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
రైతుల ఆదాయాన్ని పెంపొందించడంకోసం పశు సంవర్థక, గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమవంటి వ్యవసాయేతర కార్యకలాపాలనుండి ఆదాయాన్ని వృద్ధి చేయడం ూడా అంతే ముఖ్యం. దాదాపు రైతుల 40 శాతం ఆదాయం రాష్ట్రంలోని వ్యవసాయేతర కార్యకలాపాల ద్వారా ఒనగూరుతున్నది. దీనిని దృష్టిలో వుంచుకుని నా ప్రభుత్వం గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ, పాడి పశువులు మున్నగువాటికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది.
నా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రారం భించిన గొర్రెల సరఫరా పథకం ప్రగతిదాయకంగా వున్నది. 84 లక్షల గొర్రెల లక్షిత పంపిణీకి గానూ 75శాతం సబ్సిడీతో గొల్ల, కురుమ కులాలకు 50 లక్షల 10వేల గొర్రెలను ఇప్పటి పంపిణీ చేయడమయింది. ఈ పథకం కులాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, మాంసం ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించి, గొర్రె మాంసానికి ప్రధాన ఎగుమతిదారుగా రూపొందించాలని ఆశించడమయింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రారంభంలో సంశయాలు ఉన్నప్పటికీ, సాధించిన విజ యాలపట్ల సంతృప్తిచెంది సభ దృష్టికి తీసుకువస్తున్నాను. అంతేకాక, నా ప్రభుత్వం పశుగణ ఆరోగ్య పరిరక్షణకోసం ప్రతీ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశువైద్య చికిత్సా ంద్రాలను ప్రారంభించింది.
చేప పిల్లల పంపిణీ, చేపల మార్కెటు యార్డుల నిర్మా ణం ద్వారా మత్స్యకారుల సంక్షేమంకోసం నా ప్రభుత్వం క్రియాశీలక కార్యక్రమాలను చేపట్టింది. మిషన్ కాకతీయ క్రింద సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, చెరువుల పునరుద్ధరణ, తద్వారా నీటి వనరులను పెంపొందించడం ద్వారా మత్స్య పరిశ్రమ రంగాన్ని చెప్పుకోదగినంతగా విస్తరించడమవుతుందని ఆశించడమయింది.
ఉద్యానవన పంటలను ప్రోత్సహించడం రైతుల ఆదాయాన్ని పెంచే ముఖ్య వ్యూహంగా గుర్తించడమయింది. అత్యధిక విలువ, ఉద్యానవన పంటలకు పంట విధానాన్ని వైవిధ్యీకరించేందుకు వివిధ కార్యక్రమాలను నా ప్రభుత్వం చేపట్టింది. సూక్ష్య సేద్యం, పాలిహౌజ్‌లు, గ్రీన్‌హౌజ్‌ల అభివృద్ధి వంటి కొన్ని కార్యక్రమాలను ఉద్యానవన శాఖ యొక్క పండ్లు, ూరగాయల విశిష్ట ంద్రంలో చూశాను. రైతుల ఆదాయాన్ని పెంచేందుకోసం రాష్ట్రం క్రాప్ కాలనీలను సమూర్చడమవుతున్నది.
పంట కోతల అనంతరం, వ్యవసాయ ప్రాసెసింగ్ నిర్వహణ రెండింటికోసం సాధారణ మౌలిక సదుపా యాలను సమూర్చడానికి నా ప్రభుత్వం అనేక చర్యలను ూడా చేపడుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పుడు నిల్వ సా మర్థ్యం 4.17 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే; రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి 18.30 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో 356 శాస్త్రీయ గోదాముల నిర్మాణాన్ని నా ప్రభుత్వం ప్రారంభించి, 308 గోదాములను పూర్తి చేసింది.
నా ప్రభుత్వం అత్యంత కష్టమైన భూ రికార్డులను తాజాపరచే కార్యక్రమాన్ని ూడా చేపట్టింది. 10823 గ్రామాలన్నింటిలో మొత్తం 1507 బృందాలు ఈ కసరత్తునుచేపట్టి, 100 రోజుల రికార్డు సమయంలోపే పూర్తి చేశాయి. 96 శాతానికి మించిన భూ రికార్డులను ఖాతావారీగా తనిఖీచేసి, ఎటువంటి వివాదాలు లేవని ప్రకటించడమయిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను త్వరలోనే జారీ చేయాలని నిర్ణయించడమయింది. వివాదాస్పద సుేలకు సంబంధించి పరిష్కారంకాని అంశాలను పరిష్కరించేందుకు చర్యలను తీసుకోవడమవుతున్నది. రైతులందరికీ సుస్థిర ఆదాయాన్ని సమూర్చేందుకు నా ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందిస్తున్నది. త్వరలోనే ప్రారంభించే ధరణి వెబ్‌సైట్‌లో రాషా్టనికి సంబంధించిన భూరికార్డుల పూర్తి సమాచారం ఉంటుంది.
సాగునీటిరంగం
వ్యవసాయరంగం తెలంగాణయొక్క ప్రధానాధారమయితే, సాగునీటిరంగం జీవనాధారంగా ఉంది. గోదావరి, కృష్ణా నదులలో లభ్యంగా ఉన్న నీటిని అత్యంతానుూలంగా వినియోగించడానికి నా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించింది. నా ప్రభుత్వం 23 భారీ సాగునీటి ప్రాజెక్టులను, 13 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. ఈ ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేయడానికి వివిధ చర్యలను చేపట్టింది. ఇప్పటివరకు 16.64 లక్షల ఎకరాల కొత్త సాగునీటి సామర్థ్యాన్ని కల్పించి, 8.97 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమయింది.
నా ప్రభుత్వం, ఒక కోటి ఎకరాలకు సాగునీటి సామర్థ్యాన్ని సమూర్చడానికి పూర్తి సన్నద్ధంగా ఉంది. ఇది వ్యవసాయరంగాన్ని, అనావృష్టిని ఎదుర్కొనేటట్లుగా చేసి శాశ్వత ప్రాతిపదికన రైతుల దుస్థితిని నివారిస్తుంది.
కొనసాగుతున్న కీలక సాగునీటి ప్రాజెక్టులు: పాలమూరు ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల సగునీటి ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు, అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ, నా ప్రభుత్వం రికార్డు సమయంలో అనుమతులన్నింటినీ పొందేందుకు ంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో సఫలీకృతమైంది. నేను ఇటీవలే కొన్ని ప్రాజెక్టులను వ్యక్తిగతంగా సందర్శించి, పనులు చురుకుగా సాగుతున్నందుకు, వారు చూపుతున్న అంకిత భావానికి నేను ముగ్ధుడనయ్యాను. ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన మీదట, సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక ప్రయోజనాలకు సరిపడ నీటి లభ్యత వల్ల రాష్ట్ర ముఖచిత్రం మారుతుంది.
మిషను కాకతీయ కార్యక్రమంక్రింద చెరువుల పునరుద్ధరణ పనులు పురోగతిలో వున్నాయి. చుట్టుప్రక్కల ప్రాంతలలోని భూగర్భ జలమట్టాలలో గణనీయమైన మెరుగుదల వుండడం ఎంతో సంతోషిచాల్సిన విషయం. కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ ఒక ప్రక్క రైతు మద్దతు పథకాలు మరో ప్రక్క వ్యవసాయరంగానికి ఉజ్వలమైన భవిష్యత్తును తెలియజేస్తున్నాయి.
విద్యుత్తురంగం
రాష్ట్రంలో విద్యుత్తు పరిస్థితిని మెరుగుపరచడంలో నా ప్రభుత్వం చిరస్మరణీయమైన పురోగతిని సాధించింది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో విద్యుత్తు రంగంలో సంక్షోభం లాంటి పరిస్థితి వున్నది. పరిశ్రమలకు 2 రోజుల పవర్‌హాలిడే పరిస్థితి నుండి ఎటువంటి విద్యుత్తుకోతలులేని స్థితికి విద్యుత్తురంగం ప్రస్తుతం మార్పు చెందింది. ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి రైతులకు 24ఞ7 విద్యుత్తును సమూర్చడమవుతున్నది. అన్ని టేగిరీల వినియోగ దారులకు సరఫరా చేసే విద్యుత్తు నాణ్యత, పరిమాణంలో చెప్పుకోదగ్గ మెరుగుదల ఉండడం ఎంతో సంతృప్తిని ఇచ్చే అంశం.
విద్యుత్తురంగంలో స్వయం సమృద్ధి రాష్ట్రంగా చేసే చర్యలో భాగంగా 2014లో 7778 ఎండబ్ల్యూలనుండి ప్రస్తుతం 15,344 ఎండబ్ల్యూలకు కాంట్రాక్టు సామర్థ్యం పెరిగింది. సమీప భవిష్యత్తులో రాషా్టన్ని విద్యుత్తు మిగులు రాష్ట్రంగా చేయడానికి, మరో 12931 ఎండబ్ల్యూ సామర్థ్యం గల విద్యుత్తు ప్రాజెక్టులు వివిధ అభివృద్ధి నిర్మాణ దశలలో వున్నాయి.
ఐక్యరాజ్య సమితి ఉద్దేశించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను అందుకోవడానికి నా ప్రభుత్వం వివిధ విధా నాలలో లక్ష్యాలను చేర్చుతున్నది. తెలంగాణ రాష్ట్రపు సౌర విధానం దేశంలోనే అత్యుత్తమైనదని విస్తృతంగా కొనియాడబడుతున్నదన్న విషయాన్ని మీతో పంచుకో వడానికి నేను సంతోషిస్తున్నాను. తెలంగాణ 3283 ఎండబ్ల్యూల అత్యధిక స్థాపిత సౌర సామర్థ్యం కలిగి దేశంలో అగ్రగామిగా నిలుస్తున్నది.
పరిశ్రమలు
టిఎస్-ఐపాస్ క్రింద ఎటువంటి విచారణ వ్యవస్థ లేకుండా ఏక గవాక్షం ద్వారా 15 రోజులలోపు అన్ని పారిశ్రామిక అనుమతులను సమూర్చడానికి ఒక పారదర్శకమైన, అవినీతి రహిత, సరళీకృత పారిశ్రామిక విధానాన్ని రూపొందించి, అమలు చేయడంద్వారా దేశంలోనే తెలంగాణ అత్యంత పారిశ్రామిక పెట్టుబడుల గమ్యస్థానంగా ఉద్భవించింది. త్వరితగతిన రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఇది మార్గాన్ని సుగమం చేసింది.
టిఎస్-ఐపాస్‌ను విజయవంతంగా అమలు చేయడంలో, సులభతర వాణిజ్య నిర్వహణలో రాష్ట్రం దేశంలో మొదటిస్థానాన్ని చేజిక్కించుకున్నది. తత్ఫలితంగా, 4.47 లక్షల మంది వ్యక్తుల నేరు ఉపాధి సామర్థ్యంతో 6206 పారిశ్రామిక యూనిట్ల ఆమోదంతో ఊహించని విధంగా 1.18 లక్షల కోట్ల పెట్టుబడులు రాషా్టనికి చేూరాయి. 3703 యూనిట్లు వాటి కార్యకలాపాలను ప్రారంభించాయన్నది గమనార్హమైన విషయం.
చేనేతరంగం
విశిష్ట, ప్రత్యేక, వైవిధ్య డిజైన్ల వల్ల దేశంలోనే తెలంగాణ రాష్ట్ర చేనేతరంగ పరిశ్రమ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్, నారాయణపేట కాటన్ మరియు పట్టుచీరలు, వరంగల్ దుర్రీలు, కరీంనగర్ బెడ్‌షీట్స్, అలంకరణ డిజైన్ వైవిధ్యాలు రాష్ట్ర చేనేతకారుల విశిష్ట నైపుణ్యాలకు కొన్ని ఉదాహరణలు. ఈ రంగానికి మరింత ఊతమిస్తూ నా ప్రభుత్వం వరంగల్‌వద్ద ఒక సమగ్ర మెగా జౌళిపార్కును ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటివరకు యూనిట్ల ఏర్పాటుకోసం 22మంది పెట్టుబడిదారులు తెలంగాణతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
మరమగ్గాల నేతకారులు ఎదుర్కొంటున్న దుస్థితిని తొలగించడానికి నా ప్రభుత్వం వారి రుణాలను మాఫీ చేసింది. నేతన్నకు చేయూత పథకం క్రింద పొదుపు నిధిలో రాష్ట్ర ప్రభుత్వ వాటాను 8 శాతం నుండి 16 శాతానికి పెంచడమయింది. సహకార సంస్థ పరిధిలోపల, వెలుపల రెండింటిలో నేత పనితో నిమగ్నమైన వారికందరికీ పథకం పరిధిని విస్తరించడమయింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
అనేక బహుళ జాతీయ కంపెనీలు వారి క్లిష్టమైన ప్రపంచవ్యాప్త కార్యకలాపాల కోసం హైదరాబాదు నగరాన్ని ంద్రంగా చేసుకున్నారన్న విషయం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. హైదరాబాదు నగరం 1500 ఐటీ/ఐటీఈఎస్ కంపెనీలు ంద్రంగా 4.3 లక్షల మందికి పైగా వృత్తి నిపుణులకు నేరు ఉపాధిని, 7 లక్షలకు పైబడిన వ్యక్తులకు పరోక్ష ఉపాధిని ూడా సమూర్చుతున్నది. 2016-17లో సాఫ్ట్‌వేర్, ఐటీ ఉత్పత్తున ఎగుమతుల మొత్తం విలువ రూ. 85,470 కోట్లుగా వుంది.
అభివృద్ధిపథంలోని ఐటీ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో 10 ఐటీ విధానాలను నా ప్రభుత్వం ఆవిష్కరించిందన్న విషయం సంతోషాన్ని కలిగిస్తున్నది. రాష్ట్రంలోని అంకుర సంస్థల ఏర్పాటు కోసం ఒక సానుూల వాతావరణాన్ని సృష్టించడంలో టీ-హబ్ కార్యక్రమం విజయవంతమైనది. తత్ఫలితంగా ఒక ప్రపంచ ఉత్తమ అంకుర సంస్థల ంద్రంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. టీ-హబ్ అసాధారణ విజయం తరువాత, 4000మంది ఔత్సాహితక పారిశ్రామికవేత్తల కోసం అదనపు ఇంక్యుబేషన్ స్థలంలో టీ-హబ్ రెండవ దశను అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను నా ప్రభుత్వం ప్రారంభించింది.
మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతం వెలుపల నూతన ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేయాలనే తీర్మానంతో, బుద్వేల్, చుట్టుప్రక్కల గ్రామాలలో నూతన ఐటీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడమవుతున్నది.
హైదరాబాద్ నగరం వెలుపల ఐటీ రంగాన్ని విస్తరించడానికి నా ప్రభుత్వ కార్యక్రమాలు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఐటీ ఇంక్యుబేషన్ ంద్రాల ఏర్పాటుకోసం మార్గం సుగమం చేసాయి. ఆ పట్టణాలలో ఉపాధి కల్పనకు దోహదపడి, ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవనశైలిని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
మిషన్ భగీరథ
గ్రామీణ, పట్టణ కుటుంబాలన్నింటికి సురక్షిత, సరిపడా, సుస్థిరమైన, శుద్ధి చేసిన త్రాగునీటిని సమూర్చా లనే నిబద్ధతతో నా ప్రభుత్వం మిషన్ భగీరథ అనే ప్రధాన కార్యక్రమాన్ని చేపట్టింది. అనుకున్న సమయంకన్నా చాలా ముందుగా ఈ మిషన్ క్రింద దాదాపు 95 శాతం పనులు పూర్తి అవడం ఎంతో సంతృప్తికరమైన విషయం. ఇప్పటివరకు 5500కుపైబడిన గ్రామీణ జనావాసాలకు, 13 పట్టణ స్థానిక సంస్థలకు భారీ పరిమాణాలలో నీటి సరఫరా చేయడమవుతున్నది. ఇంటింటికీ నీటి సరఫరా ద్వారా 2500కుపైబడిన జనావాసాలకు వర్తింపు చేయడమయింది. ఈ కార్యక్రమం ంద్ర ప్రభుత్వ ప్రశంసలను అందుకుంది. తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌వంటి వివిధ రాష్ట్రాలనుండి అధికారులు రాష్ట్రాన్ని సందర్శించి, ఈ ప్రయోగం ద్వారా లబ్ది పొందారు.
రోడ్లు
రోడ్లు, రవాణా మౌలిక వ్యవస్థలో ఒకటిగా ఉంటూ, 80 శాతానికి పైబడి సరుకులు, ప్రయాణీకుల రవాణాకు రోడ్లను వినియోగించడం జరుగుతున్నది. అన్ని వాతావరణాలను తట్టుకునే రోడ్లతో జనావాసాలన్నిటిని అనుసంధానం చేయడం, జిల్లా ప్రధాన కార్యస్థానాలతో మండల ప్రధాన కార్యస్థానాలను అనుసంధానం చేస్తూ, రోడ్ల విస్తరణ, ప్రధాన జిల్లా రోడ్లు, రాష్ట్ర రహదారులు, ప్రధాన రోడ్డు నెట్‌వర్కు విస్తరణ, జాతీయ రహదారుల విస్తరణవంటి వివిధ కార్యక్రమాలద్వారా నాణ్యమైన రోడ్డు మౌలిక సదుపాయాలను సమూర్చే పనిని నా ప్రభుత్వం ప్రారంభించింది. రోడ్లు, భవనాలశాఖ క్రింద మండల ప్రధాన కార్యస్థానాలను జిల్లా ప్రధాన కార్యస్థానాలకు అనుసంధానం చేస్తూ 1970 కి.మీ. పొడవైన రోడ్డును, 4665 కి.మీ. పొడవైన ప్రధాన జిల్లా రోడ్లను, రాష్ట్ర రహదారులను విస్తరించి, డబుల్ రోడ్లుగా చేయడమవుతున్నది.
పట్టణాభివృద్ధి
పట్టణ ప్రాంతాలు ఆధునిక ఆర్థిక వ్యవస్థల వృద్ధి ంద్రాలుగా ఉద్భవించాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 45శాతంమంది పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్నందున, పట్టణీకీకరణ విషయంలో తెలంగాణ, దేశంలో 7వ స్థానంలో నిలిచింది. పట్టణీకరణ సామర్థ్యాలను ఆర్థిక వృద్ధి అవకాశాలుగా వినియోగించడానికి నా ప్రభుత్వం సమగ్ర కార్యక్రమాలను చేపట్టింది. పటిష్టమైన పట్టణ భౌతిక మౌలిక సదుపాయాలు, ఇతర పౌర సౌకర్యాలను సమూర్చడానికి నా ప్రభుత్వం కృషి చేస్తున్నది.
2017, నవంబరులో గౌరవ ప్రధానమంత్రిగారు మియాపూర్ నుండి అమీర్‌పేట వరకు, అమీర్‌పేటనుండి నాగోల్ వరకు 30 కి.మీ. మేర ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పిపిపి విధానంలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్టు కాగా, ఒ సమయంలో 30 కి.మీ.ల భాగాన్ని ప్రారంభించడం మరో రికార్డు. నేను వ్యక్తిగతంగా మెట్రో రైలులో ప్రయాణించాను. దీనిలో సౌకర్యాలు ప్రపంచస్థాయిలో వున్నాయని తెలియజేయ డానికి నేను సంతోషిస్తున్నాను. మెట్రో విధానానికి ప్రజల ప్రతిస్పందన చాలా ప్రోత్సాహకరంగా వుంది. అత్యంత ఆధునికమైన ప్రజా రవాణా విధానం హైదరాబాదును అభివృద్ధిలో తదుపరి స్థాయికి తీసుకువెళుతుందని నేను విశ్వసిస్తున్నాను.
తెలంగాణకు హరితహారం
ప్రకృతి వనరుల విస్తృత వినియోగం, మానవ చర్యలవల్ల ఉద్భవించిన ఉద్గారాలు వాతావరణ మార్పుకు కారణమై తక్కువ, అస్థిర వర్షపాతానికి దారితీస్తున్నాయి. ఈ ప్రపంచస్థాయి సమస్యను పరిష్కరించడానికి నా ప్రభుత్వం 2015-16లో తెలంగాణకు హరితహారాన్ని ప్రారంభిం చింది. మన రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడమనేది ఈ కార్యక్రమ లక్ష్యం. 2017-18 సంవత్సరంలో రాష్ట్రమంతటా దాదాపు 34 కోట్ల మొక్కలను నాటడమయింది. వీటిలో దాదాపు 30 కోట్లకు జియో-ట్యాగింగ్‌ను వర్తింపు చేయడమయింది.
ఆరోగ్యం
నా ప్రభుత్వం పౌరుల ఆరోగ్య స్థితిని మెరుగు పరచడానికి అనేక చర్యలను ప్రారంభించగా, దాని ఫలితాలు ఇప్పటి గోచరిస్తున్నాయి. నవజాత శిశువుల, మాతృత్వ మరణాలను తగ్గించడానికి అనేక కార్యక్రమాలను చేపట్టడమయింది. మగ శిశువుకు రూ. 12,000/-లు, ఆడ శిశువుకు రూ. 13,000/-లు కలిగివుండే సీేఆర్ కిట్ క్రింద గర్భిణీలకు వేతన పరిహారం చెల్లింపుతోపాటు రూ. 2,000/-ల విలువ కలిగిన కిట్‌ను ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం చేయించుకునే మహిళలకు ఇవ్వడమవుతున్నది. దీనివల్ల ప్రభుత్వ సంస్థలలో సంస్థాగత ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. 2017, జనవరి నుండి 2017, డిసెంబర్ వరకు ప్రభుత్వ సౌకర్యాలతో సంస్థాగత ప్రసవాల వాటా 33 శాతంనుండి 49 శాతానికి పెరిగింది.
ప్రసవ పూర్వ చెకప్‌లు, ప్రసవాలు, టీకాలకోసం గర్భి ణుల రవాణా నిమిత్తం 250 వాహనాలతో 102 సర్వీ సుల పథకాన్ని నా ప్రభుత్వం ప్రారంభించింది. అవసరమైన పరికరాలు మరియు ఇతర నవీకరణలను సమూర్చడం ద్వారా లేబర్ రూములన్నింటినీ ప్రామాణీ కరించడమయింది. రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపా యాలను పటిష్ట పరచడానికి అనేక కార్యక్రమాలను నా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం తొమ్మిది 150 పడకల మాతా, శిశు ఆరోగ్య బ్లాకులు 9 జిల్లాల్లో నిర్వహణలో ఉన్నాయి. ప్రభుత్వం జిల్లాలన్నింటిలో సదరు బ్లాకులను మరిన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది.
విద్య
నా ప్రభుత్వానికి విద్యారంగం ప్రాధాన్యత అంశంగా వుంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్ట పరచడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. రిటెన్‌న్షన్ రేటును పెంచాలనే ఉద్దేశంతో నాణ్యమైన విద్యను అందించడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకోసం నా ప్రభుత్వం 517 క్రొత్త నైవాసిక పాఠశాలలను ఏర్పాటు చేసింది.
నా ప్రభుత్వం అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, నైవాసిక పాఠశాలల్లోని విద్యార్థులకోసం ఆహార ఛార్జీలను గణనీయంగా పెంచింది. ఈ చర్య ప్రభుత్వం నిర్వహిస్తున్న నైవాసిక సంస్థలలో చదువుతున్న విద్యార్థులను సమతుల పౌష్టికారాహారాన్ని అందించేలా చూస్తుంది. రాష్ట్రంలో ఉర్దూ ద్వితీయ భాష అయినప్పటికీ, ప్రథమ భాషగా ఉర్దూను చదవడానికి విద్యార్థులకు అవకాశం ఇవ్వడం జరుగుతున్నది.
సంక్షేమ ప్రోత్సహాకాలు
2017, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం అనే క్రొత్త చట్టాన్ని అమలు చేసేందుకు ఎస్సీలు, ఎస్టీల సంక్షేమం కోసం అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడానికి మరింత దృష్టిని సారించేందుకు నా ప్రభుత్వం కట్టుబడి వుంది. ఖర్చు చేయని మిగులు నిధులను రాబోయే ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వార్డ్ చేసే విశిష్ట నిబంధన చట్టంలో వుంది.
ఎస్టీల సామాజిక ఆర్థికాభివృద్ధికి నా ప్రభుత్వం అనేక చర్యలను తీసుకున్నది. తెలంగాణ సుసంపన్నమైన గిరిజన సంస్కృతితో తులతూగుతున్నది. గిరిజన, పర్యావరణ పర్యాటకాన్ని ప్రతిబింబించేలా పర్యాటక అభివృద్ధికి నా ప్రభుత్వం చర్యలను తీసుకున్నది. గిరిజన దేవతలను పూజిస్తూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడమయింది. జాతర సమయంలో తెలంగాణకు చెందిన వివిధ ప్రాంతాలనుండి మరియు దాని చుట్టుప్రక్కల రాషా్టలనుండి ఒక కోటికిపైగా ప్రజలు మేడారాన్ని సందర్శించుకున్నారు.
రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతుల జనాభా అత్యధికంగా వుంది. బలహీన, అణగారిన వర్గాలన్నింటికి సముద్ధరణ,గౌరవాన్ని పెంచేలా నా ప్రభుత్వం పనిచేస్త్నుది. జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, సాంప్రదాయక వృత్తులకు మద్ధతు, నైవాసిక పాఠశాలల ఏర్పాటు, మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్, కళ్యాణలక్ష్మి, రజకులకు, ఇతరులకు ధోబీ ఘాట్ల నిర్మాణానికి అత్యంత వెనుకబడితర తరగతుల కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు వివిధ సంక్షేమ ప్రోత్సాహాకాలు చేరివుంటాయి.
మైనార్టీల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి నా ప్రభుత్వం అనేక క్రియాశీలక చర్యలను చేపట్టింది. ఇందులో నైవాసిక పాఠశాలలు, మెట్రిక్ పూర్వ, అనంతర స్కాలర్‌షిప్పులు, వృత్తిపరమైన కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మైనార్టీలకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్పులు, స్టడీ సర్కిళ్ళ ఏర్పాటు, షాదీముబారక్, ఇమావ్స్‌ు, మోజాన్స్‌కు గౌరవ వేతనం, తెలంగాణ ఇస్లామిక్ సాంస్కృతిక కన్వెన్షన్ సెంటర్, క్రిస్టియన్ భవన్, సిక్కు భవనం చేరివున్నాయి.
ఆసరా ఫించన్లు
నిరుపేదలందరూ గౌరవంగా జీవించేలా చూడాలనే లక్ష్యంతో నా ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈ పథకం బడుగువర్గాల రోజువారీ కనీస అవసరాలను తీర్చడానికి ఎంతో మద్దతునిచ్చి, అత్యంత ఆవశ్యకమైన సామాజిక భద్రతను సమూర్చుతున్నది. ఈ పథకం క్రింద మొత్తం 41.78 లక్షలమంది ప్రజలు లబ్దిపొందుతున్నారు.
ప్రజల రక్షణ, భద్రత
నా ప్రభుత్వం ప్రజల రక్షణ, భద్రతను మెరుగుపర్చేందుకు అత్యంత ప్రాధాన్యత నిచ్చింది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ఆధునీకరించేందుకు అనేక చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణను దృష్టిలో వుంచుకొని ఖాళీలను భర్తీ చేసేందుకు ముమ్మరంగా పోలీసు రిూట్‌మెంటును చేయడం జరుగుతున్నది. ప్రజలకు రక్షణను, భద్రతను కల్పించేందుకు కమాండ్, కంట్రోలు ంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగరంలోని అనేక సమస్యాత్మక ప్రాంతాలలో సుమారు రెండు లక్షల సీసీ మెెరాలను ఏర్పాటు చేయడమయింది. మహిళలపట్ల వేధింపులను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన షీ టీవ్స్‌ు ఘనమైన విజయాన్ని సాధించింది. నా ప్రభుత్వం అగ్నిమాపక ంద్రాలులేని అసెంబ్లీ నియోజకవర్గాలలో 18 నూతన అగ్నిమాపక ంద్రాలను మంజూరు చేసింది.
పర్యాటక అభివృద్ధి
రాష్ట్రం ఏర్పడినప్పటినుండి నా ప్రభుత్వం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు చేపట్టింది. క్రియాశీలక చర్యలతో రాష్ట్రంలో పర్యాటకుల రాకడ గణనీ యంగా పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల కు హైదరాబాదు ంద్రబిందువైంది. ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు, వరల్డ్ ఐటీ కాంగ్రెస్, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంవంటి కార్యక్రమాలను నిర్వహించడంవల్ల తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.
తెలుగు ప్రపంచ మహాసభలు
తెలుగు భాషను, సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు, నా ప్రభుత్వం తెలుగు ప్రపంచ మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఈ విశ్వవ్యాప్త కార్యక్రమం తెలుగు భాష, సాహిత్య వైభవాన్ని చాటింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 8000 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజర య్యారు. నా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన కృషి సామాన్య ప్రజల జీవితాలలో సానుూలమైన, గణనీయమైన ప్రభావాన్ని తీసుకువచ్చిందని తెలియజేస్తూ ముగించా లనుకుంటున్నా ను. నా ప్రభుత్వం బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించేందుకు పూర్తినిబద్ధతతో ముందుకు సాగుతుందని పునరుద్ఘాటిస్తున్నాను.