tsmagazineరాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు ప్రతిష్ఠాత్మకమైన అర్బన్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును అందుకున్నారు. పట్టణాభివృద్ధిలో,మౌలిక వసతుల కల్పనలో స్వచ్ఛతలో ఉత్తమంగా నిలిచిన నగరాలకు, సంస్థలకు, వ్యక్తులకు బిజినెస్‌ వరల్డ్‌ సంస్థ అవార్డులను ప్రకటించింది. అయితే ఇందులో తెలంగాణ రెండు అవార్డులు గెలుచుకుంది. ఢిల్లీలో జరిగిన బీడబ్ల్యూ బిజినెస్‌ వరల్డ్‌ ఐదవ స్మార్ట్‌ సిటీస్‌ కాన్‌క్లేవ్‌ అవార్డుల కార్యక్రమంలో ‘అర్బన్‌ లీడర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి చేతులమీదుగా అవార్డును స్వీకరించారు. పట్టణాభివృద్ధికి మౌలిక వసతులు కల్పిస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు దక్కిన మరో అవార్డును రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ అందుకున్నారు.

అవార్డును అందుకున్న సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పట్టణ మౌలిక వసతుల్లో తెలంగాణ కృషిని గుర్తించి బీడబ్ల్యూ బిజినెస్‌ వారు ‘అర్బన్‌ లీడర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు’ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశానికి అనుగుణంగా ముందుకెళ్లే క్రమంలో ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నా” అని వివరించారు. పట్టణ మౌలిక సదుపాయాల కల్పనల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో బాగా కృషి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో మూడున్నరేండ్ల కిందట విద్యుత్‌ లోటు ఉండేది, పారిశ్రామిక, వ్యవసాయ,గృహావసరాలకు విద్యుత్‌ కొరత బాగా ఉండేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల అతి తక్కువ కాలంలోనే విద్యుత్‌ సమస్యను అధిగమించామని తెలిపారు.

ఇపుడు 2018 జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వగలిగే స్థాయికి ఎదిగామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ విద్యుత్‌రంగంలో ప్రథమస్థానంలో ఉన్నదని, సోలార్‌ ద్వారా 3వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధిస్తున్నామని, మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరిచ్చే రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని మంత్రి కేటీఆర్‌ వివరించారు. అవార్డు అందుకున్న సందర్భంలో మంత్రి కేటీఆర్‌ వెంట ఎంపీలు కవిత, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్‌లు వున్నారు.

అవార్డును అందుకున్న అనంతరం అదేరోజు తెరాస ఎంపీలతో కలిసి పలువురు కేంద్ర మంత్రులతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. పెట్టుబడులకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల విభాగం నిబంధనలను సరళీకృతం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్ల్లీకి కేటీఆర్‌ విజ్ఞప్తిచేశారు. పసుపుబోర్డు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ అంశాలపై కేంద్ర వాణిజ్యమంత్రి సురేశ్‌ ప్రభుతో చర్చించారు.
tsmagazine

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ తెలంగాణకు ఇవ్వాలని కోరారు. విభజన అనంతరం ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ వెళ్లిపోయిందని గుర్తుచేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని ఎంపీ కల్వకుంట్ల కవిత పోరాటం చేస్తున్నారు. ఇదే విషయాన్ని మరోసారి మంత్రి సురేశ్‌ ప్రభుకి తెలియజేశారు. జాతీయ స్థాయిలో కాఫీబోర్డులా పసుపు బోర్డు తెలంగాణ కేంద్రంగా ఏర్పా టు చేయాలని కోరారు. భవిష్యత్తులో దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తామని.. తప్పకుండా రావాలని కేంద్రమంత్రి ఆహ్వానించారు.

నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌, సీఈవో అమితాబ్‌కాంత్‌లతో సమావేశమయ్యారు. ఇటీవల హైదరా బాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు అంశంపై ధన్యవాదాలు తెలియజేశారు. సదస్సులో పేర్కొన్న అంశాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. నీతిఆయోగ్‌ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇస్తామని చెప్పారు. పారిశ్రామిక రంగం విధానాల్లో రావాల్సిన మార్పులపై మాట్లాడారు. జనవరిలో అధికారుల బందం జపాన్‌ పర్యటన నేపథ్యంలో ఆ దేశ రాయబారి హిరా మట్సుతో భేటీ అయ్యారు. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడేలా, పెట్టుబడులు వచ్చేలా పర్యటన జరగాలనే అంశాలపై చర్చించారు.

పురపాలక శాఖకు రెండు స్కోచ్‌ అవార్డులు
సంస్కరణల బాటలో పయనిస్తున్న తెలంగాణ పురపరిపాలన శాఖ రెండు స్కోచ్‌ గోల్డ్‌ అవార్డులను గెలుచుకుంది. భారత ఉపగ్రహ పరిశోధనలలో ప్రభుత్వ సంస్థ నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ భాగస్వామ్యంతో, భారత ప్రభుత్వ ఉపగ్రహం ”భువన్‌”ను ఉపయోగించి, అధునాతన సాంకేతికతతో రాష్ట్రంలో ఉన్న 72 పట్టణాలలో ఉన్న 12 లక్షల భవనాలకు భూఉపరితల ఆధారిత అనుసంధానం (జియో ట్యాగ్గింగ్‌) చేసి ప్రతి ఒక్క భవనాన్ని ఉపగ్రహం ద్వారా గుర్తించబడి, వారి ఆస్తిపన్ను సంఖ్య తో అనుసంధానించారు. దీని ద్వారా ప్రతి ఒక్క భవనం ఉన్న ప్రదేశం, దాని స్థితి, నలుదిక్కుల గల పొరుగున ఉన్న ఆస్తుల, ఖాళీ స్థలాల వివరాల వంటివి తెలుసుకోవచ్చు. పురపాలక సంఘాలలో ఉన్న సిబ్బంది సహాయంతో ప్రతి భవనం ఫొటోను, ఆస్తి పన్నుతో అనుసంధానం చేయడం వల్ల ప్రపంచంలో ఎక్కడి నుండైనా ప్రజలు భువన్‌ వెబ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా చూడడానికి వీలు కలిపించారు. అలాగే ఈ వివరాలను రిజిస్ట్రేషన్‌ శాఖ సహకారంతో అనుసంధా నించడం ద్వారా ఆ భవనపు పూర్వ పేరు మార్పిడిలు, అమ్మకాలులాంటి ఇతర వివరాలు (జుఅషబఎపతీaఅషవ సవ్‌aఱశ్రీర) కూడా అందుబాటులో ఉంచారు. అలాగే ఆ భవనం పైన ఏవైనా వివాదాలు, నిషేధాలు వంటివి ఉన్నా ఆ వివరాలు పౌరులు తెలుసుకోవచ్చు. దీని ద్వారా పారదర్శకత, సమాచార లభ్యత వంటివి సాధించగలిగామని పురపరిపాలన శాఖ సంచాలకులు డాక్టర్‌ టీ కె శ్రీదేవి తెలిపారు. ఇటువంటి ప్రక్రియ దేశంలోనే మొదటి సారిగా మన రాష్ట్రంలో చేయడం విశేషం. దీని ద్వారా మన రాష్ట్ర సులభ వ్యాపార విధానం (జుaరవ శీట ణశీఱఅస్త్ర పబరఱఅవరర)లో మెరుగైన ర్యాంకు సాధించడానికి కూడా దోహద పడుతుంది. ఈ విధానం ద్వారా పారదర్శకతనే కాకుండా అనుమతిలేకుండా నిర్మిస్తున్న కొత్త భవనాలను గుర్తించ గలుగుతున్నారు. అలాగే ఆస్తి పన్ను సంఖ్యా లేని భవనాలు 20 వేల పైచిలుకు ఇప్పటికే గుర్తించి వాటికి ఆస్తి పన్ను పరిధిలోకి తెచ్చే ప్రక్రియ ప్రారంభం అయింది. దీని ద్వారా ఆస్తి పన్ను విలువ పెంచకుండానే పట్టణాల రాబడి పెరిగే వీలు కలుగుతుంది. అలాగే రికార్డులలో ఉన్న వివరాలు, ఉపగ్రహం ద్వారా లభించిన వివరాలను పోల్చి రికార్డు లకు భిన్నంగా ఉన్న ఆస్తుల పన్నులను సవరించి ఆదాయం పెంచే ప్రక్రియను కూడా ప్రారంభించారు. దీని ద్వారా ఆదాయం పెరగడంతోపాటు పారదర్శకత పెంచడం వంటి సంస్కరణలను పురపరిపాలన శాఖ తీసుకువచ్చింది. దీనిని గుర్తించిన స్కోచ్‌ సంస్థ అవార్డును అందించింది.

అలాగే నూతన మొబైల్‌ టెక్నాలజీ భూపరితల ఆధారిత సాంకేతిక వ్యవస్థను (+వశీస్త్రతీaజూష్ట్రఱషaశ్రీ ఱఅటశీతీఎa్‌ఱశీఅరవర్‌వఎ)ఉపయోగించి ప్రయోగాత్మకంగా నల్గొండ పట్టణంలో చేపట్టిన అధునాత సర్వే ద్వారా ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను రాబడి విలువ పెంచకుండానే రెట్టింపు అయింది. అలాగే పన్ను పరిధిలో లేని కుళాయిల వివరాలు గుర్తించబడినాయి. భవన యజమానుల వివరాలు వారి ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేయడం ద్వారా రికార్డ్‌ ప్రక్షాళన వంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈ సర్వే విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం తీసుకురావడానికి కసరత్తు ప్రారంభం అయింది. ఈ విధానానికి ఒక అవార్డును మొత్తం రెండు స్కొచ్‌ పురస్కారాలు అందించింది.

Other Updates