పదవాక్య ప్రమాణజ్ఞులు, సర్వతంత్ర స్వతంత్రులు, ద్వైతాద్వైత విశిష్టాద్వైత తత్త్వవిదులు, న్యాయశాస్త్ర కోవిదులు, బహుభాషా వేత్తలు, చిత్రకళా ప్రవీణులు, మల్లవిద్యా విశారదులు అయిన గుండేరావు హర్కారే గారు హైదరాబాద్‌లోని చందూలాల్ బేలాలో 13 మార్చి 1887లో జన్మించారు. సీతాబాయి, రామారావు గారు వీరి తల్లిదండ్రులు. ఆరు నెల్లు నిండక పూర్వమే వీరి తల్లి మరణించింది. వీరి పూర్వులు హర్కారే అనే పేరుగల విశ్వసనీయులైన ఉద్యోగుల ద్వారా దక్షిణ భారతంలో గల జిల్లాలు పరగణాల నుండి వార్తలు సేకరించి, వాటిని ఫార్సీ భాషలో రాసి ఒంటెలపై ఢల్లీి పాదుషాలకు పంపేవారు. ఆ కారణంగానే వీరికి హర్కారే అనే పేరు వచ్చింది.
అప్పటి పరిస్థితులననుసరించి గుండేరావు గారికి మొదట ఫారసీ, అరబీ భాషలలో విద్యాభ్యాసం జరిగింది. హర్కారే గారి తండ్రి రామారావు గారు ఫారసీలో గొప్ప విదాష్ట్రటంసులు. తమ కుమారునికి అక్షరా భ్యాసం చేయించడానికి సంప్రదాయా నుసారం పూజాదులు నిర్వర్తించే కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో వారి మిత్రులైనా ఒక మౌల్వీగారు వచ్చి, గుండేరావు గారిని లాగుకొని తన తొడపై కూర్చుండబెట్టుకొని, తానే అక్షరాభ్యాసం చేస్తానని చెప్పి ఫారసీ అక్షరాలను దిద్దించి నాడట! ఆ కాలంలో నిజాం రాజ్యంలో ఫారసీయే రాజభాషగా ఉండేది. తర్వాత ఉర్దూ రాజభాష అయింది. ఇంట్లో అందరూ మరాఠీ, తెలుగు, కన్నడ భాషలు మాట్లాడేవారు. తెలుగు దేశ భాష, ఇంట్లో మరాఠీ మాట్లాడేవారు. మధ్వలైనందున కన్నడం కూడా వచ్చేది.
1899 లో హర్కారేగారు ఆంగ్ల
పాఠశాలలో చేరారు. 1906 లో మెట్రిక్యులేషన్ పరీక్ష రాశారు. అదే సమయంలో తండ్రి రామారావు గారు ఉన్నత న్యాయస్థానం నుండి ఉద్యోగ విరమణ కావించి నారు. ఆ కారణంగా ముందు చదువు కొనసాగించక నగర న్యాయస్థానంలో ఉద్యోగిగా చేరినారు. 1908 లో పదవీ ఔన్నత్యం పొంది స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టుకు మారినారు. అప్పటికి ఉర్దూ, తెలుగు, మరాఠీ, కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించడం వల్ల స్పెషల్ క్రిమినల్ కోర్టులో అనువాదకులుగా నియుక్తులైన హర్కారే గారు నిజాం రాజ్యమంతా విశేషంగా పర్యటించి నారు. నిజాం రాజ్యం ఆ కాలంలో త్రిభాషా రాష్ట్రం 1914 లో గుండేరావు గారు ఉన్నత న్యాయస్థానానికి మార్చబడినారు. న్యాయ శాస్త్రం, రెవెన్యూ, అకౌంటెన్సీ ` ఈ మూడు శాఖలలో ప్రభుత్వం నిర్వహించే ఉన్నత పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణులైనారు. మరొక వైపు పంజాబీ విశ్వవిద్యాలయం ఫార్సీ, అరబీ భాషలలో నిర్వహించే మౌల్వీఆలం, మౌల్వీ ఫజల్ వంటి పరీక్షలలో నెగ్గినారు.
నిజాం ప్రభుత్వం అపుడు, ఇంగ్లండ్‌లో బారెట్‌లా పూర్తి చేసుకొని, న్యాయశాస్త్రంలో సుశిక్షితులై, ఫారసీ, ఉర్దూ భాషలలో నిష్ణాతులైన ఒక న్యాయ శాస్త్ర కోవిదుణ్ణి ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది వారు లక్నో వాసులు. పదవిలో చేరగనే తమకు యోగ్యుడైన పి.ఏ.ను నియమించుకొనే ఉద్దేశంతో అక్కడి ఉద్యోగులకు స్వయంగా ఇంటర్వ్యూ నిర్వ హించే కొరకు పూనుకొన్నారు న్యాయమూర్తి గారు. లోపలికి పిలిచిన ఉద్యోగి నెవ్వరినైనా మూడు, నాలుగు నిమిషాలలోపుగనే వెనుకకు పంపుతున్నారు.
ఇంతలో గుండే రావు గారి వంతు వచ్చింది. లోనికి వెళ్ళిన హర్కారే గారు ఇరువై
నిమిషాలు గడిచినా వెలికి రాలేదు. అరగంట దాటింది. ఏమి ఇంకా రాడు, గుండేరావును దయ్యం మింగిందా ఏమిటని హేళనగా తక్కిన ఉద్యోగులు బయట గుసగుసలాడుకొంటు న్నారు! న్యాయ శాస్త్రంలోను, హిందూ, ముస్లిం ధర్మశాస్త్రం లోను, ఫారసీ, అరబ్బీ, ఉర్దూ మున్నగు భాషల్లోను హర్కారే గారికి గల వైదుష్యం ప్రధాన న్యాయమూర్తిగారికి అవగతమైంది. పి.ఎ. నియామక పత్రాన్ని చేతికిచ్చి సాదరంగా హర్కారే గారిని వెనుకకు పంపినారు న్యాయ మూర్తిగారు. తోటి ఉద్యోగులకు గుండేరావు గారి యోగ్యత యేమిటో అర్థమై ఆశ్చర్య చకితులైనారు! జడ్జిమెంట్ రైటర్‌గా కూడా ప్రధాన న్యాయమూర్తిగారి దగ్గర వ్యవహరించి నారు. హర్కారే గారు.
వ్యవహార శాస్త్రాలవిషయం ఈ విధంగా ఉంటే హర్కారే గారి సంస్క ృతాధ్యయనం కథ దీనికి భిన్నంగా సాగింది. రఘు వంశాది కావ్యాలు చదువుకొని వ్యాకరణ శాస్త్రం చదు వుకొనే ఉద్దేశంతో శాలిబండ వాసు లైన మాణిక్యశాస్త్రి గారనే వ్యాకరణ శాస్త్రవేత్త వద్దకు వెళ్ళినారు. లఘు సిద్ధాంత కౌముది పాఠం మొదలైంది. మూడు రోజులు గడిచిన తర్వాత నాలుగవ నాడు గురువుగారు శిష్యుణ్ణి పాఠం అప్పజెప్పమన్నారు. శిష్యుని నుండి ప్రత్యుత్తరం రాలేదు. నీవు అపసవ్య విద్యలు చదువుకొన్నావు కనుక నీకు సం స్క ృత విద్య రాదు పొమ్మన్నారు గురువు గారు. శాస్త్రిగారు చెప్పే పద్ధతి హర్కారే గారికి అవగతం కాలేదు. గురువు కడకు వెళ్ళడం మాని, ఆంగ్లం ద్వారా సంస్క ృతాన్ని బోధించే భాండార్కర్ దీశీశీస I డ II తెచ్చుకొని స్వయంగా సంస్కృతాభ్యాసం ప్రారంభించి నారు.
హర్కారే గారి ఇంట్లో వెంకప్పాచార్యులనే గొప్ప తర్కశాస్త్రవేత్త ఉండేవారు. వారిని కలిసేకొరకు ఎందరో పండితులు వస్తుండే వారు. అట్లా వచ్చిన ఒక విద్వాంసుడు ఒక మూలకు వ్యాకరణ శాస్త్రాన్ని చదువుకొంటూ కూర్చున్న గుండేరావు గారిని దగ్గరికి పిలిచి, పరీక్షించి, ‘టుప్, టాప్, అంటూ వ్యాకరణం ఏం చదువుతావు. నీవు చాలా చురుకైన వాడివి. తర్క శాస్త్రం చెపుతా, చదువుకో ` అన్నారు. న్యాయ సిద్దాంత ముక్తావళి చెప్పడం ప్రారం భించినారు గురువు గారు. తర్కం బాగా అవగతమైంది హర్కారే గారికి. గురుముఖతః పంచవాదాలు అధ్యయనం చేసినారు. మరొక
వైపు తెలుగులో విజ్ఞాన చంద్రికా పరిషత్పరీక్షలో ఉత్తీర్ణలైనారు. వసుచరిత్ర ప్రబంధమండలి శ్లేషచమత్కారాన్ని వివరిస్తూ మరాఠీ భాషలోకి రెండు ఆశ్వాసాలను అనువదించారు.
ఒకనాటి రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటి పాటక్ తలుపులు ధన ధన మ్రోగినవి. చెవులు చిల్లులు పడే ఆ చప్పుడుకు దిగ్గున మేల్కొని హర్కారే గారు ముందుకు నడుస్తుండినారు. ఇంతలో ‘చోర్ ఆయా హై దర్వాజా ఖోలో’ అన్న వాక్యం వినిపించింది. దిగులుగా వచ్చి తలుపులు తెరిచే సరికి ఇద్దరు అశ్వికులతో బాటు వచ్చిన రాజబహద్దర్ కోత్వాల్ వెంకటరామారెడ్డిగారు గుర్రం దిగి మాట్లాడక తన చేతిలో వున్న కాగితాన్ని హర్కారే గారి చేతికి అందించినారు. వెలుతురుకు వచ్చి చూస్తే, గద్వాలలో మున్సిఫ్ మెజిస్ట్రేట్‌గా నియుక్తులైనట్లు ప్రధాన న్యాయమూర్తి నుండి లేఖ! హర్కారేగారు గద్వాలకు వెళ్ళుటకు వెనుక ముందాడుతుండగా, అక్కడి పరిస్థితులను చక్కదిద్దుటకు విూ వంటి సమర్థులు వెళ్ళక తప్పదన్నారు పోలీస్ కవిూషనర్ గారు.
(సంస్థానాలలో అలజడులు ఏర్పడితే, వాటిని నెపంతో నిజాం నవాబు ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకొనే ప్రమాదం ఉండేది. అందుకై గద్వాలసంస్థాన హితైషిగా కోత్వాల్ వెంకట రామారెడ్డి గారు అస్తవ్యస్త స్థితిని సరిదిద్దే సమర్ధుడైన వ్యక్తి యని అచట న్యాయాధీశునిగా హర్కారే గారిని నియమించి నారు. హర్కారే గారు స్పెషల్ క్రిమినల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఉన్నప్పుడు వెంకట రామారెడ్డి గారు వేరే జిల్లాలలో అవిూన్‌గా వుండి ఈ కోర్టుకు కేసులు తెచ్చేవారు. అక్కడ వీరిద్దరికి స్నేహం.
గద్వాలలో న్యాయమూర్తిగా చేరి గుండేరావు గారు క్రమంగా సెషన్స్ జడ్జ్‌గా, కలక్టర్‌గా పదవులు చేపట్టి 1919 నుండి 1948 వరకు 30 సంవత్సరాల కాలం అచట ఉన్నారు. సాయంకాలం వరకు న్యాయ
మూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, తక్కిన సమయంలో న్యాయ, వైశేషిక, వ్యాకరణ, విూమాంసాది సర్వ శాస్త్రాలను అధ్యయనం చేస్తూ, న్యాయ, సాహిత్యాది శాస్త్రాలలో శిరోమణి పరీక్షయందును, విూ మాంసా శాస్త్రంలో పి.ఓ.ఎల్ పరీక్ష యందును మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఉత్తీర్ణులైనారు. న్యాయ శాస్త్రానికి విశ్వవిఖ్యాత కేంద్రమైన నవద్వీపము నుండి వాచస్పతి పట్టము సాధించినారు. అయోధ్య, బెల్గాం పండిత సభలు ‘విద్యాభూషణ’ బిరుదును ఇచ్చి గౌరవించినవి. గోల్డ్ స్మిత్ మహకవి రచించిన ‘ట్రావెలర్’ సంస్కృత పద్యానువాదానికి మైసూరు ప్రభుత్వము స్వర్ణ పతకము ప్రధానం చేసింది. మైసూరు విద్వత్పరీక్షకు సాహిత్య పరీక్షకులుగా, పూనా తిలక్ విద్యా పీఠమున విూమాంసా పరీక్షకులుగా వ్యవహరించిరి. వైదుష్యంలోనే కాక వ్యాసంగంలో కూడా హర్కారే గారిలో అపారమైన వైవిధ్యం గోచరిస్తుంది.
శ్రీ విజ్ఞానేశ్వరుని మితాక్షరా హిందూ ధర్మశాస్త్రాన్ని ఉర్దూ భాషలోకి అనువ దించుటతో బాటు అందులో వారు కొన్ని కొత్త అరబిక్ పారిభాషిక పదాలను కూడా సృష్టించినారు.
శ్రీ గోల్డ్ స్మిత్ మహాకవి ట్రావెలర్ (ప్రవాసి), డిసర్టెడ్ విలేజ్ , వర్డ్స్ వర్త్ మహాకవికృతి ఏన్ ఓడ్ టు ఇమ్మోర్టాలిటి, ధామస్ గ్రే వ్రాసిన ఎలిజి (చైత్య విలాపము) ఆంగ్ల కావ్యాలకు సంస్కృత పద్యాను వాదము కావించినారు.
శ్రీ షేక్స్ పియర్ హామ్‌లెట్‌ను, మిడ్ సమ్మర్ నైట్స్
డ్రీమ్‌ను సంస్కతీకరించినారు.
శ్రీ ఖురానే షరీఫ్ యొక్క 5 భాగాలు సంస్కృత పద్యానువాదము ఇస్లామిక్ కల్చర్‌లో ముద్రింపబడినది.
శ్రీ ఫార్సీలోని మస్నివీ షరీఫ్‌ను కొంత భాగము సంస్కృతీకరించినారు. యాస్కుని నిరుక్తము తెలుగు అనువాదము కొంత గోలకొండ పత్రికలో ముద్రింపబడినది.
శ్రీ చూపు మందగించాక కూడా, వ్రాయస గాని సహాయంతో పింగళి సూరన్న గారి ప్రభావతీ ప్రద్యుమ్న ప్రబంధాన్ని సంస్క ృతంలో అనువదించినారు. వీరి సంస్కృత ప్రత్యయ కోశమును ఉస్మానియా వి.వి. సంస్కృత శాఖ ముద్రించినది.
శ్రీ వీరి ‘మరాఠీ సాహిత్య చరిత్ర’ను ఆం.ప్ర. సాహిత్య అకాడమి ప్రచురించింది. 1950 నుండి ఆకాశవాణి ద్వారా ప్రసారమైన వీరి ప్రసంగ వ్యాసాలు సంస్క ృతం, తెలుగు, హిందీ, కన్నడం, భాషలకు చెందినవి 1000 పుటలను మించుచున్నవి. హర్కారే గారు అఖిలభారత ప్రాచ్య విద్వన్మహాసభలలో పాల్గొని అందు అమూల్యమైన వ్యాసాలు చదివేవారు. అందుకొన్ని వారి నివేదికలలో ప్రచురింప బడినవి.
హోం
»