waterమనిషికి జీవశక్తినిచ్చేది నీళ్ళే. రాష్ట్రంలో జీవ నదులు ప్రవహిస్తున్నా గుక్కెడు నీళ్ళకోసం రాష్ట్ర ప్రజలు అల్లాడిపోవలసిన పరిస్థితి. తాగునీటికోసం మహిళలు కడవలు పట్టుకొని మైళ్ళదూరం నడచి వెళ్ళవలసి వస్తోంది.

రక్షిత మంచినీటికి నోచుకోలేక ఆదిలాబాద్‌ జిల్లాలో గోండులు రోగాలపాలై, ప్రాణాలు కోల్పోవలసిన దుస్థితి. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ వల్ల ప్రజలు బొక్కలలో మూలుగు చచ్చిపోయి కాళ్ళు, చేతులు వంకరలు తిరిగి నరకయాతన అనుభవిస్తున్నారు.

ఈ దుస్థితి నుండి ప్రజలకు విముక్తి కల్గించేందుకు, ఇంటింటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందించేందుకు ప్రభుత్వం ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకాన్ని రూపొందించింది.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రిడ్‌ల ఏర్పాటుకు దాదాపు 25వేల కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా. ఈ పథకం
పూర్తయ్యేసరికి ఏ ఆడబిడ్డా మంచినీటి కోసం బిందె పట్టుకొని వీధులవెంట తిరిగే పరిస్థితి ఉండరాదన్నది ప్రభుత్వ సంకల్పం.

ఈ వాటర్‌గ్రిడ్‌ పనులకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు కేటాయించారు.

Other Updates