నల్గొండ జిల్లా చౌటుప్పల్ వద్ద నిర్మించిన వాటర్ గ్రిడ్ పైలాన్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు జూన్ 8న ఆవిష్కరించారు.
తెంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాు, 26 గ్రిడ్లకు, సంస్కృతికి అద్దంపట్టేలా 66 అడుగు ఎత్తులో ఈ పైలాన్‌ను నిర్మించారు. పైభాగంలో కశం, దిగువన చుట్టూ బతుకమ్మతో వినూత్నంగా నిర్మించిన ఈ పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించి, గ్రిడ్‌లోని ఫౌంటెన్లలోకి నీటిని విడుద చేశారు. ముఖ్యమంత్రికి తొుత వేదపండితు పూర్ణ కుంభంతో స్వాగతం పుకగా, మహిళు బతుకమ్మతో స్వాగతం పలికారు. హారతు పట్టి నుదుట తికం దిద్దారు. వివిధ మత పెద్దు సర్వమత ప్రార్ధను నిర్వహించారు. రాష్ట్రంలోని 25,139 గ్రామాు, 59 పురపాక సంఘాు, 5 నగర పాక సంస్థ పరిధిలోని ప్రజందరికీ ప్రతిరోజూ తాగునీరందించేందుకు ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని రూపొందించారు.ఈ పధకానికి 35 వే కోట్ల రూపాయు వ్యయం కాగవని అంచనా. ఎన్ని అవాంతరాు ఎదురైనా ఈ పధకాన్ని పూర్తిచేసి తీరాని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పను ప్రారంభించింది.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, ఐ.టి శాఖ మంత్రి కె.టి. రామారావు, జి.జగదీశ్ రెడ్డి, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, ఇతర ప్రజాప్రతినిధు పాల్గ్గొన్నారు.
యాదాద్రి విద్యుత్ కేంద్రానికి భూమిపూజ
నల్గొండ జిల్లా దామరచర్ల మండం వీర్లపాలెం వద్ద తెంగాణ జెన్ కో ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనా సామర్థ్యంతో నిర్మించనున్న థర్మల్ విద్యుత్ కేంద్రానికి జూన్ 8న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టుకు యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రంగా నామకరణం చేశారు. భూమిపూజ అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పైలాన్ ను సి.ఎం ఆవిష్కరించారు.
5,558 ఎకరా విస్తీర్ణంలో 55 వే కోట్ల రూపాయ వ్యయంతో ఈ విద్యుత్ కేంద్రాన్ని దశవారీగా నిర్మిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖా మంత్రి జి. జగదీశ్ రెడ్డి, టి.జెన్‌కో సి.ఎం.డి ప్రభాకర రావు, ఇతర ప్రజాప్రతినిధు పాల్గొన్నారు.