వాడవాడలా వేడుకగా  బోనాలఆషాడమాస ఆరంభంతో మొదయిన బోనాల సంబరాలు వంతుల వారీగా వివిధ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గోల్కొండ కోట సాక్షిగా మొదలైన బోనాలు ఆగస్ట్‌ 2న జరిగిన ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకతో మరింత ఊపందుకున్నాయి.

లష్కర్‌లో బోనాలంటే మహంకాళీ మాత కోసం అంగరంగ వైభవంగా జనాలందరూ చేసే హడావిడి ధూంధామే. ఉజ్జయిని కాళికను శాంత పరిచేందుకు సూచికగా బోనాలను సమర్పిస్తారు నగరవాసులు. మమ్ములను మంచిగ సూడు తల్లి అని వేడుకునే కార్యక్రమ సంబరాన్ని అంబరాన్నంటే తీరులో నిర్వహిస్తారు నిర్వాహకులు. ఘనంగా ప్రారంభమైన ఈ సంబరాలకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ సతీసమేతంగా వచ్చి ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి స్వాగతం పలుకగా ముఖ్యమంత్రి దంపతులు అమ్మవారికి పట్టు వస్తాలను సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఎంపీ కె. కేశవరావు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్‌ పాల్గొన్నారు. తెల్లవారు జాముననే తొలిబోనం తీసుకెళ్ళిన మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు. బోనాలను ఊరేగింపుతో తోడుకొని వచ్చిన డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ కవిత భక్తి పూర్వకంగా వాటిని అమ్మవారికి సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, మంత్రి పద్మారావు ఇంటికి వెళ్ళి బోనాల దావత్‌లో పాల్గొన్నారు. కెసిఆర్‌తో పాటు శాసనసభాపతి మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు తలసాని, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి ఉపసభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి, ఎంపీ కవితతో పాటు ఇతరులు పాల్గొన్నారు.

వాడవాడలా వేడుకగా  బోనాల2ఉజ్జయిని కాళీమాతకు పూజలు నిర్వహించడానికి హాజరయిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. మన పూర్వీకు నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తున్న బోనాల ఉత్సవాలను పదిలపర్చుకోవాలని అన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల ఉత్సవాలాను ప్రపంచస్థాయికి తీసుకెళ్ళవలసిన అవసరం వుందని అన్నారు. లష్కర్‌ బోనాల సంరంభం ముగింపు రోజయిన ఆగస్ట్‌ 3న అంబారీ, ఫలహార, తొట్టె ఊరేగింపు అట్టహాసంగా జరిగాయి. వీటికి ముందు సాకసమర్పణ, భవిష్యవాణి, బలి, పోతరాజు విన్యాసాలు అందరినీ భక్తి పారవశ్యంలో మునిగిపోయేలా చేశాయి.

ఇక ఆషాడమాస నాలుగో ఆదివారమయిన ఆగస్ట్‌ 9న బోనాల ఉత్సవాలు జరిగే 20 ఆలయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షల రూపాయలు కేటాయించింది. పాతబస్తీ బోనాలంటే అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం, లాల్‌ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయాలు ప్రసిద్ధి.

వాడవాడలా వేడుకగా  బోనాల3ఇక్కడి బోనాల ఉత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సింహవాహిని అమ్మవారికి రాష్ట్ర హోంశాఖామాత్యులు నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించి పూజలు నిర్వహించారు. అక్కన్న, మాదన్న దేవాయంలో మహంకాళి అమ్మవారికి రాష్ట్ర వాణిజ్య శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పట్టు వస్త్రాలను సమర్పించారు. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ కవిత ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన పండుగను మన సొంత రాష్ట్రంలో సగౌరవంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ ఉత్సవాలలో పాలుపంచుకోవడానికి కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ సతీసమేతంగా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. బోనాల పండుగను వాడవాడలా వైభవంగా అధికారికంగా జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధును కేటాయించింది. దీంతో అన్ని దేవాయాలను విద్యుత్‌ కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సాంస్కృతిక శాఖ కళాకారులతో పలు ప్రదర్శనలు నిర్వహించారు. సోమవారం (ఆగస్ట్‌ 10) పాతపట్టణమంతా భక్తి పారవశ్య ఉత్సాహాలతో ఊగి పోయింది. శాలిబండ అక్కన్న -మాదన్న దేవాలయం నుంచి పలురకాల కళా ప్రదర్శనలతో ఊరేగింపుగా బయలుదేరి, లాల్‌ దర్వాజా ఉజ్జయిని అమ్మవారి ఘటాలతో కలుపుకొని ముందుకు కదిలారు. శివసత్తు సిగాలు, పోతరాజు పద విన్యాసాతో పురవీధున్నీ జనసంద్రంగా సాగిపోయాయి. మొత్తం 9 ఆదివారాల వరకు సాగే ఈ బోనాల వేడుకలు శ్రావణ మాసాంతం వరకు కొనసాగుతాయి.

Other Updates