naveen-mithalతెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ‘బంగారు తెలంగాణ’ లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు అమలుచేస్తోంది. ఈ కార్యక్రమాల ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ప్రభుత్వ కార్యకలాపాలను, వివిధ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించడంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ పాత్ర ఎంతో కీలకమైనది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఈ శాఖ వ్యవహరిస్తుంది.

మీడియా కూడా ఇందులో భాగస్వామిగా నిలవాలి. కేవలం రాజకీయ వార్తలకే ప్రాధాన్యం ఇవ్వకుండా అభివ ద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలితాలను, ప్రయోజనాలను ప్రజలకు తెలియజెప్పాలి. పథకాల అమలు తీరుతెన్నులను బేరీజువేయాలి. విజయగాథలను వెలుగులోకి తేవాలి. దీనివల్ల ప్రజాబాహుళ్యానికి ఎంతో ప్రయోజనం చేకూర్చిన వారవుతారు.

సమాచార, పౌర సంబంధాల శాఖ అంటే కేవలం అడ్వటైజ్‌ మెంట్ల శాఖగా మారకూడదు. ప్రభుత్వం చేపడుతున్న మంచి మంచి పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు నిరంతరం క షి చేయాలి. ఆయా పథకాలు, కార్యక్రమాల పట్ల ప్రజల స్పందనను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలి. పథకాల రూపకల్పనలో, అమలులో ప్రభుత్వానికి బాసటగా నిలవాలి. ఇంతటి బహత్తర బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వహించేందుకు సమాచార, పౌరసంబంధాల శాఖను పరిపుష్టం చేసే పనిలో ఇప్పుడు నిమగ్నమై వున్నాం.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమాచార శాఖ సిబ్బంది కర్తవ్యదీక్షతో ముందుకు సాగాలి. ఇందుకు ప్రజలు, పాత్రికేయులు, ఇతర శాఖల సహకారం, సమన్వయం కూడా ఎంతో అవసరం.

– నవీన్‌ మిత్తల్‌, ఐఎఎస్‌

కమీషనర్‌ & పబ్లిషర్‌

Other Updates