వారసత్వ-నగరంగా-ఓరుగల్లు2భారతదేశ పర్యాటక ముఖచిత్రంలో ఓరుగల్లు చారిత్రక వారసత్వం ప్రముఖ స్థానం వహించనుంది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నేతృత్వంలో దేశంలో చేపట్టబోతున్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలో మన వరంగల్‌కు చోటు దక్కింది. ఈ ప్రణాళికలో రాష్ట్రంనుండి వరంగల్‌ నగరానికి మాత్రమే చోటు లభించింది.
వారసత్వ నగరంగా ఓరుగల్లు

వారసత్వ నగరంగా ఓరుగల్లు

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ‘నేషనల్‌ హెరిటేజ్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ అగుమెంటేషన్‌ యోజన (హృదయ్‌) ఒకటి. ఇందులో తొలుత దేశంలోని అమృత్‌సర్‌, అజ్మీర్‌, గయ, కాంచీపురం, మధుర, వారణాసి, వెల్లాంకినిలకు ఈ ప్రాజెక్టు పరిధిలోకి తెచ్చారు. కానీ, అనేక ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజ్ఞప్తులు రావడంతో, వాటిని పరిశీలించి, వడపోత నిర్వహించి మరో ఐదు చారిత్రక ప్రాంతాలైన వరంగల్‌, అమరావతి, బాదామి, పూరి, ద్వారకలకు ఈ ప్రాజెక్టులో చోటు కల్పించారు.
మూడేండ్ల కాలంలో ఈ ప్రాంతాలను సుందరీకరించడం, శుభ్రత, అక్కడికి చేరుకొనే రవాణా సౌకర్యాల కల్పన, సీసీ కెమెరాలు ఏర్పాటు, వైఫై సౌకర్యం కల్పించడంవంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఇందుకుగాను 2014`15 ఆర్థిక సంవత్సరంలో 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో మన వరంగల్‌కి స్థానం లభించడంతో పర్యాటకంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధికి నోచుకోగలదని హర్షం వ్యక్తమవుతోంది.

Other Updates