vikasamడాక్టర్‌ సి.వీరేందర్‌

రమేశ్‌ గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. గత 6 నెలలుగా చాలా సీరియస్‌గా రూమ్‌లో వుంటూ చదువుకోవడానికి ప్రతి రోజు లైబ్రరికి వెళ్ళి సాయంత్రం వరకు చదువుకుని వచ్చేవాడు. ఇలా చాలా బాగా సమయపాలన, నోట్స్‌ ప్రిపరేషన్‌, ప్రశ్న పత్రాలను సాల్వ్‌ చేసి కీ తో సరి చూసుకుని తక్కువ మార్కులు వస్తే వెంటనే మళ్ళీ చదివి 80-90 శాతం కరెక్ట్‌గా వచ్చేంత వరకు సాధన చేసేవాడు. కాని గత రెండు నెలల నుండి చాలా డిస్టర్బ్‌ అయిపోయాడు. ప్రశ్నాపత్రాలను చదివి మళ్ళీ మళ్ళీ సాధన చెయ్యలేకపోతున్నాడు. ప్రతి గంటకు ఎవరితోనో బయకు వెళ్ళడం ‘టీ’ తాగిరావడం చేస్తున్నాడు. తన తోటి స్నేహితులను డిస్టర్బ్‌ చేస్తున్నాడు. ఎందుకు ఇలా!

ప్రతి రోజు చదువు గురించి మాట్లాడటం, ఎంత మంది కాంపిటీటివ్‌ పరీక్షల్లో విజయం సాధించారు? ఎలా! సాధించారు, రోజుకు ఎన్ని గంటలు చదివారు, ఏ పుస్తకాలు చదివారు. ఎన్ని సార్లు పరీక్ష రాస్తే సక్సెస్‌ అయ్యారు. వీటిగురించే మాట్లాడటం తోటి మిత్రులతో చర్చిండం… ప్రతి రోజు కొత్త వాళ్ళతో ఈ విషయాలన్ని చర్చించడం… ఏదో కారణంతో ఆ రోజు తాను చదవాల్సిన అంశాలను అనుకోవడం కాని చదవకపోవడం. రేపు చదువుతాను అనుకోవడం మళ్ళీ వాయిదా వేయడం, స్నేహితుల కోసం వెతకడం, ప్రతిరోజు ఇలానే చేస్తుండటంతో ఏకాగ్రత లోపించింది. అశాంతితో ఉండడం రోజంతా చదవాలని అనుకున్న రెండు గంటలకు మించి చదవలేని స్థితి… ప్రతి రెండు మూడు రోజులకు స్నేహితులకు ఎదో ఒకపని వుండడం, వాళ్ళతో కలిసి ఆ పనిని పూర్తిచేయడం దాంతో ఆ రోజు గడిచిపోవడం… మళ్ళీ మరో రోజుగాని చదువును మొదలుపెట్టలేకపోవటం జరగుతుంది. స్నేహితులతో నేను రాను అని చెప్పలేని స్థితి. ఉండి చదవలేని స్థితి… ఎలా! ఈ పరిస్థితి నుండి బయటకురావడం…

ఈ స్థితిని చాలా మంది విద్యార్థులు అనుభవిస్తుంటారు. స్నేహితులు మనకు బలం అలాగే బలహీనత కూడా. ఎలా! వారిని మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా… మనతో సంబంధం చెడకుండా మన చదువు చెడిపోకుండా ఉండాలంటే ఎలాంటి పద్ధతి ఉప యోగించాలో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు. లోలోన బాధ పడుతూంటారు. చదువుకునేటప్పుడు, అందులో పోటీ పరీక్ష కోసం శ్రమించే వాళ్ళు తప్పకుండా స్నేహితులతో ఎలా ఉండాలి, ఎంత సమయం వారితో గడపాలి. మనకు చదువుకోవాల్సిన సందర్భం వున్నప్పుడు ఎలా వుండాలో తెలుసుకోవాలి.

స్నేహితులలో రకాలు :

1. Funny Friends
2. Shopping Friends
3. Motivating Friends
4. Lazy Friends
5. Old Friends
6. Friends from other places
7. Tedious Friends
8. Crazy Friends

1Funny Friends
ఈ స్నేహితుడు వచ్చాడంటే చాలు వాతావరణం నవ్వులతో నిండిపోతుంది. ప్రతి సంఘటన నుండి నవ్వులు పూయించగలరు. ఎంత విచారంలో ఉన్నా సరే మనల్ని నవ్వించగలుగుతారు. మనకు ఎంతో స్వాంతనగా ఉంటుంది. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత సేపయిన సరే ఎలా! నవ్వించగలుగుతాడు. ఇన్ని జోక్స్‌ ఎలా! గుర్తుంచుకుంటాడు. ఎవ్వరి మీదనైన జోక్‌ వెయ్యగలుగుతాడు. తన మీద కూడా జోక్స్‌ వేసుకోగలుగుతాడు. ఇలాంటి మిత్రులు సమయానికి అందుబాటులో ఉంచుకోవడం అవసరం. కనీసం రోజులో సాయంత్రం 7 గంటల తర్వాత ఇలాంటి మిత్రులతో కలిసి వుండడం వల్ల ఎవ్వరైనా రీచార్జ్‌ అయ్యి చదువును కొనసాగించగలుగుతారు.

2.Shopping Friends

ఎప్పుడూ వారు ఎదైనా కొనక్కోవల్సి రావడం ఎవరినో ఒకరిని కంపెనీ కోసం తీసుకెళ్లడం, వీరి వల్ల ఏ ఏ షాప్‌లు ఎక్కడున్నాయో తెలుస్తుంది. అయినప్పటికీ చదువుకునే సమయంలో వీరికి సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉండకుండా ఉండటమే మేలు.

3.Motivating Friends
ఇలాంటి ఫ్రెండ్స్‌ని కనీసం రోజులో ఒక్క సారైనా కలవాలి. వారితో మాట్లాడాలి. వారితో కలిసి మన చదువు ఎలా కొనసాగుతుందో చర్చించాలి. సమస్యలుంటే చర్చించాలి. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ చైతన్య (మోటివేట్‌) పరుస్తూ వుంటారు. ఎంత నిరాశగా వున్నాసరే మీలో ఉత్తేజాన్ని నింపుతారు. కార్యోన్ముఖుల్ని చేస్తారు. ఎంత సంక్లిష్టమైన పరిస్థితి ఉన్నా, ఇక ఏ దారిలేదు అనుకున్న స్థితిలో కూడా మీకు మీపై నమ్మకాన్ని కలిగిస్తారు. వారిని అంటిపెట్టుకునే ఉండాలి. గంటలు గంటలు కలిసే అవకాశం లేకున్నా, వారితో ఫోన్‌లోనైనా, మెయిల్‌ ద్వారా, వాట్సప్‌ ద్వారా ఎప్పుడూ సత్సంబంధాలు కలిగివుండాలి. అది మీ చదువుకు చక్కని రాజ మార్గాన్ని ఏర్పరుస్తుంది.

4.Lazy Friends

వారికి కావలసిన పనులు చాలావరకు మీతో చేయిస్తారు. ఉదా : వాళ్ళు చదివే పుస్తకం మీ దగ్గరవుంది, కాని వాళ్ళకు అది అవసరం. నిజానికి వాళ్ళు వచ్చి ఆ పుస్తకం తీసుకోవాలి, కాని వాళ్ళురారు. మిమ్మల్నే వచ్చి ఇచ్చివెళ్ళు అంటారు. అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు, కాని ఎప్పుడూ అదే వరుస! అంటే… మీరు తప్పకుండా దానికి అడ్డు చెప్పగలగాలి, కాని కుదరదు. వీలైతే వాళ్ళనే వచ్చి తీసుకెళ్లండి అని చెప్పాలి.

5.Old Friends

6. Friends from other places :

వీళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

7.Tedious Friends
వీళ్ళు చాలా బోరింగ్‌గా వుంటారు. చెప్పిన విషయాలే చెప్పి చెప్పి విసుగు తెప్పిస్తారు. వాళ్ళు ఫోన్‌ చేస్తుంటే అబ్బా! ఫోన్‌ తియ్యాలా! వద్దా! అని ఆలోచన వస్తుంది. చాలా కష్టంగా ఫోన్‌ తీసుకుంటారు. ఎప్పుడు మాటలు ఆపేద్దాం అనిపిస్తుంది. వీళ్లకు దాదాపుగా చాలా స్పష్టంగా చెప్పగలగాలి. బాబూ నేను చదువుకోవాలి నన్ను డిస్టర్బ్‌ చెయ్యొద్దు. ఫలానా రోజు కలుద్దాం అని చెప్పగలగాలి.

8.Crazy Friends
ఈ స్నేహితుల వల్ల రోజంతా ఉత్సాహంగా వుంటుంది. చాలా ‘మిస్‌ఛీప్‌’ పనులు చేస్తారు. ప్రమాదాలు రావు, కాని స్నేహతులతో సరదాగా వుండడం, ఎదుటివాళ్ళను కన్‌ఫ్యూజ్‌ చెయ్యడం చేస్తుంటారు. ఉన్నట్టుండి లాంగ్‌ డ్రైవ్‌ పిక్‌నిక్‌ ఏర్పాటు చేస్తారు. స్నేహితులను ఎల్లప్పుడు ఎగ్జైట్‌మెంట్‌లో పెడుతూ పనులు చేస్తారు. ఇలాంటి స్నేహితులతో సమయం ఉన్నప్పుడు అయితే బాగుంటుంది. కాని వీళ్ళను రెండు మూడు నెలలకోసారి మాత్రమే కలిసేటట్టుగా ప్లాన్‌ చెయ్యాలి. జీవితం ఒక్కసారి రీచార్జ్‌ అవుతుంది. రాబోయే కాలంలో మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారు.

స్నేహాలు చాలా చాలా రకాలున్నాయి, కానీ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ కోసం ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులు మాత్రం పై వాటిని విశ్లేషించుకొని చదువుకునే కాలంలో స్నేహం వల్ల ఇబ్బందులు వస్తుంటే, స్నేహితులను చాలా వరకు క్రమబద్దీకరిం చుకుంటూ (రెగ్యులేట్‌) చేసుకుంటూ చదువును కొనసాగించాలి. చాలా దగ్గరగా ఉన్న స్నేహితుల మధ్య విభేదాలు వస్తే, నిపుణులను కలిసి వాటిని పరిష్కరిం చుకోండి. అంతే కాని దాని గురించే ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. స్నేహాలు మనిషి జీవితాలని ప్రభావితం చేస్తాయి. అవి చెడు మార్గాలు కావచ్చు, మంచి మార్గాలు కావచ్చు. మనం ఏ దారిని వెతుక్కుని జీవితాన్ని మంచిగా మలుచుకోవాలనుకుంటున్నామో అది కేవలం వ్యక్తిగత ఛాయిస్‌. లక్ష్యాలను నిర్ణయించుకుని చదువును కొనసాగిస్తున్న విద్యార్థులు నిరంతరం తమ సమయాన్ని ఎంత వరకు ఉపయోగించుకున్నాం, ఎంత సమయం స్నేహితులతో గడిపాం, ఎంత సమయం మన పోటీ పరీక్ష ప్రిపరేషన్‌ కోసం ఉపయోగించుకున్నామో బేరీజు వేసుకుంటూ స్నేహం, స్నేహితులు మన లక్ష్యానికి సహాయం చేసే విధంగా మలుచుకుంటూ విజయాన్ని సాధించాలి.

Other Updates