vijayaaniki-daaridiమనిషిలో మేధాశక్తి అపారం, దాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం. లేదంటే అపజయం. విజయాన్నే ఓ కౌన్సిలర్‌గా మార్చి ‘విజయం ఆత్మకథ’ అని విజయంతోనే తనను తాను పరిచయం చేయించుకున్నాడు రచయిత. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులను దృష్టిలో వుంచుకుని పుస్తకాన్ని రచించినా, ఈ పుస్తకం విద్యార్థులందరికీ ఉపయోగకరంగా వుంటుంది. ఈ పుస్తకాన్ని చదివే వారందరూ ఎప్పటికప్పుడూ వారి సామర్థ్యాలను అంచనా వేసుకోవడానికి, పుస్తకంలో ప్రశ్నావళిని కూడా పొందు పరిచారు అది బావుంది. ‘వైఫల్యం ఓ గుణపాఠం’, ‘మనాది మందు’, ‘పేదరికం అడ్డుకాదు’. చేజారే సమయం కథ లాంటి శీర్షికల ద్వారా నెగిటివ్‌గా ఆలోచించేవారి ఆలోచనలను ఎలా మార్చుకోవచ్చో వివరించారు.

వైఫల్యాలను అధిగమించి విజయం సాధించి నిలిచిన ప్రముఖులైన, ముత్యాలరాజు, ఐఏఎస్‌., తులసి, ఐఏఎస్‌., యం. ఉమాశంకర్‌, ఐఆర్‌ఎస్‌., తహశీల్దార్‌ ప్రసూనాంబ, ఒకప్పుడు ఐఏఎస్‌ టాపర్‌గా నిలిచిన ఇరా సింఘాల్‌లాంటి వారి గురించి ఈ పుస్తకంలో వివరించడం బాగుంది.

ప్రతి విషయానికి ముందే నీరు కారిపోయే మనస్తత్వం వున్నవారు తమ ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింపజేసుకోవాలి. ఆత్మవిశ్వాసం అండగా వుంటే అది అద్భుతాలను సృష్టిస్తుంది.ఇటువంటి సకారాత్మక ఆలోచనలను పెంపొందించే ‘ప్రిస్కిప్షన్‌’ ఈ ‘విజయానికి దారిది’ పుస్తకం. కేవలం విద్యార్థులేకాకుండా ప్రతి ఒక్కరూ చదివి, ఎప్పుడూ వెంట వుంచుకోదగిన ఓ మంచి పుస్తకం.

ప్రతులకు: రచయిత : డా|| సి.వీరేందర్‌, లైఫ్‌ సిలబస్‌ పబ్లికేషన్స్‌, హెచ్‌ఐజి – 2, బ్లాక్‌-5, ఫ్లాట్‌ నెం. 4, ఆర్టీసీ కల్యాణ మంటపం దగ్గర, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌.

Other Updates