అభివృద్ధిలో భాగంగా సాంకేతికంగా ముందుకు దూసుకుపోతున్న ఈ ఆధునిక కాలంలో పెద్దవాళ్ళే సంస్కృతీ, సాంప్రదాయాలను మర్చిపోయారు. ఈ తరుణంలో ఇటువంటి పుస్తకం వెలువరించడం అందరికీ ఉపయుక్తంగా వుంటుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.ఈ పుస్తకాన్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా ప్రతి అంశాన్ని కూడా సోదాహరణంగా వివరించడంలో రచయిత కృతకృత్యులయ్యారు. ఉమ్మడి కుటుంబాలు లేని ఈ కాలంలో పిల్లలకు అర్ధమయ్యే రీతిలో ఆచార వ్యవహారాల గురించి, పండుగల అర్థాల గురించి చెప్పే వారు కరువయ్యారు. కామధేనువు అంటే ఏమిటో, జాతిరత్నాలు ఎవరో ఇప్పటి పిల్లలకు తెలియదు.ఈ పుస్తకం చదివితే అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి.గాంధీజీ సూక్తులు,గాంధీజీతో ముఖాముఖి, రాజ్యాంగంలోని అంశాలు ఇలా అన్నింటినీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో పొందుపరిచారు రచయిత. ఈ పుస్తకం కేవలం పిల్లలే కాదు పెద్ద వాళ్లు కూడా చదువదగిన మంచిపుస్తకం బాలవిజ్ఞాన సర్వస్వం.

 

Other Updates