తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీసుకున్న చర్యలను ఛత్తీస్‌గఢ్ సిఎం రమణ్ సింగ్ ప్రశంసించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. జూలై 31న సిఎం కేసిఆర్‌తో రమణ్ సింగ్ సమావేశమయ్యారు.
గతంలో ఉన్న తెలంగాణకు ఇప్పుడున్న తెలంగాణకు చాలా తేడా ఉందని, కొత్త రాష్ట్రంగా ఏర్పడినా విద్యుత్ సమస్యను అధిగమించిందని, దీనికోసం కె.సి.ఆర్. చేస్తున్న కృషిని అభినందించారు. కేసిఆర్‌ను కలవగానే ముందుగా విద్యుత్ అంశపైనే చర్చ జరిపారు. జల, సౌర విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్ విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 2700 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నామని కె.సి.ఆర్. వివరించారు. ఇంతకు ముందు చేసుకున్న ఒప్పందం మేరకు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరాకు అవసరమైన లైన్ నిర్మాణ పనులు పూర్తికి చర్యలు తీసుకోవాలని ఇద్దరు సిఎంలు నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ, తదితర అంశాలపై చర్చించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నయారాయ్‌పూర్ నిర్మాణ పురోగతిపై కేసీఆర్ ఛత్తీస్‌గఢ్ సిఎంని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాలకు ఆకర్షితుడైన రమణ్ సింగ్ ‘‘మీలాగే మేముకూడా మంచి కార్యక్రమాలు అమలు చేస్తాం’’ అని కె.సి.ఆర్‌కు చెప్పారు. ఈ సందర్భంగా రమణ్‌సింగ్ మాట్లాడుతూ, తాను హైదరాబాద్‌లో కారులో ప్రయాణిస్తున్నప్పుడు కరెంట్ కోతపై డ్రైవర్‌ను అడిగితే ఇంతకు ముందు కరెంటు సమస్య తీవ్రంగా ఉండేదని, కె.సి.ఆర్ సిఎం అయిన తర్వాత కరెంటు కోతలు లేవని ఆ డ్రైవర్ చెప్పడంతో చాలా సంతోషించానన్నారు.
రోజుకు సగటున ఆరువేల మెగావాట్ల విద్యుత్ అవరసమయ్యే రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో విద్యుత్ సమస్య నుండి బయటపడి కోతలు లేని విద్యుత్ సరఫరా చేసే స్థితికి తెలంగాణ చేరుకోవడం మామూలు విషయం కాదన్నారు.
రమణ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి కె.సి.ఆర్. శాలువా కప్పి, చార్మినార్ జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కెటిఆర్, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్. వేణుగోపాలాచారి, స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ రవీందర్ రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
శభాష్ తెంగాణ : కేంద్ర ప్రభుత్వం ప్రశంస
మరుగుదొడ్ల నిర్మాణాఢిల్లీను సకాలంలో పూర్తి చేసినందుకు శభాష్ తెలంగాణ అని కేంద్రం ప్రశంసించిందని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాఢిల్లీ అమలులో అన్ని రాష్ట్రాఢిల్లీకంటే తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని కేంద్రం కొనియాడిందని ఆ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 14,526 మరుగుదొడ్ల నిర్మాణాలను తెలంగాణ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయగలిగింది. పెండింగ్‌లో కేవలం 251 మాత్రమే ఉండగా, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేయడానికి జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారని విద్యాశాఖ డైరెక్టర్ చిరంజీవులు పేర్కొన్నారు. ఈ విషయంపై జూలై 31న డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆర్‌ఎంఎస్‌ఏ నుంచి 200 కోట్లు, ఎస్‌ఎస్‌ఏ వంటి శాఖల్లో వివిధ నిర్మాణాల కోసం కేంద్రం నుంచి నిధులు రావల్సి ఉందని, అందుకోసం చర్యలు చేపడతామని డైరెక్టర్ చిరంజీవులు, డిప్యూటీ సీఎంకు వివరించారు.