15వ ఆర్థిక సంఘానికి అందించిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం
దేశ ఆర్థిక విధానాలు మారాలని, కొత్త పంథాలో దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం
ఉన్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం గుత్తాధిపత్యం పోవాలని, రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. జాతీయస్థాయిలో మన ఆలోచన విధానం మారాలని, రొటీన్ విధానాలకు స్వస్తి పలుకాలని స్పష్టంచేశారు. 15వ ఆర్థిక సంఘానికి తాను సమర్పించిన నివేదికను సీఎం కేసీఆర్ వెల్లడించారు. మనం ఉత్తమ విధానాల (బెస్ట్ ప్రాక్టీసెస్) గురించి మాట్లాడటం మానేసి, భవిష్యత్తు ప్రగతికి ఎలాంటి విధానాలు అనుసరించాలో (నెక్ట్స్ ప్రాక్టీసెస్) చర్చించాలని సూచించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ఆర్థిక అవసరాలకు సంబంధించి ఫైనాన్స్ కమిషన్‌కు నివేదిక సమర్పిస్తుంటాయి.తెలంగాణ ప్రభుత్వం మాత్రం దేశాభివద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కూడా నివేదికలో పేర్కొన్నది.
దేశాభివద్ధికి సీఎం కేసీఆర్ సూచనలు
అ దేశంలో 40 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నది. నీటిపారుదల వ్యవస్థను పటిష్ఠం చేస్తే 40వేల టీఎంసీల తోనే మొత్తం వ్యవసాయరంగానికి సాగునీటిని అందించొచ్చు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, పైపులైన్ వంటి విధానాల ద్వారా పొలాలకు నీరందించవచ్చు.
- దేశంలో 5.5 కోట్ల (14శాతం) ఎకరాల భూమికి మాత్రమే కాలువల ద్వారా నీరు అందించగలుగుతున్నాం. అంతర్రాష్ట్ర జల వివాదాలు, న్యాయ సమస్యలు, భూ సేకరణ, పునరావాసం, నష్టపరిహారం అందించడంలో జాప్యం, ప్రాజెక్టు ప్లానింగ్‌లో వైఫల్యం వంటివి నీటిపారుదల రంగానికి అవరోధంగా మారాయి.
- అంతః రాష్ట్ర జలవివాదాల పరిష్కారాన్ని ట్రిబ్యునళ్లు దశాబ్దాలపాటు జాప్యంచేస్తే ఎలా వేగంగా ముందుకుపోతాయి.
- తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ సెక్షన్ -3 కింద జల వివాదాలను ట్రిబ్యునల్ ముందుకు తీసుకు కేంద్రాన్ని కోరాం. కానీ చర్యలు తీసుకోలేదు. ఇటువంటి నిర్లక్ష్యం చాలా రంగాల్లో కనబడుతున్నది.
- జల వివాదాల శాశ్వత పరిష్కారానికి ‘పర్మినెంట్ రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్’ ఏర్పాలు ప్రతిపాదనకు కేంద్రం మోక్షం కల్పించడం లేదు.
- రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహనతో జలవివాదాలను పరిష్కరించుకోవడాన్ని కేంద్రం ప్రోత్సహించాలి.
- తెలంగాణ ప్రభుత్వం జల వివాదాలను రాష్ట్రస్థాయిలో పరిష్కరించుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేసింది. పొరుగు రాష్ట్రాలతో సుహద్భావ వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకు న్నాం. మహారాష్ట్ర, కర్ణాటకతో సంప్రదింపుల ద్వారా పరిష్కారం కనుగొన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టే సజీవ తార్కాణం.
- అనవసరమైన పబ్లిక్ ఇంటస్ట్ లిటిగేషన్‌ను నిరోధించ డానికి పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరమున్నది. ఈ వివాదాలకు అంతం లేకుండా పోతున్నది.
- అసమర్ధత, వ్యవస్థల వైఫల్యం, విధానాల్లో లోపంవల్ల వనరులను సమర్ధంగా వినియోగించుకోలేకపోతున్నాం.
- మనకంటే ఎంతో వెనుకబడిన దేశా లు రుణాలు తీసుకోవడం ద్వారా అభివృద్ధిలో దూసుకుపోయాయి.
- 1979 తర్వాత చైనా అనూహ్యమైన ప్రగతిని సాధించింది. 1992 తర్వాత 25 ఏండ్ల వరకు నిరంతరంగా ప్రగతి పథంలో దూసుకుపోయింది. వాస్తవానికి 1971 వరకు చైనా జీడీపీ ఇండియా కంటే తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చైనా జీడీపీ ఇండియా కంటే నాలుగు రెట్లు పెరిగింది. చైనా దేశం లాగా మనం ఎందుకు ప్రగతి సాధించలేకపోతున్నాం? సానుకూల విధానాలు, ముందుచూపుతో చైనా ఈ అభివద్ధిని సాధించగలిగింది.
- ఈస్ట్ ఏషియన్ టైగర్స్‌గా పేర్కొనే దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు అద్భుతమైన ప్రగతిని సాధించాయి. ఒకప్పుడు బూడిదగా మారిన జపాన్ ఇప్పుడు అత్యంత ధనిక దేశంగా ఎదిగింది.
- మనం రుణాలను తీసుకుని దేశ ఆర్థికవ్యవస్థను పటిష్ఠం చేసుకోలేమా? ఏ శక్తి మనల్ని నిరోధిస్తున్నది? ఆది మనం అధిగమించలేనంత సమస్యనా?
- 70 ఏండ్ల భారతదేశ అభివద్ధికి ఒక కొత్త మార్గనిర్దేశం కావాలి. మనం ఇప్పటికీ కనీస అవసరాలను సాధించడానికి పోరాటం చేయాల్సివస్తున్నది. నిరుద్యోగం, పేదరికం ఇంకా పట్టి పీడిస్తున్నాయి. మనం ఉత్తమ విధానాలు (బెస్ట్ ప్రాక్టీసెస్) గురించి మాట్లాడడం మానేసి భవిష్యత్తులో ఎలాంటి విధానాలు అనుసరించాలో చర్చించాలి.
- జాతీయస్థాయిలో మన ఆలోచన విధానం మారాలి. ఏటా రొటీన్‌గా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం వంటి సాధారణ సంప్రదాయ ఆలోచనలతో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాలేం.
- సాధారణంగా ఆలోచించకుండా విశాల దక్పథంతో వ్యవహరించాలి. చిన్న అభివ ద్ధి గురించి ఆలోచించకుండా అసాధారణ ప్రగతి కోసం పాటుపడాలి.
- దేశం అభివ ద్ధి చెందాలంటే రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలి. కేంద్రీకత విధానాలు పోవాలి.
- దేశానికి కొత్త ఆర్థిక విధానం అవసరం. రాష్ట్రాల ఆర్థికాభివద్ధే దేశ అభివ ద్ధి అని గమనించాలి. దేశంలో నుంచి 10 మాత్రమే అభివద్ధి చెందిన రాష్ట్రాలున్నాయి. వాటి ఆర్థిక అభివ ద్ధి దేశానికి ప్రధాన ఆధారంగా మారింది. మిగతా రాష్ట్రాలు అభివ ద్ధిలో చాలా వెనుకబడి ఉన్నాయి. రుణాలు తీసుకోవడం, వనరులను వినియోగించుకోవడం ద్వారా అవి అభివద్ధి బాటలో పయనించవచ్చు.
- రాష్ట్రాలకు వాటి ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలి. చాలా విషయాలు రాష్ట్రాల జాబితాలో ఉన్నా, కేంద్ర ప్రాయోజిత పథకాల్లోనూ ఉన్నా యి. అనేక విషయాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. వాటిని రద్దుచేసి కేంద్రం గుత్తాధిపత్యాన్ని తగ్గించాలని సర్కారియా కమిషన్ దష్టికి రాష్ట్రాలు తీసుకెళ్లాయి. క్రిమినల్ లా, అడవులు, రుణాల ఎగవేత, ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంక్షే మం, న్యాయ, వైద్య, విద్య, విద్యుత్ రంగాలు ఉమ్మడిజాబితాలో ఉన్నాయి. గతంలో రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్య, అడవులు, తూనికలు-కొలతలు, వన్యప్రాణి సంరక్షణ వంటివి ఉమ్మడి జాబితాలోచేర్చి రాష్ట్రాల పరిధిని కుదించారు.
- ఏవైనా అంశాలను ఉమ్మడి జాబితాలోకి చేర్చాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ద్వారా సంప్రదించాలని సర్కారియా కమిషన్ సిఫారసు చేసింది. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్య, పట్టణ, గ్రామీణాభివద్ధి,హౌసింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళాశిశు సంక్షేమం వంటి అంశాలు రాష్ట్రాల పరిధిలో మాత్రమే ఉండాలి.
- అ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ జీటీఆర్‌లో రాష్ట్రాల వాటాను 42 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి.
ఆర్థిక సంస్కరణలు అవసరం
దేశంలో ఆర్థిక సంస్కరణలను అమలుచేయాల్సిన అవసరమున్నది. సులభతరహా వాణిజ్య విధానం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి దేశంలోని అంతర్గత అభివద్ధిని మెరుగుపరచాలి. ఉదాహరణకు రహదారులను విశాలంగా మార్చడం, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, సరుకు రవాణా కోసం జాతీయ రహదారుల వేగాన్ని పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. కస్టమ్స్ క్లియరెన్స్‌లో జాప్యాన్ని తగ్గించాలి. దేశం లో జాతీయ రహదారుల స్పీడ్ గంటకు సగటు 50 కి.మీ. ఉండగా జపాన్, దక్షిణ కొరియాల్లో 80 కి.మీ., అమెరికా, బ్రిటన్‌లో 95-115 కి.మీ. ఉన్నది. దేశంలో సరుకురవాణా వేగం గంటకు 24 కి.మీ. మాత్రమే ఉండగా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో గంటకు 80+ కి.మీ. వేగం ఉన్నది.
అ మౌలిక వసతుల కల్పనలో మనం ఎంతో దూరంలో ఉన్నాం. జీడీపీలో 3-4 శాతం నిధులను మౌలిక వసతులకు వెచ్చించాల్సిన అవసరమున్నది. చాలాదేశాలు వారి జాతీయ సంపద కంటే ఎక్కువ మొత్తంలో అప్పులు చేసి అభివ ద్ధి చేసుకుంటున్నాయి. అమెరికా తన జీడీపీ కంటే 105 శాతం, జపాన్ 250 శాతం, సింగపూర్ 112 శాతం అప్పులు చేశాయి.
అ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని మన దేశానికి రప్పించి అభి వద్ధి కోసం వెచ్చించడానికి ఇండోనేషియా, ఇటలీలో మంచి ఫలితాలిచ్చిన ప్రాక్టికల్ ట్యాక్స్ విధానాన్ని అమలుచేయాలి. 2016-17లో ఇండోనేషియాలో 366 బిలియన్ డాలర్లు, ఇటలీలో 137 బిలియన్ డాలర్ల బ్లాక్‌మనీని ప్రజలు స్వచ్ఛందంగా వెల్లడించారు.
అ ప్రతీ పౌరుడు తాను పన్ను చెల్లింపుదారుడిననే గర్వంతో బతికేలా, స్వచ్ఛందంగా వెల్లడించే విధానం ఉండాలి. పన్ను ఎగవేసే విధంగా కఠిన విధానాలు ఉండరాదు.
మిషన్ భగీరథ తరహాలో..
ఇంటింటికి తాగునీరు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ వంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాల్సిన అవసరమున్నది. వచ్చే ఐదారేండ్లలోపు దేశంలోని ప్రతి గ్రామానికి మంచినీరు అందించడానికి చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రూ.-10 లక్షల కోట్లు అవసరం అవుతాయి.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
రైతుల పెట్టుబడికి వినియోగదారుల ధరకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. గిట్టుబాటు ధర లేక రైతులు తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు. రైతుబంధు మాదిరి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలి. కనీస మద్దతు ధరను ఏటా రూ.500 లేదా ప్రస్తుత ధరలో మూడో వంతు పెంచాలి. ధరల సూచీ (ప్రైస్ ఇండెక్స్) ఆధారంగా ఉద్యోగులకు ఏ విధంగా కరువుభత్యం ఇస్తున్నామో అదే విధానాన్ని రైతులకు అమలుచేయాలి. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతాలవారీగా క్రాప్ కాలనీలను ఏర్పాటుచేయాలి. వ్యవసాయ కూలీలకు నరేగా పథకానికి లింక్ చేసి 50శాతం నిధులను ఇచ్చి లాభాలను పెంచాలి.