దాదాదాపు రెండువందల సంవత్సరాలు నవాబుల పరిపాలనలో ఉంటకూ మహారాష్ట్ర జిల్లాలతో స్నేహం చేసినప్పటికీ, తెలంగాణ సిరిసంపదల్లో, జీవన ప్రగతిలో అచ్చంగా తెలుగు భకూభాగంగానే మిగిలింది. తెలుగు ప్రత్యేకతను తెలంగాణ ఎన్నడకూ విస్మరించి ఎరుగదు. సంస్కృతిని, సభ్యతను, జీవితంలోని ప్రతి కదలికలో కాపాడుకుంటకూ వచ్చింది.
కానీ, బహుళ విద్యావ్యాప్తి జరుగని కారణంగా ఇక్కడి ప్రజలు బయట తెలుగు వాళ్ళకంటే వెనుకబడి ఉన్నారు. అనేక పాఠశాలలు, ఘనమైన విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కళాశాలలు ఎన్నో ఉన్నప్పటికీ సామాన్య ప్రజలలో విద్యా ప్రచారం ఎక్కువగా సాగలేదు. ఈ కొరతను తీర్చడాని బకూర్గుల ప్రభుత్వం చివరి రోజుల్లో ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, సిద్ధిపేట మొదలైన ప్రాంతాలలో నకూతన కళాశాలలను స్థాపించింది. వరంగల్ కాలేజీని అప్‌గ్రేడ్ కాలేజీగా మార్చింది. ‘విద్యా విషయంగా బకూర్గుల మంత్రివర్గం సాధించిన అభివృద్ధిని తెలంగాణవాసులు మరచిపోలేరు’ అని సురవరం ప్రతాపరెడ్డి అభిప్రాయం. స్వాతంత్య్రోద్యమ సమయంలోనకూ, పోలీసు చర్య అనంతరమకూ ఆనాటి స్వరకూపంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం కృత్రిమమైనదనీ, అది విచ్ఛిన్నమై పోవడం అవసరమని ప్రజల్లోను, కాంగ్రెస్ వాదుల్లోనకూ తీవ్ర ప్రభావం ఉండేది. ఈ మకూడు భాషా ప్రాంతాలను నిజాం కబంధ హస్తం ఒక దగ్గర వుంచింది.
పకూర్వపు హైదరాబాద్ రాష్ట్ర విశిష్ట సంస్కృతి, బహుభాషా వైదుష్యము ముఖ్యమైనది. ఆంధ్ర, మహారాష్ట్ర కుటుంబాల సమష్టి కుటుంబం నాటి హైదరాబాద్. ఫార్సీ, ఉర్దకూ భాషల ప్రభావం ప్రముఖంగా కనిపించేది.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తోనే భాషా రాష్ట్రాల ఆందోళన మొదలైంది. అయితే ఆ రోజుల్లో ఆందోళనకు నాయకత్వం వహించిన వారు కోరుకున్నది ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంనుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నది మాత్రమే, తెలుగు భాష మాట్లాడే ప్రజానీకంలో గణనీయ భాగం హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణా ప్రాంతంలో నివాసముంటున్నది. విశాలాంధ్ర అనే ఆలోచన రావడానికి, మరో మకూడు దశాబ్దాల కాలం పట్టింది. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలంగాణా ప్రాంతాన్ని కూడా చేర్చి విశాలాంధ్ర ఏర్పడాలన్న కోరిక అప్పటికి ఆవిర్భవించలేదు. మద్రాసు రాష్ట్రంలోని తెలుగు భాషా ప్రాంతాలే ఒక పెద్ద రాష్ట్రమంత ఉన్నాయి. అందువల్ల ఆ రాషా్టన్ని ఆంధ్ర రాష్ట్రంగానకూ, మిగిలి ఉన్న రాషా్టన్ని మద్రాసు రాష్ట్రంగానకూ విభజించాలని అప్పట్లో తలపోశారు.
1953 అక్టోబర్ 1వ తేదీన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగానే వివిధ భాషలు మాట్లాడే ప్రజలున్న అవాస్తవిక రాష్ట్రాలని పునర్నిర్మాణం చేసి, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచాలనే ప్రజా ఆందోళనలు దేశమంతా ఉవ్వెత్తున లేచాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరచడానికి ఫజల్ అలీ అధ్యక్షతన ఒక కమిషన్‌ను ంద్ర ప్రభుత్వం నియమించింది. సర్దార్ ఫణిక్కర్, హృదయనాథ్ కుంజ్రకూలు దీని సభ్యులు.
ఈ కమిషన్ హైదరాబాద్ రాష్ట్ట్రాన్ని విభజించడం అనివార్యం అని చెప్పింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించడమే జరుగకపోతే, దక్షిణాపథంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని తలపెట్టవలసినపనే లేదని కమిషన్ హెచ్చరించడం గమనించవలసిన విషయం. హైదరాబాద్ రాషా్టన్ని యథాతథంగా ఉంచితే ప్రజాభిప్రాయాన్ని తృణీకరించినట్లే అవుతుంది. తెలంగాణా గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలన్నీ రాష్ట్ర విభజనలో ఏకీభవించి ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని వాదించిన వారిని సంఖ్య లెక్కలోనికి తీసుకోవలసినది కాదు.
తెలంగాణాలోని తొమ్మిది జిల్లాలు, బాందా, బస్తరులోని తెలుగు ప్రాంతాలు, భద్రాచలం తాలకూకాలోని కొంత ప్రాంతం కలిపి తెలంగాణా రాష్ట్రం నిర్మించాలని హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఫజల్ అలీ కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
ఎస్సార్సీ సకూచనలు
ఎస్సార్సీ చేసిన ముఖ్యమైన సకూచనలో ఒకటి హైదరాబాద్ రాష్ట్ట్రాన్ని విభజించి బహుభాషా ప్రాంతమైన బీదరు (మరట్వాడా) జిల్లానికూడా చేర్చి హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ట్రాన్ని ఏర్పరచాలి. దానిపేరు హైదరాబాద్ రాష్ట్రమే.
నల్లగొండ జిల్లా మధ్యలో ఉన్న మునగాల పరగణాను కూడా హైదరాబాద్ రాష్ట్రంలో కలిపి వేయాలి.
1961 దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలలో నకూతన హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నుకునే సభ్యుల మొత్తంలో మకూడింట రెండువంతుల మంది కోరే పక్షంలో తెలంగాణ రాష్ట్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో చేర్చి విశాలాంధ్ర ఏర్పాటు చేసుకోవచ్చు.
45000 చదరపు మైళ్ల వైశాల్యం కలిగి 113 లక్షల జనాభాలో, 17 కోట్ల సాలుసరి ఆదాయంతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధిగానే ఉండగలుగుతుందని కమిషన్ వారి అంచనా.
ప్రత్యేక రాష్ట్ర వాదాలు
హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జె.వి. నరసింగరావు, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి ఎస్. చెన్నారెడ్డి (డాక్టర్ ఎం. చెన్నారెడ్డి కాదు) 1955 నవంబరు 6న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు యకూ.ఎన్. ధేబర్‌ని కలుసుకున్నారు. ప్రత్యేక తెలంగాణా నిర్మాణ విషయమై ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉందని వివరించారు. తిరుగు ప్రయాణంలో నవంబరు 11వ తేదీన బొంబాయి నగరంలో ఒక ప్రకటన చేస్తకూ జేవీ నరసింగరావు ఇలా అన్నారు.
‘ఆర్థికంగా స్వయం పోషకంగా ఉండగలిగిన హైదరాబాద్ రాష్ట్రం, కావాలనే ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు కోరుతున్నారు. తెలంగాణా ప్రాంతంలో ఒకటి మినహా ఇతర జిల్లాల కాంగ్రెస్ సంఘాలన్నీ ప్రత్యేక హైదరాబాద్ కోరాయి. వ్యతిరేకించిన ఒక్కజిల్లా సంఘం కూడా ఒక్క ఓటు తేడాతో (8-9) నిరాకరించింది. అది ఒక్కటే విశాలాంధ్రను కోరింది. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్‌లో తెలంగాణ ప్రాంతం ప్రతినిధులలో 70 వంతులు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్నే కోరుతున్నారు. హైదరాబాద్ నగర కార్పొరేషన్, అనేక సంఘాలు, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల సంఘాలు, జమయత్-ఉల్-ఉలేమా, జాతీయ విద్యార్థి సంఘం, వర్తక సంఘం, న్యాయవాదుల సంఘాలు, గ్రామ పంచాయతీలు, రైతు సంఘాలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నాయని’ స్పష్టంగా చెప్పారు.
నవంబర్ 16న రెండు రాష్ట్రాల వాదులతో హైకమాండ్ సంప్రదింపులు జరిపింది. తెలంగాణా తరఫున కొండా వెంకటరంగారెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు జేవీ నరసింగరావు పాల్గొన్నారు. తెలంగాణాలో నకూటికి 95మంది ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారని చెప్పారు. అప్పుడు ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకూరి సత్యనారాయణరాజు తెలంగాణలో నకూటికి నకూరుమందికి అభివృద్ధి కృషిలో ఏలాంటి లోపం జరుగదని హామీ ఇచ్చారు. ఆ విషయంలో అగ్ర నాయకులు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు రకూపొందించుకుంటే అలా చేయడానికి ఆంధ్రులలో ఎవరికి వైముఖ్యం ఉండదని వివరించారు. అప్పుడు హైదరాబాద్ ఆంధ్రులకు ఎలాంటి అన్యాయం జరుగదని ధేబర్ చెప్పారు. తెలంగాణా ప్రజలు అంగీకరిస్తే తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాల కలయిక జరుగుతుందని కాంగ్రెస్ కార్యవర్గం చేసిన తీర్మానం అస్పష్టంగా ఉందని, తెలంగాణా ప్రజలు విశాలాంధ్ర కావాలని అంటున్న అభిప్రాయం ఒకటి ఢిల్లీలో వ్యాపించిపోయింది. తెలంగాణాలో 90 శాతంమంది ఈ ఉభయ ప్రాంతాలను కలిపివేసే సకూచనలకు విముఖులు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణసంఘం సకూచించినట్లు ప్రత్యేక రాష్ట్రమే కావాలంటున్నారని జేవీ ఖండితంగా వెల్లడించారు.
రంగారెడ్డి వాదన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి స్వయం పోషకంకాగానే ఎప్పుడో ఆరేళ్ళకు విశాలాంధ్రను ఎవరకూ కోరరు. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణా ఆదాయం 4 కోట్లు ఎక్కువ. విశాలాంధ్ర ఏర్పడితే అది మనకు దక్కదు. ఈ డబ్బుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధించవచ్చు. కనుక తెలంగాణాని విశాలాంధ్ర వచ్చి ఏదో ఉద్ధరిస్తుందని భ్రమతో ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించడం భావ్యం కాదని కొండా వెంకట రంగారెడ్డి 1955 అక్టోబరు 22న కొత్త ఢిల్లీలో స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి చెప్పుకోతగ్గ స్థాయిలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నది. తెలంగాణాతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలనుంచి తలసరి పన్ను ఆదాయం తక్కువ. మరోవైపు తెలంగాణాకు ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలు బహు తక్కువ. తెలంగాణాలో భకూమి పన్ను ఆదాయం ఎక్కువ. మద్యంమీద యేటా రకూ. 5 కోట్లు ఆదాయం వస్తుంది. రెండు ప్రాంతాల ప్రభుత్వ ఆదాయల్లో తేడాకు ఇదే కారణం. చెబుతున్న కారణం ఏమైనప్పటికీ తెలంగాణా స్థిర ఆదాయ వనరులనుంచి వచ్చే మొత్తాలను ఏకీకరణ తర్వాత ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక అస్థిరత్వాలవంటి పరిస్థితులలో ఉమ్మడి అభివృద్ధి పథకాలకు వెచ్చించే అవకాశం ఉందని తెలంగాణా నేతలు భయపడుతున్నట్లు కనిపిస్తకూంది. ప్రగతిపథంలో ఉన్నట్లు చెప్పుకుంటున్న తెలంగాణా ప్రాంతానికి ఏకీకరణ పాలనాపరంగా ఎలాంటి లాభం ఉండదనేవాదం ఉంది.
భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలని పరిగణనలోకి తీసుకుంటే, తమ ప్రాంత డిమాండ్లను విశాలాంధ్రలో అంతగా పట్టించుకోరేమోననే భయం తెలంగాణాలో వ్యక్తమవుతున్నది. ఉదాహరణకు: నందికొండ (కృష్ణానది), కుష్టాపురం (గోదావరి) ప్రాజెక్టులను తీసుకుంటే ఇవి తెలంగాణాలోనే కాకుండా యావత్తు భారతదేశంలో చేపట్టిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్టులకోవకు చెందినవి. అదే సమయంలో ఈ రెండు నదులపై కోస్తా డెల్టాలో సాగు నీటిపారుదలకు ప్రణాళికలు తయారవుతున్నాయి. అందు తెలంగాణా ఆ రెండు నదులకు సంబంధించి తన ప్రాంత స్వతంత్ర జల వినియోగం హక్కులను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు.
కోస్తాకు చెందిన ఆధునికులు దోపిడీ చేస్తారేమోనన్న అనుమానం విద్యాపరంగా వెనుకబడిన తెలంగాణా ప్రజల్లో నెలకొనడం విశాలాంధ్రపై వ్యతిరేకతకు ముఖ్యమైన కారణాల్లో ఒకటి. హైదరాబాద్ దాటితే తెలంగాణ జిల్లాల్లో విద్యారంగం దారుణంగా వెనుకబడి ఉంది. దాంతో ప్రభుత్వ ఉద్యోగాల్లో కనీస విద్యార్హతలు ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే తక్కువగాఉండేవి. తెలంగాణా ప్రజల అసలు భయం ఏమంటే.. ఆంధ్ర రాష్ట్రంతో పోలిస్తే తమను ఆంధ్రవాళ్ళకన్నా తక్కువ స్థానంలో ఉంచుతారని, ఆ భాగస్వామ్యంలో ప్రధాన వాటాదారులైన ఆంధ్ర తక్షణమే లబ్ధిపొందుతుందని, వాణిజ్యరంగంలో ఆరితేరిన కోస్తాంధ్రకు తెలంగాణ వలస ప్రాంతంగా (కాలనీ)గా మారుతుందేమోనని.
తెలంగాణా తనకు తానుగా ఒంటరిగా మనగలిగిన సుస్థిర రాష్ట్రం అవుతుందనే వాదన వినిపిస్తుంది. ఈ ప్రాంతం రెవిన్యకూ వసకూళ్ళు రకూ. 17 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్మాణానికి తెచ్చే భారీ అప్పులకు ఏటా చెల్లించాల్సిన వడ్డీవల్ల కొత్త రాషా్టనికి (తెలంగాణ) పడే లోటు భారీగా ఏమీ ఉండబోదని విశ్వసిస్తకూన్నది. అనుకూల పరిస్థితుల్లో ఆదాయం, ఖర్చు సమానం అయ్యే అవకాశం ఉందని, మిగులు బడ్జెటుకూడా చకూపిచవచ్చుననే వాదనలు ఉన్నాయి. రాష్ట్రంలో పన్ను వసకూళ్ళ అవకాశం పకూర్తిగా సద్వినియోగం చేసుకుంటే తెలంగాణ ప్రాంతం ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు.
గమనంలో ఉంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రం ఇటీవలె ఏర్పడింది. మార్పు దశలో ఒత్తిడినుంచి ఇంకా కోలుకోలేదు. ఉదాహరణకు భకూసంస్కరణల విషయంలో అదింకా విధానాన్ని రకూపొందించుకోలేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంనుంచి విడిపోయిన సందర్భంగా తలెత్తిన సమస్యలు ఇంకా సమసిపోలేదు. ఆ దశలో ఎంతో జాగ్రత్త వహించిన తెలంగాణా ఆంధ్ర విలీనం రెండు ప్రాంతాలకు పరిపాలనాపరమైన ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. పరిస్థితులను పరిశీలించిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిలేదని, హైదరాబాద్ నగరం రాజధాని కొరతను తీరుస్తుందని తొందరపడి ఆంధ్ర, తెలంగాణలు విలీనం చేయడం తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం కలిగించింది. పాలకులు, పాలితుల సమస్య కొత్తగా తలెత్తింది.పై పరిస్థితులను గమనిస్తే, ప్రత్యేక తెలంగాణకోసం జరిపిన ఉద్యమంలో ఎంత న్యాయం ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి మన వాదనలకి మరింత బలం చేకకూరింది.
జి.వెంకటరామారావు