tsmagazine
మహిళలు కొత్తచరిత్ర లిఖించి ఆవిష్కరణల రంగంలో ముందడుగు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వీహబ్‌ మొదటిమెట్టు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి .తారకరామారావు ఆకాంక్షించారు. మహిళా సాధికారతకు కట్టుబడి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వమే ముందుకు వచ్చి వీహబ్‌ పేరుతో పరిశోధనలకు ఊతం ఇస్తున్నదని ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో వీహబ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. మిస్సైల్‌ ఉమన్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన డీఆర్‌డీవో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ టెస్సీ థామస్‌, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, సీఐఐ ఛైర్మన్‌ వీ రాజన్న, కలారీ క్యాపిటల్‌ సంస్థ ఎండీ వాణి కోలా, వీహబ్‌ సీఈవో దీప్తి రావుల, ఫిక్కి, ఫిక్కి మహిళా విభాగం, కోవా సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మానవ పరిణామక్రమంలో మహిళల్లో సజనాత్మక శక్తి ఉన్నప్పటికీ వారికి ప్రోత్సాహం దక్కకపోవడం వల్ల వారి ప్రతిభ వెలుగులోకి రాలేదు. ఇటీవలికాలంలో కూడా అండదండలు లేకపోవడం వల్ల పలువురు ముందుకురాలేకపోయారు. అందుకే మహిళలకు అండగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. విజేతల్లో ఎక్కువశాతం ఎవరి ప్రోత్సాహం లేకుండానే ఎంతో శ్రమకోర్చి తమ సత్తాను చాటుకున్నవారే. అయితే అలాంటి వారిని ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆవిష్కరణల కేంద్రం టీహబ్‌ను ప్రారంభించాం. స్వల్పకాలంలోనే అద్భుతమైన ఫలితాలను సాధించాం. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో టీహబ్‌ స్టార్టప్‌ గెలిచింది. ఇదే స్ఫూర్తితో మహిళలకు ప్రత్యేక ఆవిష్కరణల కేంద్రం ఉండాలని వీహబ్‌ ఆలోచన చేశాం. హైదరాబాద్‌ కేంద్రంగా జరిగిన గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ ముగిసేరోజున వీహబ్‌ ప్రకటన చేశాం. స్వల్పకాలంలోనే ఆ ప్రాజెక్టును ప్రారంభించు కుంటున్నాం అని తెలిపారు. ఆవిష్కరణలను ప్రోత్సహించాలంటే విద్యావిధానంలో కూడా మార్పులు రావాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచం అంతా సిలి కాన్‌ వ్యాలీలోని ఆవిష్కరణల వైపే ఎందుకు దష్టిసా రించాలి? మిగతా దేశాల్లో ఆవిష్కర్తలకు ప్రోత్సాహం దక్కకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనేది స్పష్టం. చిన్నతనం నుంచే చదువు కేవలం మార్కుల కోసమే అన్నట్టు కాకుండా ఆవిష్కరణ లను పాఠ్యాంశంలో భాగం చేయాలి. జూనియర్‌ కాలేజీ

విద్యార్థులకు పరిశోధన అవకాశం కల్పిం చాలి. తద్వారా మెరుగైన ఆవిష్కరణలు వస్తాయి. ఎస్‌యూపీడబ్ల్యూ ప్రాజెక్టుకు మార్కులు కాకుండా నిజమైన పరిశోధనలకు చోటు కల్పించాలి. వీటితో పాటుగా పాలకులు ఆవిష్కర్త లకు భరోసాగా ఉండాలి. అందుకే వీహబ్‌లో రూపొందిన ఆవిష్కరణలకు మొదటి వినియోగదారుడిగా ప్రభుత్వం ఉంటున్నది. అని మంత్రి చెప్పారు.

ప్రభుత్వశాఖలకు సంబంధించిన కొనుగోలు నిబంధనలను మహిళల కోసం పక్కనపెట్టి ఈ నిర్ణయం తీసుకుంటు న్నాం. వీహబ్‌ దేశానికి, మహిళలను ప్రోత్సహించే రంగానికి దిశానిర్దేశం చేయాలి. స్ఫూర్తిగా నిలవాలి. ఐటీ రంగానికి సంబంధించిన ఆవిష్క రణలే కాకుండా అన్ని రకాల ఆవిష్కరణలకు వీహబ్‌ కేంద్రంగా నిలుస్తుంది. అందుకే వీహబ్‌కు ప్రాథమిక పెట్టుబడిగా రూ.15 కోట్లు కేటాయిస్తున్నాం. ఎంపికైన ఆవిష్కర్తలకు రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు అందజేస్తాం అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కాగా, ఈ కార్యక్రమం సందర్భంగా ఆరు ఒప్పందాలు ఆయా సంస్థల ప్రతినిధులు కుదుర్చుకున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ, సీఐఐ-ఇండియా ఉమెన్‌ నెట్‌వర్క్‌, సేల్స్‌ఫోర్స్‌, ఐఐఎం బెంగళూరు, ఎన్‌ఐడియా, పీడబ్ల్యూ ఎల్‌ ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల్లో ఉన్నాయి.

మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం
ప్రోత్సాహంలేకే మరుగునపడుతున్న మహిళల ప్రతిభ

తెలంగాణ ప్రభుత్వానికి సెల్యూట్‌

డీఆర్‌డీవోప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, మిస్సైల్‌ ఉమన్‌ టెస్సీ థామస్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు. వీహబ్‌లోని ఆవిష్కరణల ద్వారా రూపొందిన ఉత్పత్తులు, సేవలకు తామే మొదటి వినియోగదారుగా

ఉంటామని, 25 శాతం ఉత్పత్తులు తాము కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించడం సంతోషకరమన్నారు. ఆవిష్కరణల కోసం టీహబ్‌ ప్రారంభించడం, మహిళల కోసం ప్రత్యేకంగా వీహబ్‌ను ఏర్పాటుచేయడం ప్రశంసనీయమన్నారు. చిన్న ఆవిష్కరణ పెద్ద విప్లవాత్మక ఫలితానికి బీజంగా మారుతుంది. అలా మహిళల ఆవిష్కరణలకు వెన్నుతట్టేలా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేయడం సంతోషకరం. ప్రస్తుతం మహిళల్లో విశేషశక్తి ఉంది. వారి ఆలోచనలకు తగిన ప్రోత్సాహం అందించడం, వేదికను కల్పించడం సంతోషకరం.ఒక ప్రాజెక్టు ఆలోచన మొదలుకొని అది ఫలితం ఇచ్చేవరకు అండగా నిలవడం, ఉత్పత్తికి సైతం తాము భరోసాగా ఉండటం సంతోషకరం అని పేర్కొన్నారు. ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ వాణికోలా మాట్లాడుతూ, దేశంలో ఆవిష్కరణల రంగంలో మహిళల పాత్ర కేవలం 4 శాతం మాత్రమే ఉందని, ఇది పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ రంగంలో కీలక ముందడుగు వేసిందని చెప్పారు. గతంలో ఇలాంటి ప్రోత్సాహం ఉండి ఉంటే తాను సిలికాన్‌వ్యాలీ సహాయం కోసం ఎదురుచూసే అవసరం ఏర్పడేది కాదని ఆమె అన్నారు. ఎదుగుతున్న మహిళలకు ఇలాంటి ప్రయత్నం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. టీహబ్‌, వీహబ్‌తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ప్రముఖ ఫ్యాషన్‌ స్పెషలిస్ట్‌ శశి వంగపల్లి, శ్రీయల్‌ టెక్‌ ప్రతినిధులు సాహిత్యారాయ్‌, ఆమె సోదరి ఈ సందర్భంగా తమ విజయగాథలను పంచుకున్నారు.

మహిళలకు అండగా నిలిచేందుకే వీహబ్‌ ఏర్పాటు
మహిళా ఆవిష్కర్తలకు ప్రభుత్వమే మొదటి వినియోగదారు

tsmagazine

వీహబ్‌తో నీతిఆయోగ్‌ ఒప్పందం

కాగా వీహబ్‌ ఆరంభం రోజే తన ప్రత్యేకతను చాటుకున్నది. మహిళల సాధికారత కోసం నీతి ఆయోగ్‌ రూపొందించిన నారీశక్తి తమ మొట్టమొదటి ఒప్పందం తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్నదని రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి హబ్‌ను మహిళల కోసం ఏర్పాటుచేసిన తెలంగాణతో తాము జట్టుకట్టడం సంతోషంగా ఉందని, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపినట్టు జయేశ్‌ రంజన్‌ వివరించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అంబేద్కర్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో గల టీ శాట్‌ కార్యాలయంలో వీహబ్‌ కొలువుదీరిందని ఆయన తెలిపారు. టీహబ్‌2 ఏర్పడిన అనంతరం అక్కడ శాశ్వత కార్యాలయాన్ని ఏర్పా టు చేయనున్నట్టు వెల్లడించారు. వీహబ్‌లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. షషష.షవష్ట్రబప.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్లో దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు.

Other Updates