rama-jaya-ramaవైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 21న తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఉదయం 4 గంటల నుంచే భక్తులు ఆయా దేవాలయాల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, ధర్మపురిలతో పాటు పలు ముఖ్యమైన దేవాలయాలలో భక్తజన సందోహం కనిపించింది. వైకుంఠ ఏకాదశి రోజు పుణ్యస్నానాలు ఆచరించి, వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని భక్తులు పునీతులయ్యారు. భక్తుల రద్దీకి తగినట్లుగా ఆయా దేవాలయాల వద్ద అధికారులు భక్తులకు తగిన విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.

భద్రాచలంలో…

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో డిసెంబరు 21న వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఉదయం 5.00 గంటలకు ఉత్తర ద్వారదర్శనం చేసుకుని పునీతులయ్యారు. సీతాసమేత రామయ్య దర్శనం వైకుంఠాన్ని తలపించింది. ఉత్తరద్వారంలో రామయ్య దర్శనంతో భక్తులు పులకించి పోయి జయ జయ ధ్వానాలు చేశారు. ఉత్తరద్వారం తెరవగానే అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. సీతాలక్ష్మణ సమేతంగా శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అపురూప ఘట్టాన్ని కనులార వీక్షించేందుకై అర్థరాత్రి నుండే మిథిలా స్టేడియంకు చేరుకున్న భక్తులు శ్రీరాములోరి దర్శనంతో పులకించిపోయారు. శ్రీరామ జయరామ జయజయరామ అనే భక్తులు నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమ్రోగిపోయాయి. ఉత్తర ద్వారదర్శన అనంతరం భక్తులు శ్రీ సీతారాచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు.

నయనానందకరంగా తెప్పోత్సవం..

దక్షిణ అయోధ్యగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచలంలో

ముక్కోటి ఏకాదశి మహ ోత్సవమును పుర్కరించుకుని నిర్వహించిన శ్రీ సీతారామచంద్రుల తెప్పోత్సవం నయనానందకరంగా జరిగింది. గౌతమీనదీ తీరంలో అశేష భక్తజన వాహిని శ్రీ రామనామస్మరణ చేస్తుండగా లక్ష్మణ, కౌసల్య సమేత రామయ్య జలవిహారం శోభాయమానంగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాక చత్తీస్‌గడ్‌, ఒరిస్సా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 4.00. గంటలకు భద్రాద్రి రామయ్యను ఆలయం నుంచి మేళతాళాలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపుగా గోదావరి నది తీరంకు తీసుకొచ్చారు. సాయంత్రం 5.00 గంటలకు హంస వాహనం తెప్పపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయం సంధ్య వేళ ఆరు గంటల సమయంలో అద్భుత సూర్యాస్తమయ దృశ్యం ఆవిష్కృతం అవుతున్న వేళ గోదావరి నదిపై

శ్రీ సీతారామచంద్రస్వామివారు హంసపై ఆలంకరించిన విద్యుదీపాల జిలుగుల కాంతులతో మరింత శోభాయమానమై దర్శనమిచ్చారు. ఆరు గంటలకు మంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా స్వామి వారు జలవిహారం ఆరంభమై

రమణీయంగా సాగింది, ఉత్సవమూర్తులు విహారం చేస్తుండటం చూసి భక్తుల ఉత్సాహం ఆవిష్కృతం తన్మయంతో భక్తకోటి పులకించిపోయారు .అదేసమయంలో ఆవలి ఒడ్డున ఉన్న దేవస్ధానం సిబ్బంది ఒక్కసారిగా బాణాసంచాను కాల్చడం ప్రారంభించగా అందుకు అనుగుణంగా స్వామి వారి హంస వాహనం తిరుగాడింది. ఈ అద్భుత జలవిహారంచూసి భక్తులు ఆనందపారవశ్యంలో ముగినిపోయారు. జిల్లా యంత్రాగం పకడ్బంది ఏర్పాట్లు చేయడంతో తెప్పోత్సవం ప్రశాంతంగా జరిగింది, భక్తులు ఏలాంటి ఇబ్బందులు లేకుండ వేడుకలను తిలకించారు.

ఆకట్టుకున్న కోలాటం :

స్వామి వారు పల్లకి ఊరేగింపుగా గోదావరి తీరానికి బయలుదేరు పల్లకి ముందు వివిధ కోలాట బృందాల ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకున్నాయి, ఆలయం నుండి గోదావరి స్నానఘట్టాల వరకు కోలాట బృందాలు కీర్తనలతో స్వామి వారి ఊరేగింపు వైభవంగా సాగింది, ఊరేగింపు సాగుతున్నంతసేపు భక్తజనం శ్రీరామ జయరామ నినాదాలు చేస్తు ఊరేగింపులో ఉత్సహంగా పాల్గొన్నారు.

ఆకాశంలో మిరమిట్లు గొలిపిన బాణసంచా

గోదావరి తీరం అవతలి వైపున ప్రత్యేక పద్ధతిలో ఉంచిన మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు ఆకాశంలో సందడి చేసి హరివిల్లుగా మారాయి. ఉత్సవ శోభను మరింతగా పెంచితే అందమైన సంధ్యా సమయంలో ఈ వేడుక కనులవిందు చేసింది, వేలాది మంది భక్తులు కరకట్టపై నుంచి స్నాన ఘట్టాల వద్ద నదిలో జరిగిన ఈ ఘట్టాన్ని తిలకించి పులకించి పోయారు. మెరిసిపోగా దానికి ప్రతిచర్యగా నీటి బిందువులు పైకిలేచి పడుతున్న తీరుతో భక్తజనం మురిసిపోయారు.

స్వామి వారి తెప్పోత్సవాన్ని తిలకించిన ప్రముఖులు:

జిల్లా కలెక్టర్‌ డి.యస్‌. లోకేష్‌కుమార్‌, ఎస్పీ షాన్‌వాజ్‌ ఖాసీం, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రాజీవ్‌ హన్ముంతు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.జ్యోతి, భద్రాచలం ఏ.ఎస్పీ భాస్కరన్‌, భద్రాచలం ఆర్‌.డి.ఓ. బి. వెంకటేశ్వర్లు, ఇతర ప్రముఖులు, దేవస్దానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Other Updates