మార్గం లక్ష్మినారాయణ
tsmagazine
ప్రజారోగ్యం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యతని నిబద్ధతతో, నిజాయితీగా నిరుపమానంగా నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ భవిష్యత్తు-బంగారు తెలంగాణ దార్శనికులు సీఎం కెసిఆర్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి కలిసి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు 24 గంటలు అందిస్తూ సర్కార్‌ వైద్యం మీద ప్రజలకు నమ్మకం పెంచారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్ళ వరకు మౌలిక సదుపాయాలు, వసతులు పెంచి, వాటి రూపురేఖలని మార్చారు. తెలంగాణ వచ్చే నాటికీ రాష్ట్రంలో 17,000 బెడ్స్‌ ఉండేవి. ప్రస్తుతం వాటిని 20,000 లకు పెంచారు. ఇంకా అవసరమైన చోట్లల్లా పెంచుకుంటూ పోతున్నారు. నిమ్స్‌ లో 500, నిలోఫర్‌ లో 500, ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్లో 250, మిగతావి అన్ని జిల్లా హాస్పిటల్స్‌ లో పెంచారు. తెలుపు, గులాబీ రంగుల బెడ్‌ షీట్స్‌ని ప్రతి రోజూ మారుస్తున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ దవాఖానాల్లో 20%Iజఖ (+వఅవతీaశ్రీ Iజఖ, Iజఖ టశీతీ ఎశ్‌ీష్ట్రవతీ డ Iజఖ టశీతీ అవష పశీతీఅ)ల ఏర్పాటు జరుగుతున్నది. అన్ని టీచింగ్‌ హాస్పిటళ్ళలో ఎంఐసియులు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 21 ూచీజఖలకు అదనంగా మరో 10% ూచీజఖలు మొదలవుతున్నాయి. అప్పుడే పుట్టిన శిశువులలో 15శాతం మందికి ూచీజఖలు అవసరం అవుతాయి. తెలంగాణలో ఏడాదికి 6 లక్షల 50వేల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీరిలో లక్ష మంది పిల్లలకు ూచీజఖ సేవలు అవసరం అవుతాయి. దీని ద్వారా Iవీ= తగ్గించడానికి వీలవుతుంది.

డయాలిసిస్‌ కేంద్రాలు-బ్లడ్‌ బ్యాంకులు
రాష్ట్ర ఆవిర్భావం నాటికి నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ లాంటి దవాఖానాల్లో మాత్రమే డయాలసిస్‌ కేంద్రాలున్నాయి. కిడ్నీ బాధితులు వారానికి మూడు సార్లు డయాలసిస్‌ చేసుకోవాల్సి వస్తున్నది. మరోవైపు పెరుగుతున్న కిడ్నీబాధితుల కోసం దేశంలోనే ప్రభుత్వ రంగంలో మొదటి సారిగా సింగిల్‌ యూజ్డ్‌ 40 డయాలసిస్‌ కేంద్రాలను ప్రభుత్వం విస్తరిస్తున్నది. డయాలసిస్‌ పేషంట్లకు బస్‌ పాస్‌లని కూడా ఉచితంగా అందించాలని యోచిస్తున్నది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా 10వేల మందికి డయాలసిస్‌ సేవలు అందుతున్నాయి. అవసరాలను బట్టి 31 (19 పాతవి, 13 కొత్తగా) బ్లడ్‌ బ్యాంకులు, లేదా బ్లడ్‌ స్టోరేజీ యూనిట్లను అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గర్బిణీలు, క్షతగాత్రులు ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు.

డయాగ్నసిస్‌ సేవలు-మందులు-పరికరాల నిర్వహణ
ఒకే హాస్పిటల్‌లో వేర్వేరు చోట్ల జరుగుతున్న రోగ నిర్ధారణ పరీక్షల పరికరాలు పెంచి, అవన్నీ ఒకే చోట ఉండే విధంగా హాస్పిటల్స్‌ని తీర్చిదిద్దడమే గాక, కొత్తగా 40 డయాగ్నసిస్‌ కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. బోధన వైద్యశాలల్లో ఎంఆర్‌ ఐ, సిటి స్కాన్‌, ఆటో ఆనలైజర్‌, మమ్మోగ్రాం, టుడీ ఎకో, బోధనేతర వైద్యశాలల్లో సిటీ, ఆల్ట్రా సౌండ్‌, ఆటో ఆనలైజర్‌, పిహెచ్‌సి స్థాయిలోనే అల్ట్రా సౌండ్‌ సదుపాయాలు కల్పిస్తున్నారు. గతంలో రూ.114 కోట్లు ఉన్న మందుల బడ్జెట్‌ని రూ.300 కోట్లకు అంటే దాదాపు మూడింతలు పెంచి ఎన్నడూ లేని విధంగా నెలకు సరిపడా ఒకే సారి మందులు అందించడం ద్వారా సమగ్ర మైన మందుల పంపిణీ వ్యవస్థ ఏర్పాటయింది. హాస్పిటల్స్‌లో ఆయా పరికరాల 24 గంటలూ మెయింటెనెన్స్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏజెన్సీని నియమించారు.

అవయవ మార్పిడులు-అరుదైన ఆపరేషన్లు
కిడ్నీ, గుండె, పాంక్రియాటిస్‌, కాలేయ మార్పిడులు జరుగుతున్నాయి. ఇప్పటికే నిమ్స్‌లో 110 అవయవ మార్పిడులను విజయవంతంగా నిర్వహించగా. ఉస్మానియా చరిత్రలోనే తొలి సారిగా కిడ్నీ మరియు పాంక్రియాటిస్‌ సర్జరీని నిర్వహించారు. అరుదైన ఆపరేషన్లు సర్కార్‌ దవాఖానాల్లో వరసగా విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రపంచ రికార్డుని సష్టిస్తూ ఉస్మానియా వైద్యులు 20 సెంటి మీటర్ల కాన్సర్‌ కణతిని తొలగించారు. అరుదైన ప్లాస్టిక్‌ సర్జరీలు, ఇతర శస్త్ర చికిత్సలు ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో జరుగుతున్నాయి. ఇవన్నీ మన ప్రభుత్వ గౌరవాన్ని పెంచేవి. కాగా, కిడ్నీ, గుండె వంటి అవయవ మార్పిడులు జరిగాక అవసరమైన మందుల కోసం ఈ బడ్జెట్‌ లో ప్రత్యేక నిధిని కూడా కేటాయించి ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్‌ల లో పంపిణీ జరుగుతున్నది.

కొత్త మెడికల్‌ కాలేజీలు
తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్తగా 2 మెడికల్‌ కాలేజీలు ఏర్పడ్డాయి. మరో రెండు ఏర్పాటు ప్రక్రియలోవున్నాయి. వీటి వల్ల 700 ఎంబిబిఎస్‌ సీట్లు 1000 కి పెరిగాయి. 571గా ఉన్న పీజీ సీట్లు 792కు పెరిగాయి. మహబూబ్‌నగర్‌ లో మెడికల్‌ కాలేజీ విజయవంతంగా నడుస్తున్నది. కొత్తగా ఈ ఏడాది 150 సీట్లతో సిద్ధిపేట మెడికల్‌ కాలేజీ సంసిద్ధమైంది. ఇక సీఎం ప్రకటించిన సూర్యాపేట, నల్గొండల్లోనూ మెడికల్‌ కాలేజీల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతున్నది. వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం మెరిట్‌ స్కీం (వీజు=Iు రషష్ట్రవఎవ: =వరవaతీషష్ట్ర డ జుసబషa్‌ఱశీఅaశ్రీ టబఅస టశీతీ ్‌ష్ట్రవ ఎవసఱషaశ్రీర్‌బసవఅ్‌ర)ని దేశంలోనే మొదటి సారి ప్రభుత్వ రంగంలో ప్రారంభమైది. తెలంగాణ ప్రభుత్వ చొరవని Iజవీ= అభినందించింది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో 2778 పోస్టుల నియమాకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నియామక ప్రక్రియ జరుగుతున్నది. ఇక 6180 పోస్టులు కొత్తగా సృష్టించబడ్డాయి.

ఆశా వర్కర్లకు వరాలు
ప్రభుత్వం ఆశా వర్కర్లకు రూ.6వేలు కనీస వేతనంగా తప్పనిసరిగా అదేవిధంగా చేసింది. వాళ్ళకి తగు శిక్షణ నిస్తూ, ఙఱశ్రీశ్రీaస్త్రవ ష్ట్రవaశ్ర్‌ీష్ట్ర షaతీవ జూతీశీఙఱసవతీలుగా ప్రణాళికా బద్దంగా చీజణ (దీూ,ూబస్త్రaతీ వ్‌ష) వంటి పనులు వారి ద్వారా జరుగుతున్నాయి.

వాహనాలు-వైద్య సేవలు
108 వాహనాలు అందిస్తున్న సేవలను విస్తత పరుస్తూ, ఇప్పటికే ఉన్న 145 కొత్త వాహనాలకు తోడుగా మరో 145 కొత్త వాహనాలను సమకూర్చారు. రోజుకు 4.18 వేల ట్రిప్పులు ఈ వాహనాలు తిరుగుతున్నాయి. వీటికి అదనంగా 104వాహనాలు పని చేస్తున్నాయి. మారు మూల గల్లీలకు వెళ్ళి ఎమర్జెన్సీ సమయంలో రోగులను సకాలంలో హాస్పిటల్స్‌కి చేర్చడం కోసం 108 బైక్‌ అంబులెన్స్‌లని ఏర్పాటు చేశారు. నిరుపేదలకు నిరంతర మొబైల్‌ వైద్యం అందించడానికి వీలుగా రెక్కల వాహనా లను ఉపయోగిస్తున్నారు. అమ్మ ఒడి కింద 102 నెంబర్‌ వాహనాల ద్వారా తల్లీబిడ్డలను వారి ఇళ్లకు చేరుస్తున్నారు. ప్రస్తుతం 41 వాహనాలతో నెలకు నికరంగా 1000 మంది గర్బిణీలకు సేవలు అందిస్తున్నారు. నిరుపేదల కు అత్యంత విలువైన సేవలు పార్థివ వాహనాల ద్వారా అందు తున్నాయి. 49 వాహనాలు మృతదేహాలను వారి ఇళ్ళకు చేరుస్తునాయి. వీటి సంఖ్యని కూడా పెంచనున్నారు. ఇది కెసిఆర్‌ మానవీయ కోణానికి మరో మచ్చుతునక.

కెసిఆర్‌ కిట్స్‌
మహిళ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ప్రసూతి అయిన తల్లీ బిడ్డలకు కెసిఆర్‌ కిట్లు ఇస్తున్నారు. బిడ్డకు బేబీ సోప్స్‌, బేబీ ఆయిల్‌, బేబీ పౌడర్‌, రెండు బేబీ డ్రెస్సులు, టవళ్లు, దోమతెర, తల్లికి రెండు చీరలు ఇతరత్రా 15 రకాల వస్తువు లతో కలిపి ప్రభుత్వం కెసిఆర్‌ కానుకగా అందుతున్నాయి. గర్బిణీలకు గర్భం దాల్చిన నాటి నుండే ఉచిత పరీక్షలు చేయిస్తూ, ప్రభుత్వ దవాఖానాల్లో సుఖ, సహజ ప్రసవాలు జరిగే విధంగా, అనవసర ఆపేషన్లను తగ్గిస్త్తూ నిర్వహిస్తు న్నారు. మగ పిల్లాడు పుడితే రూ.12వేలు, ఆడ పిల్ల పుడితే రూ.13 వేలను నాలుగు విడతలుగా ఇస్తున్నాం. ఇప్పటి వరకు రెండున్నర లక్షల కిట్స్‌ని పంపిణీ చేశారు.
tsmagazine
ఆరోగ్యశ్రీ సేవలు
ఆరోగ్యశ్రీ చికిత్సలను ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పెంచగా, గతంలో 30శాతం మాత్రమే ఉన్న చికిత్సలు 40శాతం వరకు పెరిగాయి. ఆరోగ్యశ్రీలో మరిన్ని చికిత్సలను చేర్చి, పట్టిష్ట పరిచారు. ఇక దశాబ్దాల తరబడి ఉద్యోగులు, జర్నలిస్టులు ఎదురుచూసిన, ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాని ఉద్యోగుల, పెన్షనర్ల, జర్నలిస్టుల హెల్త్‌ స్కీం విజయవంతంగా నడుస్తున్నది. అవుట్‌ పేషంట్స్‌ సేవలకు ప్రత్యేకంగా వెల్‌నెస్‌ సెంటర్‌ని ఏర్పాటు చేసి, అన్ని రకాల పరీక్షలు, మందులు ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం 4 చోట్ల ఉన్న వెల్‌నెస్‌ సెంటర్లను అన్ని పాత జిల్లా కేంద్రాలకు విస్తరిస్తున్నారు.

రోగులకు సమగ్ర వైద్య సేవలు అందే విధంగా ప్రభుత్వం చూస్తున్నది. సమగ్ర సానిటేషన్‌, సెక్యూరిటీ, పేషంట్‌ కేర్‌ సేవల పథకం ద్వారా సర్కార్‌ దవాఖానాలకు వచ్చే రోగులకు పూర్తి స్థాయి మంచి వైద్యం అందిస్తున్నది. ప్రతి పడకకు రూ.5వేల వ్యయంతో ఈ సేవలను నిర్వహిస్తున్నది.

మైలు రాళ్ళు
ప్రపంచ ఆరోగ్య సూచీ (+ూI-ూ=ూ తీవజూశీత్‌ీ)ల అన్నింట్లో తెలంగాణే ముందున్నది. సర్కార్‌ దవాఖానాల్లో 30శాతం ఓపీ పెరిగింది. ఆరోగ్యశ్రీ చికిత్సలు 12శాతం పెరిగాయి. శిశు మరణాలను Iవీ=- Iచీఖీూచీు వీూ=ుూకూIు్‌ =ూుజు-ప్రతి వెయ్యి మందికి 32 నుంచి 28 కి తగ్గింది. అలాగే వీవీ=-వీూునజు= వీూ=ుూకూIు్‌ =ూుజు-తల్లుల మరణాల రేట్‌ ప్రతి లక్ష మందికి 92 నుంచి 71 కి తగ్గాయి.

ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రసూతిలు 30శాతం నుండి 50 శాతానికి పెరిగాయి. కెసిఆర్‌ కిట్లు, ఆర్థిక సాయం పథకం వల్ల ఇది సాధ్యమైంది.

మిషన్‌ ఇంద్ర ధనుష్‌-IవీవీఖచీI్గూుIూచీ ూ=ూ+=ూవీవీజు- కింద టీకాలు ఇచ్చే రాష్ట్రాల్లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ ను కేంద్రం ప్రకటించింది. టీకాల వల్ల విష జ్వరాలు తగ్గాయి. రాష్ట్రం టీకాల కార్యక్రమంలో 62శాతం నుండి 90శాతానికి పెరిగింది.

ప్రభుత్వ దవాఖానాల పనితీరు బాగా మెరుగు పడి, రోగుల రాకడ 23శాతం పెరిగింది. భారత ప్రభుత్వం అభినందించింది.

టీచింగ్‌ దవాఖానాల్లో 7420 నుండి 10,050కి పెంచాం. ఓపీ సేవలు విస్త తమయ్యాయి. 2014లో 3.35 లక్షల ఓపీ ఉండగా, 2016 నాటికి అది 4.51లక్షలకు పెరిగింది. భారత ప్రభుత్వం ప్రశంసించి అవార్డునిచ్చింది.2014లో 13.73 లక్షలు ఇన్‌ పేషంట్లు ప్రభుత్వ దవాఖానాలకు రాగా, 2016కల్లా ఇది 20.24లక్షలకు పెరిగింది.

ఇంటింటికీ కంటి వెలుగు
అంధత్వ నివారణ లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా కంటి అద్దాలు, అవసరమైన శస్త్ర చికిత్సలు చేస్తారు. ఇందుకు ప్రణాళిక సిద్ధమైంది.

సమగ్ర ఆరోగ్య సర్వే
గతంలో ఇంటింటి సర్వే నిర్వహణతో చరిత్ర సష్టించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా సమగ్ర హెల్త్‌ ప్రొఫైల్‌ని సిద్ధం చేస్తున్నది. ఎవరెవరికి ఏయే ఆరోగ్య సమస్యలున్నాయన్నది సర్వే చేసి, రికార్డు చేసి, కంప్యూటర్ల లోనిక్షిప్తం చేసి ఆల్‌ టైమ్‌ ఎవరు ఎక్కడున్నా వైద్య సేవలు అందేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నది.

అవార్డులు-రివార్డులు

  • హెల్త్‌ కేర్‌ ఎక్సలెన్స్‌ ఫిక్కీ అవార్డు
  • క్యూసీఐ డిఎన్‌ షా క్వాలిటీ అవార్డు
  • బెస్ట్‌ స్టేట్‌ ఈ-గవర్నెన్స్‌ అవార్డు ఫర్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌ బీయింగ్‌ సిఎస్‌ఐ-నిహిలెంట్‌
  • కెసిఆర్‌ కిట్స్‌ టాప్‌ మోస్ట్‌ స్కోచ్‌ అండ్‌ మెరిట్‌-స్కోచ్‌ అవార్డులు

Other Updates