hydవైఫై సేవలతో నగరం ఐటీలో అన్ని నగరాలకన్నా ముందు ఉండబోతోంది. ప్రభుత్వరంగసంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌, క్వాడ్‌జెన్‌ కంపెనీతో కలిసి ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా వైఫై ప్రాజెక్టును తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఏప్రిల్‌ 16న ప్రారంభించారు.

హుస్సేన్‌సాగర్‌ చుట్టూరా 10 కిలోమీటర్ల పరిధిలో ఉచిత వైఫై సేవలను మంత్రి కేటీఆర్‌ అమలులోకి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఐటీశాఖామంత్రి, కేంద్ర ఐటీ, టెలీకమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను వైఫై వీడియో కాల్‌లో సంప్రదించి ఆయనతో మాట్లాడారు.

నేను డీల్లీిలో మీరు హైదరాబాద్‌లోవుండి మాట్లాడుకుంటున్నామంటే ఇదంతా సాంకేతిక విప్లవంవల్లే సాధ్యమయ్యింది. దేశమంతటా 2500 ప్రాంతాలలో బీఎస్‌ ఎన్‌ఎల్‌ వైఫై సేవలను ఏర్పాటు చేయనున్నది. ముందుగా వారణాసిలో ప్రారంభించేశాం. ఇప్పుడు పర్యాటక ప్రాంతమైన హుస్సేన్‌సాగర్‌ పరిధిలో ఉచిత వైఫై సేవలు ఏర్పాటు చేయడం ఆనందదాయకం అని కొనియాడారు మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.

తెలంగాణలోని కోటి కుటుంబాలకు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వాటర్‌గ్రిడ్‌ కోసం నిర్మించబోయే 80వేల కిలోమీటర్ల పైప్‌లైన్ల బాటనే ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ళను వేసి, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌తోబాటు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ను కూడా అందజేసేవిధంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు కేటీఆర్‌. తెలంగాణలో వున్న అన్ని మునిసిపల్‌ కార్పోరేషన్లకు వైఫై సేవలను సమకూరుస్తామన్నారు. తొందరలోనే వరంగల్‌, కరీంనగర్‌, రామగుండం, నిజామాబాద్‌, ఖమ్మం కార్పొరేషన్లలో వైఫై సేవలను అందుబాటులోకి తెస్తామని అన్నారు. అలాగే తెలంగాణ అంతటా 4జీ, 5జీ నెట్‌వర్క్‌ సేవలను అందజేయ డానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌ నగరంలో వైఫై సేవలను ఉచితంగా అందించడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ముందుకు రావడం అభినందదాయకం అన్నారు ఐటీశాఖమంత్రి తారక రామారావు. కొన్నివారాల కాలంలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు ఏర్పాట్లన్నింటినీ చక్కగా అమర్చి పెట్టడం ప్రశంసించాల్సిన అంశం అని పేర్కొన్నారు.

తొలిదశలో భాగంగా పర్యాటక ప్రాంతమైన ట్యాంక్‌బండ్‌ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కల్పించిన ఉచిత వైఫై అవకాశాన్ని, త్వరలో నగరమంతటా దాదాపు 2000 కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్నాని మంత్రి అన్నారు. స్పెక్ట్రమ్‌ ఖరీదైనది కావడంతో హైబ్రీడ్‌ సాంకేతికతో వైఫై సేవలను అందిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ సీజీయం మురళీధర్‌ తెలియజేశారు. క్వాడ్‌జెన్‌ ఛైర్మన్‌ సీఎస్‌ రావుతోపాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఫై ఎనేబుల్డ్‌ సిటీ మారనున్న హైదరాబాద్‌ నగరం స్మార్ట్‌సిటీల వరుసలో చేరబోతున్నది. ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కో, లండన్‌, బార్సిలోనలాంటి నగరాలు మాత్రమే వైఫై ఎనేబుల్డ్‌ సిటీలుగా వున్నాయి. నగరాన్ని వైఫై ఎనేబుల్డ్‌ సిటీగా రూపొందించడం కోసం, ఇప్పటికే నగరంలో నాలుగువేల కిలోమీటర్ల వరకు వ్యాపించి వున్న ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోబుతున్నది ప్రభుత్వం.

తొలి విడతలో తెలంగాణాలోని 50 గ్రామాల్లో వైఫై ప్రాజెక్టులను నెలకొల్పనున్నారు. ఈప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేసేయ్యాలని ప్రభుత్వం పట్టుదలతో వుంది.

Other Updates