marketవ్యవసాయ మార్కెట్లు ఎంత లాభాలు గడిస్తున్నా యన్నది ముఖ్యం కాదని,అవి రైతులకు ఎంతగా ఉపయోగపడుతున్నాయన్నదే ముఖ్యమని, రైతుల సంక్షేమం కోసం ఏ మేరకు పనిచేశామన్నదానిపై మార్కెట్‌ కమిటీ పాలకవర్గాలు దృష్టి సారించాలని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సెప్టెంబరు 7వ తేదీన అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కళాశాల (ఆస్కి)లో ఈ-జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ (ఈ-ఎన్‌ఏఎం)పై వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్‌లు, కార్యదర్శుల రెండు రోజుల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. జాతీయ వ్యవసాయ మార్కెట్‌తో అనుసంధానం చేసేందుకు రాష్ట్రంలోని 44 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను ఎంపిక చేశామని, దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.

రైతులు తమ ఉత్పత్తులను అధిక ధరలకు విక్రయించుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు జరిపి, రైతాంగానికి మద్దతు ధర సాధించడంలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ-జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ ఏకీకృత లైసెన్స్‌ విధానం, ఒకేసారి మార్కెట్‌ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌ వ్యాపార సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం తూకం, కొనుగోళ్ళు, ఎలక్ట్రానిక్‌ తక్‌పట్టీ, రైతు ఖాతాల్లో డబ్బు జమచేయడం వంటివి ఆన్‌లైన్‌లోనే జరిపేందుకు మార్కెటింగ్‌ శాఖను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

ఇందుకుగాను జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌శాఖలో మెరుగైన విధానాలు అమలు పరిచేందుకు తొలిసారి శిక్షణా కార్యక్రమం చేపట్టామన్నారు. మార్కెటింగ్‌శాఖలో అన్ని స్థాయిల్లోను ఆన్‌లైన్‌ విధానం అవలంబించడం, నూతన విధానాలు అమలుపరిచేందు కు, మార్కెటింగ్‌ శాఖను బలో పేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆస్కీతో ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి తెలి పారు. కేంద్రం అమలుచేస్తున్న ఈ- జాతీయ వ్యవసాయ మా ర్కెటింగ్‌ విధానం ద్వారా రైతు లు తమ పంటను దేశవ్యా ప్తంగా ఏ మార్కెట్‌లో అయినా మద్దతు ధరకు విక్రయించేం దుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ విధానం ద్వారా మన రాష్ట్రానికి చెందిన 19,600 టన్నుల ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు. ఇంకా అధిక మొత్తంలో విక్రయించేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

ఆస్కి చైర్మన్‌ పద్మనాభయ్య మాట్లాడుతూ రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం కలగాలంటే ఆన్‌లైన్‌ విధానం పూర్తిస్థాయిలో అమలు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ శరత్‌, ఆస్కి డైరెక్టర్‌ జనరల్‌ పరమితదాస్‌ గుప్తా, పలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Other Updates