ఒక జాతి చరిత్ర వ్రాయడం ఏ మాత్రం సుభమైన విషయం కాదు. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ వ్రాయడానికి సుప్రసిద్ధ రచయిత, సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి కొన్నేండ్లపాటు చదవని ప్రాచీనగ్రంథం లేదు. పరిశీలించని చరిత్రలేదు. పరిశోధించని ఇతర పరికరాలు లేవు. అప్పుడుగాని ఆయన అంత సుదీర్ఘకాల౦ కిందటి పరిస్థితున్నీ కనిపెట్టగలిగాడు. ఒక అవగాహనకు రాగలిగాడు. దాన్ని సమకాలీనులకు, రానున్న తరాలకు అనువుగా విప్పి చెప్పగలిగాడు. ఇట్లా ఎంతో క్లిష్టమైనది ఒక జాతి చరిత్రయినా, ఒక ప్రాంత, దేశ, రాష్ట్ర చరిత్రయినా.
ఈ నేపథ్యంలో తాళపత్రగ్రంథాలు, శాసనాలు, నాణాలు, కెయిరనుల (రాక్షసగుండ్ల) ఆధారంగా పులువురు పరిశోధకులు, చరిత్రకారులు, రచయితలు వచ్చిన నిర్ధారణ ఆధారంగా- హైదరాబాద్ సంస్థాన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు, సుప్రసిద్ధ రచయిత, ముఖ్యంగా జీవిత చరిత్రలు వ్రాయడంలో సాధికారం సాధించిన ఎం.ఎల్. నరసింహారావు తాజాగా ‘తెల౦గాణ చరిత్ర’ ఉద్యమాలు-పోరాటాలలు, గ్రంథాన్ని వెలువరించారు. శీర్షిక ప్రకారం తెల౦గాణ చరిత్ర అంటే పూర్వ వృత్తాంతమని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేకపోయినా, సారూప్యత అనిపించే ఉద్యమాలు, పోరాటాలలు మధ్య వైవిధ్యాన్ని వివరించాలి. ‘ఉద్యమం’ అన్నది లక్ష్య సాధనకోసం సామూహికంగా చేసే ప్రయత్నం లేదా కార్యక్రమం, పూనిక, సిద్ధం కావడం అని నిఘంటువు చెబుతున్నది. అట్లాగే ‘పోరాటం’ అంటే మాత్రం యుద్ధం, జగడం, పెనుగులాట అని అర్ధమిచ్చింది. అంటే ఉద్యమమనే పదంలో అహింస గర్భితమై ఉండగా, పోరాటంలో హింసది పై చేయి అని స్ఫురిస్తున్నది.
అదేమైనా ఈ 317 పేజీల గ్రంథంలో ముప్పై ఐదు శీర్షికల ద్వారా రచయిత స్వయంగా చెప్పినట్టుగా తెల౦గాణ చరిత్రను, తెల౦గాణ ప్రజలలో చైతన్యం కలిగించడానికి కృషి చేసిన ప్రజా సంస్థలు, ప్రత్యేక తెల౦గాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన వివిధ ఉద్యమాలు, పోరాటాల గురించి సంగ్రహంగా వివరించారు. తెల౦గాణ అనే పేరు ఎట్లా వచ్చిందో తెలుపుతూ, దక్షిణా పథ మహోజ్వల చరిత్రకు శ్రీకారం చుట్టిన శాతవాహనుల నుంచి ఆరంభించి, కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో తెల౦గాణ రాష్ట్ర సమితి దాదాపు పదమూడేండ్లు చేసిన పోరాటం, గత ఏడాది పాలనలో చంద్రశేఖర రావు ప్రభుత్వం అనుసరించిన ప్రగతిపూరిత విధానాలను ప్రస్తుతిస్తూ పూర్తి చేశారు.
ఇంకా ఇందులో కాకతీయు, కుతుబ్షాహీు, అసఫ్జాహీ పాలన గురించి రేఖామాత్రంగా చెప్పారు. తెల౦గాణలో ప్రజా ఉద్యమాలు, గ్రంథాలయోద్యమం, నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం, ఆర్య సమాజ్ నిర్వహించిన పాత్ర గురించి సందర్భోచితంగా ప్రస్తావించారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించి, తెల౦గాణ పోరాటంలో కమ్యూనిస్టు పాత్ర గురించి, విద్యార్థుల వందేమాతరం ఉద్యమం గురించి పొందుపరిచారు. హైదరాబాద్ సంస్థాన స్వాతంత్య్ర ఉద్యమం- సోషలిస్టు పాత్ర, సరిహద్దు శిబిరాలు, సాయుధ పోరాటం, హైదరాబాద్ విమోచనోద్యమంలో కవులు- రచయితలు నిర్వహించిన పాత్రకు కూడా ఇందులో చోటిచ్చారు. వినోబా భూదానోద్యమం, బూర్గు రామకృష్ణారావు పాలన, ముల్కి ఉద్యమం, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ, ఫజలీ కమీషన్, ప్రత్యేక తెల౦గాణ ఉద్యమం, పి.వి.నరసింహారావు పరిపాలనపై సైతం ఈ గ్రంథంలో సముచితంగా విశ్లేషించి చూపారు.
హాయిగా చదువుకోవడానికి వీలుగా ఆర్ట్ పేపర్పై సచిత్రంగా ముద్రించిన ఈ గ్రంథం తెల౦గాణ వారే కాకుండా చరిత్ర తొసుకోలవానే దాహం గలవారందరు కొంచెం ధర ఎక్కువ అనిపించినా కొని, చదవదగిన గ్రంథమిది. ఇటీవలికాల౦లో పువురు రచయితలు తెల౦గాణపై అనేక గ్రంథాలు వ్రాశారు. ఇంకా వ్రాస్తున్నారు. కాని ఎం.ఎల్. నరసింహారావు వ్రాసిన ఈ గ్రంథం సాధికారికమైంది, సరళమైన శైలితో కూడిoది. కాబట్టి ఈ గ్రంథాన్ని భావిభారత పౌరులైన నూతన యవ్వన ప్రాయంలోని వారికి ఇందులోని అంశాలు గ్రాహ్యం కావాంటే దీన్ని ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఉపవాచకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఎంతో సముచితంగా ఉంటుంది.
– టి. ఉడయవర్లు