cm-kcrశిక్షణా ఖర్చులు భరిస్తాం… తొలి మహిళా పైలట్‌,
మహిళా కరాటే ప్లేయర్‌కు సీఎం హామీ!

హైదరాబాద్‌కు చెందిన మహిళా కరాటే ప్లేయర్‌కు, తెలంగాణ తొలి మహిళా పైలట్‌కు అవసరమయ్యే శిక్షణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీకి చెందిన సయిదా ఫలక్‌ జులై నెలలో జరిగిన చెన్నై కరాటే చాంపియన్‌షిప్‌లో మహిళల వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌మెడల్‌ సాధించింది. గతంలో కూడా ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌లో జరిగే 13వ సీనియర్‌ ఏషియన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొననుంది. దీనికోసం మెరుగైన శిక్షణ కోసం సయిదా ఫలక్‌ సెక్రటేరియట్‌లో జూలై 4వ తేదీన సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. కరాటేలో రాణిస్తున్న సయిదాను అభినందించిన సీఎం శిక్షణకు అవసరమయ్యే ఖర్చులను భరిస్తామని హామీ ఇచ్చారు. ఏషియన్‌ చాంపియన్‌షిప్‌లో రాణించడంతోపాటు భవిష్యత్‌లో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.

అలాగే అదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌కు చెందిన గంటా స్వాతిరావు 2006లో పైలట్‌గా ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి మొదటి పైలట్‌ అయిన స్వాతిరావు ఫిలిప్పీన్స్‌లో ఫ్లైట్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎయిర్‌బస్‌ పైలట్‌గా మారడం కోసం అవసరమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వాతిరావును జూలై 4న సీఎం కేసీఆర్‌ వద్దకు తీసుకువచ్చారు. ఆమెను అభినందించిన సీఎం శిక్షణకు అవసరమైన ఖర్చులను భరిస్తామని హామీ ఇచ్చారు.

Other Updates