భారత పూర్వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశరాజకీయాలో శిఖర సమానుడని, కర్మయోగి అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొనియాడారు. తెంగాణ రాష్ట్ర అవతరణకు సహాయపడినవారిగానే కాకుండా, రాష్ట్ర ఏర్పాటు బ్లిుమీద ఆమోదముద్ర వేసిన ఆనాటి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ తెంగాణ చరిత్రలో నిలిచిపోయారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల కెసిఆర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, రాష్ట్ర శాశనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ…
‘‘భారత దేశ పూర్వ రాష్ట్రపతి, భారత రత్న, పద్మవిభూషణ్ ప్రణబ్ ముఖర్జీ మరణంతో భారతదేశం ఒక శిఖర సమానుడైన నాయకుడిని కోల్పోయింది. అర్ధ శతాబ్దం పాటు భారత రాజకీయాల్లో క్రియాశీ భూమిక పోషించిన కర్మయోగి ప్రణబ్ ముఖర్జీ. 1970 తర్వాత భారత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ పేరు లేని పేజీ ఉండదంటే అది అతిశయోక్తికాదు. ప్రణబ్ దా గా అందరూ గౌరవంగా, ఆత్మీయంగా పిుచుకునే ప్రణబ్ ముఖర్జీ క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావంతో అంచెంచొగా ఎదిగారు.
పశ్చిమ బెంగాల్‌లోని చిన్న గ్రామం మిరాటీలో 1935 డిసెంబర్ పదకొండున జన్మించిన ప్రణబ్ దా చిన్నప్పుడు తమ ఊరికి దూరంగా ఉన్న పాఠశాకు వెళ్ళడానికి ఒక చిన్న వాగును ఈది వెళ్ళవసి వచ్చేది. ఆయన గొప్ప నేతగా ఎదిగిన తర్వాత రాజకీయ సము ద్రాన్ని సమర్థవంతంగా ఈది భారత మాత ప్రియపుత్రునిగా చరిత్రకెక్కారు. 1969 లో రాజ్యసభ సభ్యునిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. చిక్కుముడును విప్పి జటి సమస్యను పరిష్కరించగ నేర్పరిగానే కాకుండా ‘‘మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్’’ గా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమ శాఖ, షిప్పింగ్-రవాణా శాఖ, ఆర్ధిక శాఖ-వాణిజ్య శాఖ, విదేశీ వ్యవహారా శాఖ రక్షణ శాఖ మొదలైన శాఖ మంత్రిగా విశేష సేవందించారు.
భారత దేశ ఆర్థిక వ్యవస్థను ఆమూలాగ్రం అధ్యయనం చేసిన ప్రణబ్ దా ప్రపంచబ్యాంక్, ఏషియన్ డెవప్మెంట్ బ్యాంక్, ఆఫ్రికస్ డెవప్మెంట్ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మొదలైన సంస్థలో అత్యున్నత స్థాయిలో పనిచేసిన ధీరుడు. చేపట్టిన ప్రతి పదవికీ వన్నెతెచ్చిన మహోన్నత రాజనీతిజ్ఞుడిగా, ప్రపంచంలోనే ఐదుగురు అత్యుత్తమ ఆర్థిక మంత్రులో ఒకరుగా కితాబునందుకున్న మేధావి. భారత్ ` అమెరికా వ్యూహాత్మక సంబంధాు తీర్చిదిద్దడంలో ప్రణబ్ దా ముఖ్యభూమిక నిర్వహించారు. సంకీర్ణ ప్రభుత్వా శకం ప్రారంభమైన తర్వాత భారత రాజకీయాల్లో ఏకాభిప్రాయ సాధకుడిగా ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనది. సమన్వయం అవసరమైతే గుర్తొచ్చేది ప్రణబ్ దానే. మిత్రపక్షాను కుపుకొని వెళ్ళడంలో విశ్వసనీయుడైన నేతగా, కుడి ఎడమను సమన్వయం చేసుకున్న సవ్యసాచిగా ఆయన అందరి మన్నననూ పొందారు.
రాజకీయాను పార్లమెంటరీ నిబంధనను ఔపోసన పట్టిన రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీ. ఆయన ఎన్నడైనా ప్రతిపక్షాను సిద్ధాంతపరంగానే తప్ప వ్యక్తిగతంగా విమర్శించేవారు కాదు. పార్లమెంటులో మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పుదొర్లితే వెంటనే సభను క్షమాపణ కోరేవారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య మివకు నిువెత్తు ప్రతీకగా ప్రణబ్ ముఖర్జీ చరిత్రలో నిలిచిపోతారు. భారతదేశ పదమూడవ రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని అధిష్టించిన ప్రణబ్ ముఖర్జీని జాతి నిర్మాణంలో ఆయన అందించిన విశిష్ట సేవకుగానూ 2019లో కేంద్రప్రభుత్వం భారత రత్న పురస్కారం తో సన్మానించింది.
తెంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రతో కూడా ప్రణబ్ ముఖర్జీ పేరు ముడిపడి ఉంది. తెంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వివిధ పార్టీ అభిప్రాయ సేకరణ కోసం నియమించిన కమిటీకి ఆయన సారథ్యం వహించడమే కాకుండా, ప్రజ ఆకాంక్షను అధ్యయనం చేసి పరిష్కారం కోసం ఆనాటి అధిష్టానానికి మార్గదర్శనం చేసారు. రాష్ట్ర అవతరణకు సహాయ పడిన వారిగానే కాకుండా, రాష్ట్ర ఏర్పాటు బ్లిు మీద ఆమోద ముద్ర వేసిన ఆనాటి రాష్ట్రపతిగా తెంగాణ చరిత్రలో నిలిచిపోయారు.
అనేకానేక రాజకీయ సంఘర్షణ నడుమ సైతం అజాత శత్రువుగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ ఆగస్టు 31 వ తేదీన తిరిగి రాని లోకాకు వెళ్ళిపోయారు. భారత పూర్వ రాష్ట్రపతి, భారతరత్న, పద్మవిభూషణ్ ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెంగాణ రాష్ట్ర శాసన సభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ప్రణబ్ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరాని కోరుకుంటున్నది.
ప్రజాస్వామ్యం, జాతీయవాదం, లౌకికతత్వం అనే మూడు అంశాు ప్రాతిపదికగా ప్రణబ్ ముఖర్జీ దృక్పథం రూపొందింది. ఆ మివ కొనసాగింపుగా వారి జీవనయానం కొనసాగింది. ఆయన నమ్మిన మివను నిబెడుతూ దేశఅభ్యున్నతికి పాటుపడటమే ప్రణబ్ దాకు మనం అందించగ నిజమైన నివాళిగా ఈ సభ భావిస్తున్నది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.