ఒక రచనకు వస్తువు, వర్ణనలు, పాత్రలు ఎలాంటి సొబగును చేూర్చుతాయో ‘శైలి’ ూడా అంతే శోభను చేూర్చుతుంది. శైలి అనే మాటకు పనితనం, నైపుణ్యం, అందం, చమత్కారం, పద్ధతి అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు. ఏ రచనలోనైనా రచయిత లేదా రచయిత్రి ఏం చెప్పారు? ఎలా చెప్పారు? అని పాఠకుడు ఆలోచించడం సహజం. ఏమి చెప్పారన్నది వస్తువైతే, ఎలా చెప్పారన్న విషయాన్ని శిల్పమనవచ్చు.
శిల్ప ప్రధానమైన సాహితీ ప్రక్రియనే కథానిక. ఈ లక్షణం డా.లక్ష్మీరాఘవ కథల్లో కనిపిస్తుంది. పాత్ర శిల్పం, వాస్తవికతా శిల్పం, భాషా శిల్పం, సంభాషణలు ‘అపురూపం’ కథల్లో శిల్పానికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి.
తరానికీ, తరానికీ మధ్య ఉన్న తార తమ్యాలు విలువల పట్ల మారుతున్న ధోరణులు ‘అపురూపం’ కథలో చక్కగా వ్యక్తం చేశారు. ఈనాటి సమాజంలో రత్నలాంటి కోడళ్ళు ఉండటం ఎంతో అవ సరం. కుటుంబాలకు గర్వకారణంగా ఉంటుంది. అత్త, కొడుకు, కోడలు, ూతురు, మనవరాళ్ల పాత్రలతో స్వయం సమగ్రంగా తీర్చిదిద్దారు డా.లక్ష్మీరాఘవ. ఒక తరం వస్తువులు, వాటి తాలూకు జ్ఞాపకాలు ఎంత అపురూపంగా ఉంటాయో ఈ కథలోని పాత్రల ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రోజుల్లో గృహప్రవేశానికి ూడా విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెడుతున్నారు. సామాన్యుడు ఆ డబ్బుతో తన ూతురు వివాహం చేసుకోవచ్చు. వృధా ఖర్చులు వద్దంటూ మంచి నీతి బోధ చేస్తుంది. ‘ఇలా చేస్తే’ కథ. నోట్ల రద్దు సామాన్యుణ్ణి ఎంత మనోవేదనకు గురిచేసిందో ‘సర్జికల్ సాయం’ కథ తెలుపుతుంది. వృద్ధ దంపతులు పడిన కష్టాలు కంటతడి పెట్టిస్తాయి. ఈ పుస్తకంలో ఇరవై మూడు కథలున్నాయి.
పేదలు, ధనికులు, మధ్యతరగతి, వారి వారి జీవనశైలి, కష్టాలు, సమస్యలు కథల్లో చర్చించారు. సమస్యల పరిష్కారాలు కొన్ని సూచిస్తారు. మరికొన్ని పాఠకుల ఆలోచనకు వదిలేస్తారు. నైతిక, మానవీయ విలువలకు అగ్రస్థానం కల్పించిన ఈ రచయిత్రి కథలు ప్రతి ఒక్కరూ చదవదగినవి. నిరుపమానమైనటువంటివి, శిల్పానికి ప్రతిబింబాలుగా ఉన్నటువంటి ‘అపురూపం’ కథలు మనసులో దాచుకోదగినవి, నలుగురితో పంచుకోదగినవి.
– డా|| గన్నవరం వెంకటేశ్వర్లు