sankalappamశ్రీ బుక్కా అశోక్‌

ఒకే రోజు మల్కాపూర్‌ ఊరంతా నల్లా కనెక్షన్లు! 324 ఇళ్లకు ఇంటింటా నల్లాలు తలో చేయి వేసి శ్రమదానం చేశారు ఇరవైనాలుగు గంటలు…. మూడున్నర కిలోమీటర్ల పైప్‌లైన్‌ 

ఇదో మారుమూల కుగ్రామం. వెనుకబాటు మినహా అభివృద్ధి అంటే తెలియదు. ఈ గ్రామాన్ని నక్సల్స్‌ ప్రాబల్య సమయంలో పోలీసులు దత్తత గ్రామంగా ప్రకటించారే తప్ప అభివృద్ధి చేపట్టలేదు. ఇలాంటి గ్రామంలో గ్రామస్తులు ఐక్యమత్యంతో చేపట్టిన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శమైంది. వారంతా ఒక్కరోజులో ఊరంతా ఇంట్రావెల్‌గ్రిడ్ పైప్‌లైన్లు వేశారు. 324 ఇళ్లకు ఇంటింటా నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఇదంతా మారుమూల పల్లెల్లో ఏప్రిల్‌ 5న ఆవిష్కృతమైంది. ఇదీ జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ దత్తత తీసుకున్న మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌ గ్రామం. ఊరంతా చేయి చేయి కలిపి కొత్త అధ్యాయానికి తెరతీసి ఓ చరిత్ర సృష్టించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేకర్ రావు తన గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి, నర్సన్నపేటల తను దత్తత తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ ఇదే నియోజకవర్గంలోని మల్కాపూర్‌తో పాలు, మనూర్‌ మండలం రాణాపూర్‌, హత్నూర మండలం నవాబుపేటలను దత్తత తీసుకున్నారు. మల్కాపూర్‌ను 2015 ఆగస్టు 25న దత్తత తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ప్రకటించారు. మల్కాపూర్‌లో అభివృద్ధి పై యువకులు ప్రత్యేక శ్రద్ద చూపించడంతో కలెక్టర్‌ సైతం మల్కాపూర్‌ను ఆదర్శ గ్రామంగా తయారుచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే మల్కాపూర్‌లో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం 100 శాతం పూర్తి చేశారు. ప్రత్యేక నిధులతో సోలార్ దీపాలు ఏర్పాటు చేయడం, హరితహారంలో 500 మొక్కల పెంపకం చేస్తు చెత్తలేని గ్రామంగా తయారుచేశారు. మురుగులేని గ్రామంగా మల్కాపూర్‌ను తయారు చేశారు. 100 శాతం అక్షరాస్యత గ్రామంగా ప్రకటించడానికి ఇటీవల మార్చి 20న జరిగిన ఎన్‌ఐఓఎస్‌ పరీక్షను ఊరంతా రాసింది. మిషన్‌ భగీరథ పథకంలో ఒకే రోజు ఊరంతా ఇంట్రావెల్‌గ్రిడ్‌లో పైపులైను వేసి, 324 ఇళ్లకు ఇంటింటి నల్లా కనెక్షన్లు ఇవ్వడానికి గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే ఏప్రిల్‌ 4న రాత్రంతా పథకం తయారు చేసుకున్నారు. 5న ఉదయం 7గంటల నుంచే గ్రామ యువకులు శ్రమదానం చేస్తూ పనులు మొదలుపెట్టారు. ఊరు ఊరంతా ఉప్పెనలా కదలివచ్చి ఉద్యమంగా శ్రమదానంతో పైపులైన్లు వేసుకున్నారు. రోజుల తరబడిగానీ వేయలేని 3.8 కిలోమీటర్ల పొడవైన ఇంట్రాగ్రిడ్‌ పైపులైన్‌ను 8 గంటల్లోనే గ్రామస్తులు శ్రమదానంతో పూర్తి చేసుకున్నారు. యుద్ధ ప్రాతిపధికన అధికారులు ఇంటింటికీ నల్లా కనెక్షన్లను ఇచ్చారు. ఇంటింటా 324 నల్లా కనెక్షన్లు అధికారులు ఇచ్చేయగా, ప్రజలు పూర్తి సహకారం అందజేశారు. ఒకే రోజు ఊరంతా ఇంట్రావెల్‌గ్రిడ్ పైపులైను వేయడాన్ని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌ మల్కానూర్ విచ్చేసి ప్రత్యేకంగా పరిశీలన చేశారు. మల్కాపూర్‌లో ఆరంభమైన ఇంట్రాగ్రిడ్‌ పైపులైన్‌ ఉద్యమంతో పలు గ్రామాల యువకులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. మల్కాపూర్‌ స్ఫూర్తిగా ఇదే మండలంలోని వెంకటాయపల్లిలో ఏప్రిల్‌ 16న ఒకేరోజు ఇంట్రాగ్రిడ్ పైపులైను వేసుకున్నారు. వెంకటాయపల్లిలో చేపట్టిన ఒకేరోజు ఇంట్రాగ్రిడ్‌ పైపులైన్‌ను చూసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కదిలివచ్చింది. మరో గ్రామం యావాపూర్‌ను ఇదే స్పూర్తిగా వేసేందుకు గ్రామస్తులు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

మల్కాపూర్‌లో చేపట్టిన ఇంట్రాగ్రిడ్‌ పైపు లైన్‌ను వరంగల్‌ జిల్లా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జాయింట్‌ కలెక్టర్ వాటర్ గ్రిడ్ ఎస్ఈ, ప్రజా ప్రతినిధులు పరిశీలన చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ డా. జగనమోహన్, నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డిలు సైతం పరిశీలన చేశారు.

Other Updates