నిర్ధిష్టమైన ప్రణాళికలతో రూపొందించిన సంక్షేమ పథకాల అమలు ద్వారా సామాజిక మార్పు సాధనే లక్ష్యంగా, సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ప్రజల మధ్య పనిచేస్తూ ప్రజల ఆశలు, ఆశయాల దిశగా పధ్నాలుగేళ్లు ఉద్యమించిన టి.ఆర్.ఎస్. అనేక కోణాల్లో భవిష్యత్ ప్రణాళికలను రూపుకల్పన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజల అనూహ్య ఆదరణతో అధికారంలోకి వచ్చిన టి.ఆర్.ఎస్., ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వేగంగా పథకాలను అమలుచేయడం మొదలు పెట్టింది. సుదీర్ఘమైన ఆలోచనలు, చర్చలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి సమగ్రమైన దృక్పథం, దృష్టితో ముందుకు సాగుతున్నది. ఇంత వేగంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిర్ధిష్టంగా మలుపు తిప్పడం, అమలు చేయడం అసాధ్యం. అయితే
ఉద్యమంకన్నా వేగంగా ప్రభుత్వ పథకాలు, ప్రతిపాదనలు ముందుకు సాగడం గత రెండున్నరేళ్లుగా దేశాన్ని అబ్బురపరుస్తున్న విషయం కాదనలేనిది. రాజకీయ పక్షాలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కూడా ఈ పథకాల వేగాన్ని, నూతన ఆలోచనలను పసిగట్టడం గానీ, అందుకోవడం గానీ సాధ్యం కావడం లేదు. విమర్శకులు ఏదో ఒక రంధ్రాన్వేషణ చేయాలనుకుని ఆలోచించేలోగానే ఆ పథకం అమలు మొదలై మరో కొత్త పథకం సముద్రంలోని అలల్లా ప్రజల తీరాన్ని తాకుతూనే ఉన్నాయి. ఈ సముద్ర పోరులో సాగుతున్న వేగవంతమైన మార్పులు, పరిస్థితులు పరిపాలన వ్యవస్థలో ూడా సమూలమైన మార్పులు తీసుకొని ప్రజల చెంతకు తీసుకు రావడానికి జవాబుదారీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నజిల్లాల ఏర్పాటు మరిన్ని పోలీస్ కమిషనరేట్‌లు, రెవెన్యూ డివిజన్‌లు, మునిసిపాలిటీలు, మండలాలు, నగర పంచాయితీలు ఏర్పాటు ఇందులో భాగమే.
సామాజిక వర్గాల కులాల, కులవృత్తుల స్థితిగతులను అధ్యయనం చేసిన తెలంగాణ ప్రభుత్వం వాటిని ప్రాతిపదికగా తీసుకొని నూతన ప్రణాళికలను ముందుకు తీసుకురావడం జరుగుతున్నది. జిె టు పిజి ఉచితవిద్య, ఇంటింటికి ఉచిత రక్షిత నల్లానీరు, కోటి ఎకరాలకు సాగునీరు, ఉచిత ప్రభుత్వ వైద్యం, కుల వృత్తులలో నైపుణ్యం పెంపొందించడానికి కృషి చేస్తున్నది. ప్రభుత్వ శాఖలలో భర్తీకి అవకాశాలు, ఖాళీలు అందుబాటులోకి వస్తున్న మేరకు పారదర్శకంగా, అవినీతిరహితంగా టి.ఎస్.పి.ఎస్.సి. ద్వారా నోటిఫిషేన్‌ల జారీ పరంపర కొనసాగుతూనే ఉంది. ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అయిన టి.హబ్‌ను ఏర్పాటుచేయడం ద్వారా నూతన ఆలోచనలతో వందలాది స్టార్టప్‌లు పెద్దఎత్తున ఏర్పాటవుతున్నాయి. దీంతో ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ ఊహించని విధంగా పెరుగుతున్నది. ప్రపంచంలోనే దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్‌కు రాకతో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలకు కొదవలేకుండా పోయింది.
10 పాత జిల్లాలు లేదా 31 కొత్త జిలాల్లో ఇలాంటి క్యాబ్‌లు, ఆటోలు, ట్రాలీల ద్వారా మరో 3 లక్షల మంది ఉపాధిపొందే అవకాశం పెరుగుతున్నది. ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ రంగాల్లో 20 వేలకు పైగా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతున్నది. ఇందులో స్యూెరిటీ గార్డులు మొదలుకొని తహసీల్దారులు, ఎస్.పి.లు, డిప్యూటీ కలెక్టర్‌లు, పోలీస్ కమిషనర్‌లు, కలెక్టర్‌లు, పారిశ్రామిక అభివృద్ధి అధికారుల దాకా ఎన్నో శాఖలకు సంబంధించిన వారు ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా జాతీయీకరణకు బదులుగా ంద్ర, రాష్ట్ర పారిశ్రామిక రంగాలను ప్రైవేట్ రంగాలకు అప్పగిస్తూ వస్తున్నారు. ప్రైవేటీకరించిన తరువాత మూడింట ఒక వంతు లేదా సగానికి పైగా ఉద్యోగులను, కార్మికులను, సిబ్బందిని తొలగిస్తున్నారు. అలా తెలంగాణలో గత 50 ఏళ్లలో నైజావ్‌ు కాలం నుండి కొనసా గుతూ వచ్చిన డెబ్బయికి పైగా పరిశ్రమలను ప్రైవేటీకరించడం లేదా మూసివేయడం ద్వారా లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. ప్రాగాటూల్స్, ఆల్విన్, సన్‌సిల్క్, రిపబ్లికన్ ఫోర్జ్, డిబిఆర్‌మిల్స్, ఆజాంజాహి మిల్స్, ఐ.డి.పి.ఎల్. మొదలైన అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. తద్వారా 8 లక్షలకు పైగా సంఘటిత కార్మికులు, ఉద్యోగులు నిరుద్యోగులై రోడ్ల మీద పడ్డారు. వారి జీవితాలు, కుటుంబాలు, పిల్లల భవిష్యత్తు రోడ్డున పడ్డాయి. వీరిని పట్టించుకొన్న వారు లేరు.
ఈ దయనీయ దుస్థితిని ఒక్క రోజులో, ఒ సంవత్సరంలో మార్చడం అంత సులభం కాదు. ఎంత వీలైతే అంత తొందరగా ఇలాంటి లక్షలాది మంది ఉపాధిని కోల్పోయిన వారికి, వారి పిల్లలకు నూతన పరిశ్రమలలో, నూతన నైపుణ్యాలతో, సేవా సంస్థలలో శిక్షణనిచ్చి ఎదిగించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగానే కులవృత్తుల నైపుణ్యాలను పెంచడం, అనేక సంస్థలను పునరుద్ధరించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. 30 ఏళ్లు, 2 తరాలు వెనుకబడిపోయిన జీవితాలు వీరివి. వీరికోసం ఆనాడు సహకార పద్ధతిలో టాేయించిన ఇళ్ళ స్థలాలు, ఇళ్లు కాస్త ధర పెరిగి ఆసరా అయిందన్న ఆశతప్ప వారికి మిగిలిందేమీ లేదు. ఆనాడే 8 లక్షల మంది ఉపాధి కోల్పోతే జనాభా పెరుగుదల ప్రకారం ఇందుకు సంబంధించిన జనాభా 14 లక్షలు అయి ఉంటుంది. ఇలా పరిశీలించినప్పుడు హైదరాబాద్ నగరంలో క్యాబ్‌లు, ట్యాక్సీల డ్రైవర్‌లుగా 1 లక్ష మందికి ఉపాధి లభిస్తున్నది. త్వరలో కొత్త జిల్లాల ంద్రాలలో మరో 3 లక్షల మందికి ఉపాధి తప్పక లభిస్తుంది. ఇలా 4 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది.
ఇలా రెండున్నరేళ్లలో 4 కోట్ల ప్రజల్లో లక్షల మందికి నూతన ఉపాధిని కల్పించడం గానీ, ఆసరా ఇచ్చి మరింత ఎదిగించడం గానీ జరుగుతున్నది. దీనికి తోడు బడుగు, బలహీన వర్గాల, మైనారిటీల పిల్లలకోసం ఉన్నత ప్రమాణాల ఉచిత రెసిడెన్షియల్ జిె టు పిజి విద్య అందించడం కోసం వందలాది రెసిడెన్షియల్ స్కూల్స్, కొన్ని డిగ్రీ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. అన్ని సంక్షేమ పథకాలు వెరశి ఇలా కొన్ని లక్షల మంది పిల్లలకు ఆసరా కావడంలో వారి తల్లిదండ్రులకు ప్రత్యక్షంగా సహకరిస్తుంది. రూపాయికి కిలో బియ్యం ఇంటిలోని ప్రతి మనిషికి 4 కిలోలకు బదులుగా 6 కిలోలు చొప్పున ఇస్తూ ప్రధాన ఆహార అవసరాలను తీర్చుతుంది. వచ్చే ఏడాదిలోగా ఇంటింటికి నల్లానీరు అందించడం ద్వారా ఆరోగ్యపథకం, అంటు వ్యాధుల నివారణకు మార్గం వేయడం జరుగుతున్నది. ఇలా సంక్షేమం ద్వారా నైపుణ్యాల శిక్షణ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు చేూర్చే పథకాల ద్వారా ప్రతిగ్రామం లబ్ధి పొందుతున్నది. కొన్ని గ్రామాల్లో అయితే తొంభై శాతం కుటుంబాలు ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ప్రజలకు ఇంతగా చేరువైన ప్రభుత్వం దేశంలో మరొకటి లేదు. ఇలా ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అపూర్వం.
నూతన వృత్తులలో నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వడం వంటి వాటి ద్వారా విద్యార్హతలు ఉన్న వారికి, లేని వారికి ఏకకాలంలో మెరుగైన ఉపాధి అవకాశాలను అందుకోవడానికి కృషిచేయడం జరుగుతున్నది.
ఉదాహరణకు… ఒక్క హైదరాబాదు నగరంలోని ఊబర్, ఓలా వంటి క్యాబ్ సేవల ద్వారా 80 వేల మంది డ్రైవర్‌లు సొంత కార్లతో ఉపాధిని పొందడం గమనించవచ్చు. వీటికి తోడు రూ. 15 వేలకు పైగా నూతన ఆటోలకు అనుమతిలివ్వడం గమనించవచ్చు. ఇలా ఒక్క హైదరాబాదు నగరంలోనే డ్రైవర్లు రూ. 10 వేల నుండి రూ. 30 వేల దాకా సంపాదించుకునే అవకాశం కలిగింది. ఇందుకు ఎస్.సి., ఎస్.టి. కార్పోరేషన్‌లు, బ్యాంకులు, ప్రభుత్వ గ్యారంటీలు, సబ్సిడీలు చేయూతనివ్వడం వల్లనే ఈ మార్పు సాధ్యపడింది. ఇలా ఒక లక్ష మంది అసంఘటి తరంగం నుండి డ్రైవర్‌లుగా సంఘటిత రంగంలోకి మారడం చిన్నవిషయమేమీ కాదు.
ముఖ్యంగా నూతన భవన నిర్మాణాలు, రోడ్లు, ఇటుక బట్టీలు, స్వచ్ఛభారత్‌లో భాగంగా చెత్త కోసం ఆటోట్రాలీలు, జాతీయ రహదారుల అభివృద్ధి, చెరువులలో చేపల పెంపకం, చెరువులు, కుంటలు, గ్యారేజీలు, నీటి ప్రాజెక్టుల ద్వారా సుమారుగా 30 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. వీళ్లందరూ కొత్తగా ఉపాధి పొందుతున్న వారు కాకపోవచ్చు. సింగరేణిలో గతంలో ప్రారంభించిన ఓపెన్‌కాస్ట్ గనుల వల్ల 1 లక్షా 50 వేల మంది కార్మికులు, 75 వేలకు తగ్గిపోయారు. అనారోగ్యం పాలైన కార్మికుల స్థానంలో వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు చాలాకాలం క్రితమే రద్దు చేయబడ్డాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాంటి వేలాదిమందికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించనున్నది. ఆర్.టి.సి.లో మినీ బస్సులను ప్రవేశపెట్టి నూతన మార్గాలలో నూతన ఉపాధి కల్పించే ప్రణాళిక ముందుకు సాగుతున్నది. కొందరు పాతవారు, కొందరు కొత్తవారితో పాటు ఇంతకు ముందున్న ఆదాయం, ఫలసాయం రెట్టింపయి జీవన ప్రమాణాలు పెరగడం కాదనలేని సత్యం.
సాఫ్ట్‌వేర్ రంగంలో సూపర్‌మార్కెట్, మాల్స్, వాహనాల మరమ్మత్తులు వగైరా రంగంలో గత రెండున్నరేళ్లుగా సుమారుగా రెండున్నర లక్షల మంది ఉపాధి పొందడం జరిగింది. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి భద్రతలేని స్థితిని గమనించి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇక్కడి నుండి ప్రభుత్వం దగ్గర రికార్డులు నమోదుచేసి ప్రభుత్వం ద్వారానే గల్ఫ్ దేశాలకు పంపించే ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఏటా వెళుతున్న 50 వేల మంది గల్ఫ్ కార్మికులకు వారి కుటుంబాలలో విశ్వాసం, భద్రత ఏర్పడనున్నది.
రిటైరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి జీవన ప్రమాణాలు, ఆరోగ్యస్థితిగతులు ఎంతో మెరుగుపడుతున్నాయి. హెల్త్‌కార్డుల ద్వారా వారి ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఉచితంగా వైద్యసేవ పొందే అవకాశం కల్పించింది. ఆరోగ్యశ్రీ పథకంతో, ఆసరా పింఛన్, బీడీ కార్మికుల పింఛన్ మొదలైన వాటితో 8 లక్షల మంది దాకా ఊరట పొందుతున్నారు. ఇలా సుమారుగా 40 లక్షల మంది రెండున్నరేళ్ల తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో నూతన జీవన ప్రమాణాలకు ఎదగడం ప్రారంభమైందని ఘంటాపథంగా చెప్పవచ్చు.
డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు