cm-kcrప్రజలు సంఘటితమై ఉద్యమిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఆగస్టు 24న తాను దత్తత తీసుకున్న గ్రామం కరీంనగర్‌ జిల్లా చిన్న మ్కునూరులో గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పాదయాత్ర నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామాలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతమైనపుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందుకు రాజకీయాకు అతీతంగా అందరు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా గ్రామాలో అనుకున్న మార్పు జరగలేదన్నారు.
మహిళలు, దళితులకు సమాజంలో సముచిత స్థానం లభించడంలేదని విచారం వ్యక్తం చేశారు. జాతి నిర్మాణంలో మహిళలు కీలకపాత్ర పోషించాలన్నారు. ఉత్పాదక, అనుత్పాదక రంగాలలో వారు క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మహిళాశక్తిని వినియోగించుకుంటే అద్బుత ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. అందుకు గ్రామప్రజలు సంఘటితమై ప్రతి అభివృద్ధి పనికి కమిటీలు వేసుకుని వాటి ద్వారా సమస్య పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. సీసీ రోడ్లు, మురుగునీటి కలువలు, రక్షిత మంచినీటి పైపులైన్లు, విద్యుత్‌ స్థంభాలు, కమ్యునిటీ హాళ్ళు తదితర వాటి నిర్వహణకు గాను వేరువేరుగా కమిటీలు వేసుకోవాలని అన్నారు.
నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌, వరంగల్‌ జిల్లాలోని గంగదేవ్‌పల్లి గ్రామాలు అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నాయంటే ఆగ్రామ ప్రజల్లో ఉన్న సంఘటిత శక్తే కారణమన్నారు. రోడ్లను, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెత్తను చెత్తబుట్ట ద్వారానే బయటకు పంపడం, నిరుద్యోగుకు ఉపాధి చూపించడం, అన్ని ఇండ్లకు తాగునీటి నల్లాలు ఏర్పాటు చేసుకోవడం, సాగునీటి వనరుపై దృష్టి పెట్టడం, ఇండ్లు లేనివారు ఇండ్లు కట్టుకోవడం, భూమిలేని వారికి భూమిని ప్రభుత్వం ద్వారా సమకూర్చడం ఇలా ఎన్నో పనులు గ్రామాలో జరగాల్సి ఉందన్నారు. వీటన్నింటిని సాకారం చేసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలన్నారు. మ్కునూరు గ్రామాన్ని తాను దత్తత తీసుకున్నానని, ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందు కలగకుండా ఎన్ని కోట్లు ఖర్చయినా వెరవకుండా గ్రామాన్ని మాడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
అనంతరం గ్రామంలో సహపంక్తి భోజనం చేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రభుత్వోద్యోగుతో మాట్లాడారు. ఎవరైనా భూమికవారు ముందుకు వస్తే వారి భూమును ఖరీదుకు తీసుకుని, భూమిలేని పేద దళితుకు పంచుతామన్నారు. గ్రామాభివృద్ధి విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గంగదేవిపల్లి మాజీ సర్పంచ్‌ రాజమౌళితో మాట్లాడిరచి వారి గ్రామంలో వారు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పించారు.
రానున్న రోజుల్లో గౌరెల్లి ప్రాజెక్టుకు గోదావరి నీటిని తెస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పు ఈశ్వర్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ తు ఉమ, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు ఒడిత సతీష్‌బాబు, రసమయి బాల్‌కిషన్‌, బుడిగె శోభ, విద్యాసాగర్‌రావు,గణేష్‌గుప్త, గ్రామ సర్పంచ్‌ మకుటం రాజయ్య, ప్రభుత్వ ఉన్నతాధికాయి పాల్గొన్నారు.

Other Updates